Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
మీ దంతాలకు హాని కలిగించే 7 ఆహారాలు....!
మనలో చాలా మంది తమ ఆరోగ్యం గురించి.. అందం గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ముందుగా మనిషిని చూడగానే కళ్ళు ఎంత అందంగా ఉన్నాయో అంటారు. మరికొందరు ముక్కు మూతి చాలా అందంగా ఉన్నాయంటుంటారు. అందంగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. ఆరోగ్యం సరిగా లేనప్పుడు అందం కోసం ఎన్ని పైపూతలు పూసినా ప్రయోజనం లేదు. ముఖ్యంగా అందానికి మొదటి మెట్టు శుభ్రత. అజీర్ణం లేకుండా జాగ్రత్త పడటం చాలా ముఖ్యం. ఇక రెండోది దంతాల శుభ్రత, నోటి దుర్వాసన లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
అలాగే ముఖంలో మరో అందమైన భాగం అందమైన పలువరుస ఎంతో అందంగా ఉంటుంది. అయితే పలువరుస అందంగా ఉన్నా, పళ్ళు పచ్చగా గార పట్టి ఉంటే నలుగురిలో హాయిగా నవ్వలేము. అందుకే, ఎప్పుడూ పళ్ళను శుభ్రంగా ఉంచుకోవాలి. చాలా మంది వారి దంత సంరక్షణ కోసం రెగ్యులర్ గా డెంటిస్ట్ ను కలుస్తుంటారు. రోజులో రెండు సార్లు బ్రెష్ చేసుకోవడం చేస్తుంటారు. అందుకే వారి దంతాలు తెల్లగా మిళమిళలాడుతూ ఆరోగ్యం ఉంటాయి. అయితే మరొకొందరికి ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్న వారి దంతాలు అంత అందంగా కనబడవు, పసుపుపచ్చగా కనబడుతుంటాయి. అందుకు కారణం ఆహారం. కొన్ని దంతాలకు హానీ కలిగించే కొన్ని ఆహారాలకు దూరంగా ఉన్నట్లైతే మీ దంతాలు తెల్లగా మిళ మిళలాడుతుంటాయి. దాంతో మీరు నలుగురిలో సంతోషంగా హాయిగా నవ్వగలుగుతారు. మరి ఆ ఆహారాలేంటో చూద్దాం...

కాఫీ: కాఫీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. రోజులో ఒక్కసారైనా కాఫీ తాగందే కొందరికి పనులు జరగవు. ఏదో వెలితిగా ఫీల్ అవుతుంటారు. అయితే కాఫీ తాగడం వల్ల దంతాలమీద మరకపడుతుందని తెలియదు. దంతాలను పాడుచేయడానికి కాఫీ కూడా కారణం అవుతుంది. కాబట్టి మితంగా తాగాలి. కాఫీ తాగిన ప్రతి సారీ నోట్లో మంచినీరు పోసుకొని బాగా పుక్కలించి ఊసేయాలి.

టీ: కాఫీ తాగకపోతే ఏం టీ తాగాతాం అంటారు. కానీ కాఫీ లాగే టీ కూడా దంతాలు మరకలు పడటానికి కారణం అవుతాయి. టీకి బదులు హెర్బల్ టీ, వైట్ టీ, గ్రీన్ టీ లను తీసుకొని బ్లాక్ టీకి దూరంగా ఉండండి.

చాక్లెట్స్: దంతాలమీద మరకలు, చారలు పడటానికి, దంతాలను నాశనం చేయడానికి ప్రధాన కారణం చాక్లెట్స్. కాబట్టి సాధ్యమైనంత వరకూ చాక్లెట్స్ ను అవాయిడ్ చేసి దంతాలకు కాపాడుకోవాలి.

బ్లూ బెర్రీస్: బ్లూ బెర్రీస్ జ్యూ, బ్లూ బెర్రీ తొక్క ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే వీటిని మితంగా తీసుకోవాలి. ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతాలు రంగు మారి మరకలు పడే అవకాశం ఉంది. కాబట్టి బ్లూ బెర్రీస్ ను అవాయిడ్ చేయండి.

కోలా: కోలా(కోక్ మరియు పెప్సీ)ఇవి దంతాల మీద అతి త్వరగా మరకలు ఏర్పడేలా చేసే హారబుల్ ఏజెంట్స్. అంతే కాదు వీటిలో పంచదార, ఆసిడ్స్, మరియు దంతాలకు హానీ కలుగ జేసే అనేక రకాలలైన రసాయనాల సంమ్మేళనంతో తయారు చేసే ఇటువంటి పానీయాలకు దూరంగా ఉన్నట్లైతే మీ దంతా క్షేమం.

ఫ్రూట్ పంచ్: కొన్ని రకాలైన పండ్లు కూడా దంతాలకు హానీ కలిగిస్తాయి. వాటిలో ముఖ్యంగా డార్క్ కలర్, డార్క్ పర్పల్ కలర్, బ్లాక్ గ్రేప్స్ వంటి పండ్లు కూడా దంతాల మీదు మరకలు ఏర్పడేలా చేస్తాయి. కాబట్టి డార్క్ లకర్ ఫ్రూట్స్, ఫ్రూట్స్ జ్యూసులకు దూరంగా ఉన్నట్లైతే మీ దంతాలను తప్పనిసరిగా తెల్లగా మార్చుకోవచ్చు.

సిగరెట్స్: ఇది ఆహారం కాదు. అయినప్పటికీ ఇది దంతాలకు హాని కలిగించే అతి భయంకరమైన వస్తువు. సిగరెట్స్ తాగడం వల్ల దంతాలు, పసుపుపచ్చగా మారి, మరకలు, గారలు, ఏర్పడి, దంతాల మద్య సందులు ఎక్కువగా కనిపిస్తూ అసహ్యంగా తయారవుతాయి. కాబట్టి సాద్యమైనంత వరకూ సిగరెట్స్ కు పూర్తిగా దూరంగా ఉండటం మంచిది.
కాబట్టి ఈ చిన్న చిన్న వస్తువులను మనస్సులో ఉంచుకొని, ఇటువంటి హానికలిగించే వాటికి దూరంగా ఉంటూ.. మీ దంతాలను రక్షణ కల్పించి, దంతాలు తెల్లగా మార్చుకోండి..



Click it and Unblock the Notifications











