Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
పీరియడ్స్(రుతుక్రమ)సమస్యలు అధిగమించేలా చేసే ఆహారాలు...
సాధారణంగా చాలా మంది అమ్మాయిలు లేదా మహిళల్లో ఇర్రెగ్గులర్ పీరియడ్స్(రుతు క్రమం)లో తేడాలు కనిపిస్తుంటాయి. కొంత మంది టీనేజ్ అమ్మాయిల్లో, మహిళల్లో, మోనో పాజ్ దశలోనూ ఇది ఇక సాధారణ ఆరోగ్య సమ్యసగ్యా మారింది. సాధారణంగా రుతుక్రమం రెగ్యులర్ 28-30డేస్ కు వచ్చే వారికి నార్మల్ పీరియడ్స్ 3-5డేస్ ఉంటాయి.
రుతుక్రమాన్నిగడిచిన నెల పీరియడ్స్ మొదలైన మొదటి రోజు నుండి ప్రస్తుత నెల రుతుక్రమాన్ని వచ్చే రోజును క్యాలిక్యులేట్ చేస్తారు. ఏదైతేనేం. అనారోగ్యకరమైన లైఫ్ స్టైల్, స్మోకింగ్, డ్రింకింగ్, అధికంగా వ్యాయామం, మెడికేషన్స్ మరియు డ్రగ్స్ వంటి అనేక కారణాల వల్ల రుతుక్రమంలో తేడాలు వస్తాయి.
మీరెప్పుడైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో బాధ పడుతుంటారో, పీరియడ్స్ అనుకొన్న తేది కంటే ముందే అయిపోవడం, లేదా ఆ తేది కంటే లేట్ గా అవ్వడం జరగుతాయి. ఇలా అనుకొన్న తేదికి వెనుక, ముందు కావడంతో రుతుక్రమంలో తీవ్రమైన నొప్పిని ఎదుర్కోవల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో చేతుల్లో తిమ్మెర్ల సమస్య ఏర్పడుతుంది. చాలా మంది మహిళలు ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల 2-3 నెలకొకసారి లేదా ఇంకా ఎక్కువ నెలలు కూడా పట్టవచ్చు అని చెబుతుంటారు. కాబట్టి ఈ సమస్యలన్నింటిని ఎదుర్కోవాలంటే సరైన డైయట్ ను ఫాలో చేయాలి. హెల్తీ లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు పీరియడ్స్ లో ఎటువంటి ఇబ్బంది కలగక ప్రతి నెల రుతుక్రమం జరగడానికి సహాయపడుతుంది.
ప్రోటీనులు, విటమిన్స్ మరియు ఓమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల రుతుక్రం క్రమబద్ద చేయడానికి బాగా సహాయపడుతాయి. మరి రుతుక్రమం సరిగా సరైన టైమ్ కు ప్రతి నెలా క్రమబద్దంగా జరిగాలంటే కొన్ని ఆరోగ్యకరమైన, ఆహారాలు తప్పకుండా సహాయపడుతాయి. మరి పీరియడ్స్ ఇన్ టైమ్ లో రావడానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలో ఒక సారి చూద్దాం...

బ్రొకోలీ: రుతుక్రమాన్ని క్రమబద్దం చేయడంలో ఈ గ్రీన్ వెజిటేబుల్ చాలా పవర్ ఫుల్. సరైన రుతుక్రమాన్ని మెయింటైన్ చేయడానికి ఈ బ్రొకోలీని మీ రెగ్యులర్ డైయట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.

సోంపు/సోపు(ఫెన్నల్): జీలకర్ర మాదిరిగా ఉండే ఈ ఫెన్నల్ సీడ్స్(సోంపు గింజలు)తో తయారు చేసిన డికాషన్ ను ఉదయం ఖాలీకడుతో త్రాగితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నుండి బయటపడవచ్చు. మరియు క్రమమైన పీరియడ్స్ రావడానికి సహాయపడుతుంది. కాబట్టి రాత్రంతా వీటిని నీటిలో నానబెట్టి, ఉదయం ఆ నీటిని త్రాగాలి.

