Latest Updates
-
లంబోదరుడికి ప్రీతికరమైన బెల్లం పాల తాలికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ కొలతలతో ట్రై చేయండి.! -
సెప్టెంబర్ 11 రాత్రి 7 గంటల తర్వాత..వృషభం, సింహం, వృశ్చిక రాశులకు లాటరీ తగిలినంత అదృష్టం! -
ఫ్రిజ్‌లో పెట్టినా నిమ్మకాయలు రంగు మారుతున్నాయా.. ఈ 3 టిప్స్‌తో ఎన్ని రోజులైనా తాజాగానే.! -
చిరుతిళ్లలో దీనికి సాటి లేదు.. పది నిమిషాల్లో పుదీనా ఫ్లేవర్‌తో కరకరలాడే మరమరాల మిక్స్చర్.! -
maggie masala : కూరల రుచిని రెట్టింపు చేసే మ్యాగీ మసాలా..ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా! -
లిప్‌స్టిక్‌తో పెదాలు డ్రై అవుతాయా.. అధర అందం విషయంలో అతివలు చేసే పొరపాట్లు ఇవే.! -
చల్లటి పెరుగుతో చేటు: ఆయుర్వేదం ప్రకారం పెరుగు ఎలా తినాలి? ఎప్పుడు అసలు తినకూడదు? -
గణేశ్ చతుర్థి స్పెషల్.. తమిళనాడు స్టైల్లో నోరూరించే పరమాన్నం.. తింటే స్వర్గమే.! -
కర్ణాటక స్పెషల్ తర్కారీ పులావ్..బిర్యానీ కూడా దీనిముందు దిగదుడుపే! -
గాయమైన చోట పసుపు రాస్తున్నారా.. ఇంటి చికిత్స చేసేటప్పుడు ఈ పొరపాట్లు వద్దు.!
ఆఫీస్ లో ఉన్నప్పుడు మంచి మూడ్&ఎనర్జినిచ్చే ఫుడ్స్
మీకు తెలుసా కొన్ని ఆహారాలు మీ మూడ్ ను మార్చుతాయని, మీరు ఎక్కడున్నారు, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారన్నది సమస్యకాద. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మీ మనస్సును మరియు మూడ్ ను మార్చే కొన్ని ఆశ్చర్య కరమైనప ఆహారాలను ఉన్నాయి. ఈ ఆహారాలు తీసుకోవడం వల్ల కొన్ని ప్రతికూల ఆలోచనలను, అనుకూల ఆలోచనలుగా మార్చుతుంది. సాధారణంగా మనం గమనిస్తుంటాం. చాలా మంది చాలా మూడీగా ఉన్నప్పుడు ఒక కప్పు కాఫీ తాగడం వల్ల ఎంత ఉత్సాహంగా మారుతుంటారో. అయితే అందులోని ట్రిక్స్ ఏంటని మనకు ఆశ్చర్యం కలగవచ్చు . కాఫీ వారిని బెటర్ మూడ్ లోకి ఎందుకు మార్చుతుంది. కాబట్టి, మీ మూడ్ సరిగాలేనప్పుడు, మీ మంచి మూడ్ కోసం కొన్ని ఆహారాలను తీసుకోవాలని సూచిస్తోంది.
నిపుణుల ప్రాయం ఆహారాల్లోని ఆసిడ్స్, రుచి మరియు పదార్థాలను క్రింది లిస్ట్ లో ఇవ్వబడ్డాయి, ఇవి మీకు ఎనర్జీని అంధిస్తాయి. మరియు ఇది మీ మానసిక స్థితి మీద చాలా ప్రధానమైన పాత్రను పోషిస్తాయి . ఈ ఆహారాలు, మీ మూడ్ ను పెంచే ఆహారాలు చాలా సులభంగా మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు పనిచేసే ప్రదేశంలో మీరు చాలా బ్యాడ్ మూడ్ తో ఉన్నప్పుడు, కొంత సమయం తీసుకోండి మరియు ఈ ఆరోగ్యకరమైన ఆహారాల్లో ఒక కప్పు కాఫీని కూడా చేర్చుకోండి. ఆఫీసులో మీరు పనిలో ఉన్నప్పుడు మీకు ఎనర్జీతో పాటు, మంచి మూడ్ కోసం మరికొన్న హెల్తీ ఫుడ్స్ ను బోల్డ్ స్కై మీకు అంధిస్తోంది. వాటిని క్రింది స్లైడ్ ద్వారా పరిశీలించండి.

