Latest Updates
-
మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై 5 కొత్త రూల్స్.. ఇవి తెలియకపోతే ఇబ్బందే! -
అన్నం మిగిలిపోయిందా? అయితే ఈ ఇండోనేషియా స్టైల్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి! -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణులు, పీసీఓఎస్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
మండుటెండల్లో కిడ్నీలకు ముప్పు.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ రెసిపీ.. టేస్టీ అండ్ హెల్తీ సొరకాయ దహీ తడ్కా -
లివ్-ఇన్ రిలేషన్షిప్లో బ్రేకప్ అయ్యిందా? ఇకపై క్రిమినల్ కేసులు పెట్టడం అంత సులభం కాదు! -
నోరూరించే మామిడికాయ పచ్చడి..ప్రెషర్ కుక్కర్ లో అప్పటికప్పుడు ఈజీగా చేసేయండిలా.. -
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ బనానా లస్సీ.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోద్ది! -
డేటింగ్ యాప్స్‌లో కొత్త రకం ఉచ్చు.. మీ ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారా? -
పొద్దున్నే లేవగానే ఒళ్లంతా నొప్పులా? కండరాలు పట్టేస్తున్నాయా? ఆ వ్యాధులకు సంకేతమే!
మద్యం తీసుకోవడం వల్ల ఎదురయ్యే హెల్త్ ప్రాబ్లెమ్స్
మద్యం ఎక్కువగా త్రాగే వారిని ప్రశ్నించినట్లైతే.. వారు మద్యం సేవిస్తున్నాం అన్న విషయాన్ని చెప్పుకోవడానికి ఇష్టపడరు. అది కూడా వారు మోడ్రన్ డింకర్స్ గానో, సోషియల్ డ్రింకర్స్ గాను చెప్పుకోవడానికి ఇష్టంపడుతారు. ఒక్కో సందర్భంలో ఈ మోడ్రన్ డ్రింకర్స్ కూడా తాము తాగుతామని చెప్పడానికి మెహమాటపడుతారు. వారు రెగ్యులర్ గా కాకుండా అప్పుడప్పుడూ త్రాగేవారైన కూడా వారిలో ఆరోగ్యం సమస్యలు ఉంటాయి.
ఈ ఆరోగ్య సమస్యలు వెంటనే ప్రభావం చూపించకపోయినా, వినియోగం పెరిగే కొద్ది దాని దుష్ర్పభావాలు భవిష్యత్తులో ఎక్కువగా ఎదుర్కోవల్సి వస్తుంది. కాబట్టి ఆల్కహాల్ త్రాగేవారు వయస్సును బట్టి తగుమోతాదులో తీసుకోవాలి. లేదంటే మద్యం వల్ల అనేక రకాలైన అనారోగ్యాల భారీన పడాల్సి వస్తుంది. ఆల్కహాల్ తీసుకొనే అలవాటు మార్చుకోకపోతే అది క్రమక్రమంగా వ్యసనంగా మారే అలవాటు ఏర్పడుతుంది. ఆల్కహాల్ సేవించడం వల్ల బ్లడ్ ప్రెజర్, గుండె సంబంధిత వ్యాధులు మొదలైనవి పెరుగుతాయి. ఇవన్నీ కూడా మద్యవయ్యస్సు నుండే మొదలవుతున్నాయి. మీరు కనుక ఆల్కహాలిక్ డ్రింకర్ అయితే ఈ సమస్యలంటిన్నీ మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మద్యం సేవించడం వల్ల ఎదురయ్యే ఆనారోగ్యసమస్యలు...

మద్యం తీసుకుంటే ఎదురయ్యే ప్రమాధాలు
రక్తహీనత: మద్యపానీయాలలో రక్తహీనత ఎక్కువగా ఉంటుంది. తెల్ల కణాల శాతం తగ్గి వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లుతుంది. కాలేయం దెబ్బతిని పేగుల నుండి రక్తం స్రవిస్తుంది. రక్తం గడ్డ కట్టే గుణంలో లోపం ఏర్పడుతుంది.

