Latest Updates
-
కార్పొరేట్ ఉద్యోగులే ఆశ్చర్యపోయేలా పనిమనిషి జీ'వి'తం.. ఆమె సేవింగ్స్ ప్లానింగ్‌కి హ్యాట్సఫ్.! -
ఆరోగ్య సిరి, రుచుల గని..వేళ్లు కొరుక్కునే మునగాకు ఇడ్లీ తయారీ విధానం ఇదే! -
దారుణమైన ఆచారం: పేరుకే కోడలు..ఇంట్లో ఎవరికి దొరికితే వాళ్లు కాపురం చేస్తారు..మామ,మరిది కూడా! -
మందులతో పనిలేని బెస్ట్ డిటాక్స్ డ్రింక్.. అల్సర్‌ను పోగొట్టే కమ్మనైన తమలపాకు రసం.! -
రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ దొన్నె బిర్యానీ ఇంట్లోనే చాలా ఈజీగా.. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి -
మెనోపాజ్ తర్వాత మహిళల్లో అనారోగ్యానికి కారణాలివే.. ఈ భాగాలపైనే ఎక్కువ ఎఫెక్ట్.! -
దిశను మార్చుకోనున్న సూరీడు.. ఈ మూడు రాశుల వారికి నెలరోజుల పాటు గడ్డు కాలమే.! -
లంబోదరుడికి ప్రీతికరమైన బెల్లం పాల తాలికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ కొలతలతో ట్రై చేయండి.! -
సెప్టెంబర్ 11 రాత్రి 7 గంటల తర్వాత..వృషభం, సింహం, వృశ్చిక రాశులకు లాటరీ తగిలినంత అదృష్టం! -
ఫ్రిజ్‌లో పెట్టినా నిమ్మకాయలు రంగు మారుతున్నాయా.. ఈ 3 టిప్స్‌తో ఎన్ని రోజులైనా తాజాగానే.!
కడుపు ఉబ్బరాన్ని నియంత్రించే 10 ఆహారాలు..!
కడుపు ఉబ్బరం మిమ్మల్ని గర్భణీలా కనబడేలా చేస్తుంది. కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు కడుపు ఉబ్బుకొని పైకి కనబడుతుంటుంది. కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు మీ కడుపు నిండుగా ఉన్నట్లు మరియు అన్ని సమయాల్లో టైట్ గా ఉన్నట్లు అనిపిస్తుంది. కడుపు ఉబ్బరం వల్ల ఉదరభాగం బిగదీసుకు పోయి పట్టేసినట్లు ఉండి, అసౌకర్యంగా ఉంటుంది. కొద్దిగా ఆహారం తీసుకోగానే కడుపు నిండిన భావన, ఒళ్లు నొప్పులు, ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వంటి వివిధ లక్షణాలు అన్నీ కాని, లేదా వీటిలో కొన్ని కాని ఉంటాయి. ఇలా అనిపించడానికి ప్రధానకారణం కడుపు ఉబ్బరం. మరియు మీకు అనిపించవచ్చు ఎందుకు ఇలా కడుపు ఉబ్బరంగా ఉందని? కడుపు ఉబ్బరం అంటే కడుపులో ఎక్సెసీవ్ గ్యాస్, ఉడటం వల్ల కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. మలబద్దకం, ఎక్కువగా తినటం, చెడు ఆహారపు అలవాట్లు, మాట్లాడేటప్పుడు, తినేటప్పుడు గాలి మింగడం, చీకాకు పెట్టే పేగు వ్యాధి మరియు pms(బహిష్టకు పూర్వ లక్షణంతో)కడుపు ఉబ్బరానికి సాధారణ కారణాలు.
కొన్ని ఆహారాలు కూడా కడుపులో అధిక గ్యాస్ ను ఏర్పరిచి కడుపు ఉబ్బరానికి కారణం అవుతుంది. కాబట్టి మీరు తీసుకొనే ఆహారాల్లో కొన్నింటిని మినహాయించినట్లైతే కడుపు ఉబ్బరాన్ని నియంత్రించవచ్చు. ఉదాహరణకు: మసాలా మరియు వేయించిన ఆహారాలు కడుపు ఉబ్బరానికి ప్రధాన కారణాల్లో ఒకటి కావచ్చు. కొన్ని స్పైసీ ఫుడ్స్, ఛాట్స్, బ్లాక్ పెప్పర్, బెల్ పెప్పర్, రెడ్ చిల్లీ మొదలగునవి తీసుకోవడం వల్ల కడుపులో కడుపు ఉదర బాగంలో యాసిడ్ పెంచడానికి కారణం అవుతుంది. ఇది కడుపు ఉబ్బరానికి దారితీస్తుంది. కాబట్టి మీరు తీసుకొనే ఆహారం నుండి ఈ క్రింది ఆహారాలను మినహాయించి మీ కడుపు ఉబ్బరం నుండి ఉపశమనం పొందండి..