సాల్మన్: ఈ సాల్మన్ ఫిష్ లో అధిక శాతంలో క్యాల్షియం, మరియు విటమిన్ డి ఉంటుంది. ఇవి ఎముకలకు బలాన్ని చేకూర్చడం సంగతటుంచితే, ఈ సాల్మన్ వల్ల శరీరంలోని హార్మోన్లు పెరుగుదలకు మరియు స్థిరపరచడానికి బాగా సహాయపడుతాయి. ఇది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యలను పోగొడుతుంది.

గ్రీన్ వెజిటేబుల్స్: ఈ సమస్య ఉన్న వారు హెల్తీ మరియు పోషకాహారం ఉన్న గ్రీన్ వెజిటేబుల్స్ ను తప్పనిసరిగా తీసుకోవాలి. ఆకుకూరలు, ఆస్పరాగస్, బ్రొకోలి, వంకాయ వంటి కూరగాయాలు రుతుక్రమం క్రమంగా వచ్చేలా చేస్తాయి.

ఫిష్ లేదా ఫిష్ ఆయిల్: చేపల్లో ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ మరియు మెర్య్కురీ అధికంగా ఉండటం వల్ల శరీర ఆరోగ్యానికి చాలా మంచిది. రుతుక్రమంలో నష్ట వాటిల్ల కుండా చేయడానికి ఈ ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ అండాశయాల్లలోని రక్త నాళాలను రక్షిస్తుంది. కాబట్టి రుతుక్రమం క్రమంగా రావాలంటే చేపలకు మరియు చేపనూనెలకు ఫ్రిఫరెన్స్ ఇవ్వండిం.

బాదం: నట్స్ఆరోగ్యానికి చాలా మంచిది మరియు శరీరానికి కావల్సిన పోషకాలు పుష్కలంగా అందుతాయి. ఇంకా ఇందులో ఉండే ఫైబర్ మరియు ప్రోటీనులు హార్మోనులను బ్యాలెన్స్ చేసి రెగ్యులర్ పీరియడ్స్ అవ్వడానికి సహాయచేస్తుంది.

నువ్వులు: నువ్వులను తినడం వల్ల క్రమమైన పీరియడ్స్ వస్తాయి. శరీరంలో వేడి పుట్టించడానికి ఇవి చాలా బాగా సహాయపడుతాయి.

పెరుగు: డైరీ ప్రొడక్ట్స్ లో అధికంగా క్యాల్షియం మరియు ప్రోటీనులు ఉంటాయి. కాబట్టి ప్రతి రోజూ పెరుగు తినడం చాలా అవసరం. దాంతో శరీరాన్ని చల్లబరిచి టైమ్ కు పీరియడ్స్ వచ్చేలా చేస్తుంది.

సోయా మిల్క్: సాధారణ పాలు ఇష్టపడని వారు, సోయా పాలను తీసుకోవడం చాలా అవసరం. ఇందులో న్యూట్రీయన్స్ ఉండటం మాత్రమే కాదు కడుపు నిండేలా చేస్తుంది. డైయట్ ఫాలో చేసే వారు మీగడ లేని సోయా పాలను తీసుకోవాలి.

గుడ్డు: బాగా ఉడికించిన గుడ్డులో అధిక శాతంలో ప్రోటీనులు మరియు క్యాల్షియం మరియు విటమిన్స్ ఉంటాయి. గుడ్డులో ఉండే అధిక ప్రోటీనులు రుతు క్రమ సమస్యలను నివారించడానికి బాగా సహాయపడుతాయి.

రెడ్ గ్రేప్(ఎర్రని ద్రాక్ష): సహజ పద్దతులు ద్వారా రుతుక్రమ సమస్యలను నివారించుకోగలిగే ఒక మంచి ఆహారం ద్రాక్ష. ప్రతి రోజూ ఎర్రని లేదా పచ్చని ద్రాక్ష రసం త్రాగడం చాలా ఆరోగ్య కరం.

టోఫు: పన్నీర్ కు ప్రత్యామ్నాయ ఆహారం టోఫు. ఇది ఆరోగ్యకరమే కాకుండా లోఫ్యాట్ కలిగి ఉంటుంది. టోఫు క్యాల్షియం రిచ్ ఫుడ్. ఇది పీరియడ్స్ క్రమంగా వచ్చేలా చేస్తుంది.



Click it and Unblock the Notifications