రస్క్:
ఎండిన బ్రెడ్ దీన్ని సాధారణంగా రస్క్ అని పిలుస్తుంటారు . పనిలో ఉన్నప్పుడు ఇది ఆరోగ్యకరమైనది మరియు మీ మానసిక స్థితిని మెరుగుపరిచేందుకు ఒక బూస్ట్ వంటింది . ఇందులో చాలా తక్కువ కేలరీలు మరియు ఎక్కువ ప్రోటీనులు కలిగి ఉండి, మీలో చాలా ఎక్కువ ఎనర్జీని అంధిస్తుంది. మంచి మూడ్ అంధిస్తుంది.

కాఫీ:
ఒక కప్పు కాఫీ, ఆశ్చర్యకరమైన ఫలితాలను ఇస్తుంది. మీరు పనిలో ఉన్నప్పుడు మీ మానసిక స్థితి సరిగా లేనప్పుడు, ఒక కప్పు కాఫీ చాలా విశ్రాంతిని కలిగిస్తుంది. అయితే, ఒక కప్పు కాఫీకి మాత్రమే పరిమితంగా ఉండాలని నిర్ధారించుకోవాలి.

గ్రీన్ టీ:
గ్రీన్ టీ తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని, అనేక ప్రయోజనాలున్నాయని చెపుతారు. గ్రీన్ టీ బరువు తగ్గిస్తుంది, చర్మం మెరుపు పెరుగుతుంది, జుట్టు రాలుడు తగ్గుతుంది. మంచి మూడ్ ను అందిస్తుంది. తలనొప్పి నుంచి ఒత్తిడి వరకూ ఆజీర్తి నుంచి అల్జీమర్స్ వరకు ఏ వ్యాధికైనా ఇది అద్భుతమైన మందు అంటారు చైనీయులు. ఊబకాయం నియంత్రణకు గ్రీన్ టీను మించిన ఔషుధం లేదు. కెఫీన్ కాంబినేషన్‌తో కలిసిన గ్రీన్ టీని తీసుకోవడం వల్ల ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయట. గ్రీన్ టీ తాగేవాళ్లలో చెడు కొలెస్ట్ర్రాల్ తగ్గి మంచి కొలెస్ట్ర్రాల్ పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా మహిళల్లో గ్రీన్ టీ ఎఫెక్ట్ చాలా బాగా ఉంటుంది. మెదడు మీద మంచి ప్రభావాన్ని చూపి మనసు ప్రశాంత పరుస్తుంది.

డార్క్ చాక్లెట్:
తలనొప్పి తగ్గాలని సాధారణంగా ఒక చాక్లెట్ తింటారు. ప్రత్యేకించి మహిళలు డార్క్ చాక్లెట్ తింటారు. డార్క్ చాక్లెట్ లో వున్న కోకో పౌడర్ రిలీఫ్ ఇస్తుంది. డార్క్ చాక్లెట్స్ తినడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కేలరీలను కరిగిస్తుంది. శరీరంలో పేరుకొన్న కొవ్వు నిల్వలలను కరిగిపోయేలా చేస్తుంది. డార్క్ చాక్లెట్స్ లో కోక అధికంగా ఉండటం వల్ల కళ్ళ చుట్టూ ఉండే కార్నియాను ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి అన్ స్వీటెడ్ డార్క్ చాక్లెట్ ను రెగ్యులర్ తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. మూడ్ ను కూడా హేపీగా మార్చేస్తాయని తాజాగా పోషకాహార నిపుణులు చెపుతున్నారు. కనుక మీ శరీరంలోని రసాయనాలను ఉత్తేజపరచాలంటే ఒక డార్క్ చాక్లెట్ తినండి.

నీళ్లు:
నీళ్ళు బాగా తాగడం వల్ల డీహైడ్రేషన్ ను తగ్గిస్తుంది. నీళ్ళను సరైన మోతాదులో తీసుకోవడం వల్ల వ్యక్తుల యొక్క మూడ్ మారుతుంది. ఎనర్జీలెవల్స్ పెరుగుతాయి. మెంటల్ ఫంక్షన్స్ కు ఉపయోగపడుతుంది.

