Latest Updates
-
మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై 5 కొత్త రూల్స్.. ఇవి తెలియకపోతే ఇబ్బందే! -
అన్నం మిగిలిపోయిందా? అయితే ఈ ఇండోనేషియా స్టైల్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి! -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణులు, పీసీఓఎస్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
మండుటెండల్లో కిడ్నీలకు ముప్పు.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ రెసిపీ.. టేస్టీ అండ్ హెల్తీ సొరకాయ దహీ తడ్కా -
లివ్-ఇన్ రిలేషన్షిప్లో బ్రేకప్ అయ్యిందా? ఇకపై క్రిమినల్ కేసులు పెట్టడం అంత సులభం కాదు! -
నోరూరించే మామిడికాయ పచ్చడి..ప్రెషర్ కుక్కర్ లో అప్పటికప్పుడు ఈజీగా చేసేయండిలా.. -
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ బనానా లస్సీ.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోద్ది! -
డేటింగ్ యాప్స్‌లో కొత్త రకం ఉచ్చు.. మీ ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారా? -
పొద్దున్నే లేవగానే ఒళ్లంతా నొప్పులా? కండరాలు పట్టేస్తున్నాయా? ఆ వ్యాధులకు సంకేతమే!
మీ మూడ్ అనుక్షణం మారుతుందని చెప్పడానికి ఇవే ప్రధానకారణాలు..!
బైపోలార్ డిజార్డర్ ను 'తీవ్రమైన నిస్పృహ' అని కూడా చెప్పవొచ్చు. బైపోలార్ డిజార్డర్ తో ఉన్న వారు ఎవరైనా వారిలో తీవ్రమైన మానసిక కల్లోలం ఉంటుంది. ఇది చాలా మందిలో వారాలు, నెలలు లేదా చాలా కాలం నుండి ప్రభావం చూపిస్తూ ఉంటుంది.
100 మంది పెద్దవారిలో ఒకరు వారి జీవితంలో ఈ బైపోలార్ డిజార్డర్ ను ఎదుర్కుంటున్నారు. ఇది ఎక్కువగా యవ్వన దశలో లేదా తరువాత కాని ప్రారంభమవుతుంది. ఇది 40 సంవత్సరాల తరువాత ప్రారంభమయితే అది అసాధారణంగా ఉంటుంది. దీనివల్ల స్త్రీలు మరియు పురుషులు సమానంగా బాధపడతారు.
అనూహ్యమైన లేదా క్లిష్టమైన వ్యక్తిత్వం కారణంగా మానసిక స్థితి సమస్యలు రావటానికి గల 10 సంకేతాలను ఇక్కడ ఇస్తున్నాము.

గ్రేట్ మూడ్ : బైపోలార్ డిజార్డర్లో, వెర్రి నిస్పృహ పైకి క్రిందికి ఊగిసలాడుతూ ఉంటుంది. ఒక తీవ్రమైన దశలో, కొంతమంది రోగులు వాస్తవానికి పూర్తిగా దూరమవుతారు.

కాని ఒక విధమైన మానసిక రుగ్మతలో ఇది చాలా శక్తివంతమైన స్థితిలో ఉండటం వలన, ఆ వ్యక్తి అత్యుత్సాహంగా కనిపిస్తాడు కాని వాస్తవం మీద తన పట్టు కోల్పోడు.

పనులు పూర్తి చేయలేని అసమర్థత: సగం పూరించిన ప్రాజెక్టులు కలిగి ఉండటం బైపోలార్ డిజార్డర్ యొక్క ఒక లక్షణం. వారు ఒక మహా తీవ్రమైన దశలో ఉన్నప్పుడు వారి శక్తిని నియంత్రించడానికి వ్యక్తులు నిజంగా శక్తివంతులై ఉండగలగాలి. తరచుగా ఒక పని తరువాత ఒక పని, గొప్ప ప్రణాళిక, అవాస్తవ ప్రాజెక్టులు, వీటిని ఎప్పటికి పూర్తి చేయలేరు.

నిస్పృహ: ఒక బైపోలార్ నిరాశ స్థితిలో ఉన్న వ్యక్తి కేవలం నిస్పృహతో ఉన్న ఎవరితోనైనా స్నేహంగా ఉండటానికి ఇష్టపడతారు. దురదృష్టవశాత్తు, సాధారణ యాంటీడిప్రజంట్స్, బైపోలార్ రోగుల్లో సరిగా పనిచేయవు. ఇవి వారి పరిస్థితిని హీనస్థితిలో పడేస్తాయి లేదా తరచుగా దీని బారిన పడేస్తాయి లేదా వాస్తవానికి దూరంగా వారి మానసిక స్థితిని ఉంచుతాయి. యాంటీడిప్రెజంట్స్ బైపోలార్ తో బాధపడుతున్నవారికి ప్రమాదకరం కావచ్చు ఎందుకంటే ఇవి వారిని ఉన్మాదస్థితికి తీసుకెళ్లవొచ్చు.