మద్యం తీసుకుంటే ఎదురయ్యే ప్రమాధాలు
క్యాన్సర్: ఆల్కహాలిసమ్ వల్ల జీర్ణావయవాలలో నోరు, గొంతు, కంఠనాళం, కడుపు, శ్వాసావయవాలు, క్యాన్సర్ వ్యాధికి గురయ్యే ప్రమాదముంది. కాలేయం క్యాన్సర్‌కు మద్యపానానికి దగ్గరి సంబం ధం ఉంది.తాగుడు వల్ల ఆరోగ్య సమస్యలే కాక, ఆర్థిక సమస్యలు కూడా వస్తాయి. తాగు డుకు అలవాటు పడిన వారి పని సామర్థ్యం తగ్గి పోతుంది. ఆరోగ్యంగా మరియు దృఢంగా ఉండటానికి ఆల్కహాల్ ను పరిమితంగా తీసుకోవాలి.

మద్యం తీసుకుంటే ఎదురయ్యే ప్రమాధాలు
కార్డియోవాస్క్యులర్ వ్యాధులు: బి1 (థెైయమిను) లోపసం వల్ల గుండెలోని కండరాలకు హాని కలగడం చేత గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. గుండె పని చేయుటలో తేడాలు రావచ్చు. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవటం వల్ల సాధారణంగా రక్తంలో కొవ్వు పదార్ధం మరియు శరీరం యొక్క రక్తపోటు పెరుగుతుంది.రక్తపోటు ఎక్కువగా ఉంటే, అది గుండెను ప్రభావితం చేస్తుంది.అంతే కాకుండా ఇది శరీరం యొక్క మంచి కొలెస్ట్రాల్ స్థాయి మీద ప్రభావితం చేసి గుండె పోటు అపాయాలను పెంచుతుంది.

మద్యం తీసుకుంటే ఎదురయ్యే ప్రమాధాలు
కణజాలముల మధ్య నార పధార్దములు(సిర్రోసిస్): ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవటం వల్ల కాలేయం మీద ప్రభావం చూపుతుంది.ఆల్కహాల్ కాలేయంలో కొవ్వును పెరిగేలా చేస్తుంది.అందువల్ల కాలేయం పాడయ్యి ఫ్యాటీ లివర్ వ్యాధి వస్తుంది.

మద్యం తీసుకుంటే ఎదురయ్యే ప్రమాధాలు
జ్ఞాపకశక్తి: మెదడు యొక్క సాధారణ కార్యాచరణక మీద ప్రభావం చూపుతుంది. ఆల్కహాల్ వల్ల ప్రత్యక్షంగా కంటి చూపును మరియు జ్ఞాపకశక్తి కోల్పోవడం సంభవిస్తుంది.మెదడు యొక్క నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది.అధిక మద్యపానం అసందర్భ సంభాషణ మరియు బలహీనమైన ప్రవర్తనకు కారణమవుతుంది.ఇది ఒక వ్యక్తి యొక్క ఆలోచన సామర్థ్యం మీద కూడా ప్రభావితం చేస్తుంది.

మద్యం తీసుకుంటే ఎదురయ్యే ప్రమాధాలు
డిప్రెషన్: తాగుడు వల్ల మెదడు మందగిస్తుంది. నరాలలో శక్తి తగ్గుతుంది. దాంతో ఒత్తిడి పెరుగుతుంది విటమిన్లు, ముఖ్యంగా ‘బి' విటమిన్ల లోపం వల్ల మద్యపానం మెదడుపెై పొరలపెై చూపే చెడు ప్రభావం వల్ల ఇలా అవుతుంది. నడక తిన్నగా ఉండదు. మాట తడబడు తుంది. కళ్ళ కదలికలో లోపం ఉంటుంది. మానసికంగా కృంగిపోతారు. పక్షవాతం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మద్యపానం చేసే వ్యక్తి ఒకసారి ఇలాంటి లోపానికి గురయితే చికిత్స చేయడం కష్టమవుతుంది.