సాండ్విచ్:
ఇది ఒక బెస్ట్ ఫుడ్. పనిలో ఉన్నప్పుడు ఇది మీ మూడ్ నేచురల్ గా పెంచుతుంది. ఇది ఒక వెజిటేరియన్ సాండ్విచ్. అలాగే ఇది ఒక ఫాస్ట్ అండ్ హెల్తీ లంచ్ మీల్.

బీట్ రూట్:
బీట్ రూట్ ఎవరైతే అనీమియాతో బాధపడుతుంటారో వారికోసం మాత్రమే కాదు, బ్యాడ్ మూడ్ లో ఉన్నవారికి కూడా మంచిగా సహాయపడుతుంది. పచ్చిబీట్ రూట్ కి చిటికెడు ఉప్పు చిలకరించి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం మరియు మంచి మూడ్ ను అంధిస్తుంది.

క్యారెట్:
బీట్ రూట్ వలె క్యారెట్ కూడా మంచి ఆరోగ్యకరమైన ఆహారం. క్యారెట్స్ లో బీటాకెరోటిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎనర్జీని అంధిస్తాయి మరియు మెదడకు కూడా మంచి ఆహారం.

లెమన్ జ్యూస్:
తాజాగా ఉండే ఒక కప్పు లెమన్ జ్యూస్ ను మీ బ్యాడ్ మూడ్ ను మార్చడంలో ఆశ్చర్యం కలిగిస్తుంది. పనివద్ద మీరు బ్యాడ్ మూడ్ తో ఉన్నప్పుడు మీరు ఫ్రెష్ గా ఉండే ఒక కప్పు నిమ్మరసాన్ని తీసుకోవడం వల్ల మీ మూడ్ మరింత పెంచుతుంది.

డ్రై ఫ్రూట్స్:
డ్రై ఫ్రూట్స్ లో ద్రాక్ష మరియు ప్రూనెలు వంటి వాటిని మీ వర్క్ ప్రదేశంలో చాలా సులభంగా తీసుకొనే స్నాక్స్ వంటివి . మీ మూడ్ మెరుగుపరుచుకోవడానికి, ఈ రెండు హెల్తీ ఫుడ్స్ చాలా గొప్పగా సహాయపడుతాయి.

నట్స్:
బాదంలో అత్యధికంగా విటమిన్లు కలిగి ఉండి, మీలో ఎనర్జీ లెవల్స్ ను పెంచుతుంది . అలాగే ఇది హెల్తీ బ్రెయిన్ ఫుడ్. గుప్పెడు బాదం పప్పులు తీసుకోవడం వల్ల మీ మూడ్ ను పెంచుతుంది.

అరటిపండు:
అరటిపండ్లలో పొటాషియం మరియు ప్రోటీనులు అధికంగా ఉంటుంది . ఈ రెండు ఎలిమెంట్స్ మీలో అనుకూల పరిస్థితులను ఏర్పరుస్తుంది . బాగా పండిన అరటిపండు లేదా ఫ్రూట్ సలాడ్ వంటి ఒక మంచి ఆప్షన్.

దాల్స్:
పెసరపప్పు ప్రతి ఒక్కరికీ ఫేవరెట్ స్నాక్. ఫ్రై చేసిన పెసరపప్పు, ఆరోగ్యానికి అంత మంచిది కాకపోయినా. తక్కువ మోతాదులో తీసుకోవడం, మీ మూడ్ మెరుగుపరచడానికి బాగా సహాయపడుతుంది.

క్రాకర్స్:
క్రిస్పీగా ఏదైనా చూసినప్పుడు చాలా టెంప్ట్ చేస్తాయి. అటువంటి వాటిలో క్రాకర్స్ ఆరోగ్యకరంమ మరియు మీ మూడ్ ను పెండానికి నేచురల్ గా సహాయపడుతుంది.

చిప్స్:
దీన్ని హ్యాబిట్ గా మార్చుకోకండి. గుప్పెడు చిప్స్ ను మూడ్ పెంచడానికి గొప్పవే అయినా, ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కాదు, కాబట్టీ, మీరు తీసుకొనే మోతాదును బాగా తగ్గించాలి.



Click it and Unblock the Notifications