చిరాకు వంటి లక్షణాలు: కొంతమంది అదే సమయంలో వెర్రి, నిస్పృహ వంటి రెండు లక్షణాలను ఒకేసారి అనుభవిస్తుంటారు, ఈ పరిస్థితిని 'మిశ్రమ ఉన్మాదం' అంటారు. ఈ స్థితిలో వీరు చాలా తరచుగా చిరాకు పడుతుంటారు.

ప్రతి ఒక్కరికి చెడ్డ రోజులిని ఎదుర్కోవలసి ఉంటుంది, ఈ రకమైన బైపోలారిటిని గుర్తించటం చాలా కష్టమైన పని. కానీ బైపోలార్ లోపంతో బాధపడుతున్నవారు తరచూ వారి సంబంధబంధవీకులతో తీవ్రమైన జోక్యం చేసుకుంటారు.

వేగంగా సంభాషణ: కొంతమంది సహజంగా చురుకైన మాటకారిగా ఉంటారు. కానీ "ఒత్తిడి సంభాషణ" బైపోలార్ డిజార్డర్ యొక్క అత్యంత సాధారణ లక్షణాలలో ఒకటి. ఎవరైనా ఇద్దరు వ్యక్తులు సంభాషిస్తున్నప్పుడు, అందులో ఒక వ్యక్తి సంభాషించనప్పుడు ఈ రకమైన సంభాషణ జరుగుతుంది. ఈ వ్యక్తి అవతలి వ్యక్తిని మాట్లనివ్వకుండా, అతనిని అధిగమించి మాట్లాడాలని చూస్తాడు. వీరు కొన్నిసమయాలలో సంబంధం లేని విషయాల గురించి మాట్లాడతారు.

పని వద్ద సమస్య: ఈ లోపంతో ఉన్న వ్యక్తులు తరచుగా కార్యాలయంలో ఇబ్బందిపడుతుంటారు ఎందుకంటే వారి లక్షణాలు అన్ని పనిలో వారు చూపించే సమర్థతలో జోక్యం మరియు ఇతరులతో నిర్మాణాత్మకంగా ఇంటరాక్ట్ లో జోక్యం ఒక్కసారిగా చేసుకుంటాయి. వీటికి తోడూ పని పూర్తి చేయటంలో సమస్యలు, నిద్రలేమి, చిరాకు మరియు ఈ తీవ్రమైన స్థితిలో కలిగే అహం, మరియు డిప్రెషన్ వలన ఎక్కువ నిద్ర, మానసిక సమస్యలు.

మద్యపానం లేదా మత్తు మందుల దురలవాటు : బైపోలార్ లోపంతో ఉన్న వ్యక్తులలో 50%, ముఖ్యంగా మద్యం దురలవాటు సమస్య ఉన్నవారే. చాలామంది ఈ తీవ్రమైన స్థితిలో ఉన్నప్పుడు వారు తగ్గిఉన్దతానికి మరియు వారు డిప్రెషన్ లో ఉన్నప్పుడు వారి మానసికస్థితిని మెరుగుపరుచుకోవటానికి ఈ మద్యాన్ని త్రాగుతారు.

అనియత ప్రవర్తన: ఒక ఆవేశపూరితదశలో ఉన్నప్పుడు, బైపోలార్ డిజార్డర్ తో వారు ఆత్మగౌరవాన్ని ఎక్కువగా ఆపాదించుకుంటారు. వారు చాలా గొప్పగా అనుభూతి చెందుతారు మరియు దానివల్ల ఎదురయ్యే పరిణామాలు వారు పరిగణలోకి తీసుకోరు; ప్రతిదీ వారికి మంచిదనిపిస్తుంది. ఎక్కువగా మత్తులో మునగడం మరియు అసాధారణ లైంగిక ప్రవర్తన వంటి రెండు రకాల ప్రవర్తనలు వీరిలో ఉంటాయి.

నిద్ర సమస్యలు: ఈ స్థితిలో ఉన్నవారికి తరచుగా నిద్ర సమస్యలు ఉంటాయి. ఈ డిప్రెషన్ దశలో వారు ఎక్కువగా నిద్ర పోతారు మరియు అన్ని సమయాల్లో అలసటగా ఉంటారు.

వీరు రాత్రిళ్ళు కొన్ని గంటలు మాత్రమే పడుకుంటారు, వారు చాలా గొప్పగా మరియు చాలా శక్తివంతులుగా అనుభూతి చెందుతారు.

అసందర్భప్రేలాపన: ఈ లక్షణాన్ని గుర్తించటం చాలా కష్టం, కాని ఈ మానిక్ దశలో ఉన్నవారికి ఈ లక్షణం తరచుగా వొస్తో ఉంటుంది. వీరి మెదడు చాలా వేగంగా పనిచేస్తుంది మరియు వారికి వారి ఆలోచనల పైన నియంత్రణ ఉండదు. ఈ రకమైన ఆలోచనలు కొన్నిసార్లు ఒత్తిడి సంభాషణకు దారి తీస్తాయి.



Click it and Unblock the Notifications