మద్యం తీసుకుంటే ఎదురయ్యే ప్రమాధాలు
మూర్చ: ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వల్ల ఎలిప్సీ మరియు మూర్చవ్యాధికి గురిచేస్తుంది.

మద్యం తీసుకుంటే ఎదురయ్యే ప్రమాధాలు
గౌట్ పెయిన్: మోకాళ్ళ నొప్పులు. ఆల్కహాలు కసేవించడం వల్ల శరీరంలోని యూరిక్ ఆమ్లం తగ్గి జాయింట్ పెయిన్స్ కు దారితీస్తుంది.

మద్యం తీసుకుంటే ఎదురయ్యే ప్రమాధాలు
అధిక రక్తపోటు: ఆల్కహాల్ తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్(బిపి) అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవిన శెలితో పాటు ఆనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులోనూ అధికంగా హైబీపీ, లోబీపికి గురిఅవుతున్నట్లు చాలా అధ్యాయాలు పేర్కొన్నాయి. సాధారణంగా ఆరోగ్యవంతుల రక్తపోటు సిస్టోలిక ప్రెషర్ 90 నుండి 120 మి.మీ గాను, డయాస్టోలిక బ్లడ్ ప్రెషర్ 60 నుండి 80 మి.మీగాను నమోదు కావచ్చు.

మద్యం తీసుకుంటే ఎదురయ్యే ప్రమాధాలు
అంటువ్యాధులు: ఆల్కహాల్ ను అధికంగా తీసుకోవడం వల్ల కొన్ని రకాల అంటువ్యాధులకు కూడా గురిచేస్తుంది. అందులో ట్యూబర్ క్విలోసిస్, ఫ్నిమోనియా, హచ్ ఐవి మరియు ఇతర సెక్స్యువల్ వ్యాధులకు గురిచేస్తుంది. ల్కహాల్ ఎక్కువగా సేవించడం వల్ల శరీరం యొక్క జననేంద్రియ వ్యవస్థ నాశనానికి కారణం అవుతుంది. ఆల్కహాల్ తీసుకోవటం వల్ల పరోక్షంగా మహిళలు మరియు పురుషులు లో సంతాన ప్రాప్తి లేకుండా చేస్తుంది.

మద్యం తీసుకుంటే ఎదురయ్యే ప్రమాధాలు
నరాల నష్టం/నరాల బలహీనత: మద్యపానంవల్ల మనిషికి ‘స్కెలిటల్ మయోపతి' అనే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి సోకిన వారికి నరాలు క్షీణించి విపరీతమైన బలహీనత కలుగుతుంది. శారీరక శ్రమ చేయలేకపోతారు.

మద్యం తీసుకుంటే ఎదురయ్యే ప్రమాధాలు
ప్యాంక్రియాటిస్: కాలేయం మరియు ప్యాన్‌క్రియాస్ దెబ్బతినడం. మద్యసేవనంవల్ల కాలేయానికి సంబంధించి సిర్రోసిస్ ఆఫ్ లివర్ అనే వ్యాధి రావచ్చు.
జీర్ణకోశం వ్యాధులు: ఆల్కహాల్‌లో ఉండే హానికర గుణం వల్ల, అది సంక్రమించే లోప పోషణ వల్ల కాలేయం దెబ్బ తింటుంది. పోషకాహారం దృష్ట్యా తగిన ఆహారం తీసుకుంటు న్నప్పటికీ, మద్యం ఎక్కువగా తాగడం వల్ల కాలేయం దెబ్బ తింటుంది. కొవ్వు పేరుకోవడం వల్ల కాలేయం పెరుగుతుంది. ఉదయం పూట వికారంగా ఉండి వాంతి వస్తున్నట్టు ఉంటుంది. నీళ్ళ విరోచనాలు అవుతాయి. పొత్తి కడుపు కుడి వెైపు పెైభాగాన నొప్పిగా ఉంటుంది. కాలేయం వాపు వస్తుంది. ఇది ముదిరే కొద్ది కామెర్లు వస్తాయి.



Click it and Unblock the Notifications