మసాలా దినుసులు: మసాలా దినుసులు, కారంగా ఉన్న ఆహారాలు తినడానికి టేస్ట్ గా ఉండటమే కాదు, ఇవి శరీరంలో జీవక్రియల రేటును కూడా పెంచుతాయి. మసాలా పదార్థాలు జీవక్రియలను మందగిస్తుంది. దాంతో తిన్న ఆహారం నిదానంగా జీర్ణం అవ్వడంతో కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. కడుపు మంటకు దారితీసి అసౌకర్యం కలిగిస్తుంది.

పిండి పదార్థాలు: వైట్ బ్రెడ్, పాస్తా, పొటాటో, మైద వంటి వాటిలో పిండిపదార్థాలు అధికంగా ఉంటాయి. పిండిపదార్థాలు జీర్ణం అవ్వడానికి చాలా కష్టం. అందువలన వాయువు, నిర్జలీకరణం మరియు ఉబ్బరం వంటి లక్షణాలు కనబడటంతో పాటు పెద్ద ప్రేగులలో ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది.కాబట్టి మీ తీసుకొనే ఆహారం నుండి పిండి పదార్థాలను మినహాయించండి.

బ్రసెల్స్: ఇవి ఆరోగ్యరమైన ఆహారం కావచ్చు కానీ వీటిలో కొన్ని గ్యాస్ కు కారణం కావచ్చు. కొంత మందిలో గ్యాస్ ఉత్పత్తి ఆహారాలు గ్రహించడం మరియు వాటిని తిని అరిగించుకొనే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. దాంతో కడుపులో గ్యాస్ ఏర్పడి కడుపు ఉబ్బరానికి కారణం అవుతుంది.

క్యాబేజ్: ఇది మరో గ్యాస్ ఉత్పత్తి ఆహారం. ఇది చాలా నిధానంగా జీర్ణం అవ్వడం వల్ల కడుపు ఉబ్బరానికి కారణం అవుతుంది.

పండ్లు: కొంత మంది ఫ్రక్టోజ్ లోపం వల్ల బాధపడుతున్నారు. మీరు పండ్లు తిన్న తర్వాత కడుపులో అసౌకర్యంగా గ్యాస్ తో బాధపడుతున్నట్లు అనిపిస్తే, అటువంటి పండ్లను మినహాయించవచ్చు. ఫ్రక్టోజ్ ఇన్ టాలరెన్స్ వల్ల కడుపు ఉబ్బరానికి దారితీస్తుంది.

వేయించిన ఆహారాలు: పకోడా, సమోస, ఫ్రెంచ్ ఫ్రైస్, మరియు బర్గర్స్ ఇవి తినడానికి చాలా ఉత్సహాంగా ఇష్టంగా ఉంటుంది. అయితే ఈ నూనె పదార్థాలు అంత త్వరగా జీర్ణం అవ్వక కడుపులో గ్యాస్ ఏర్పడటానికి కారణం అవుతుంది.

ఉప్పు: ఉప్పులో అధికంగా ఆహార పదార్థాలను తినడం వల్ల శరీరంలోని నిరు కరిగిపోయి ఉబ్బరంకు దారితీస్తుంది. ప్రాసెస్ చేసిన ఉప్పగా ఉన్న ఫ్రైడ్ ఫుడ్స్ ను మినహాయించండి.

మసాలాలు: కొన్ని మసాలా దినుసులు బ్లాక్ పెప్పర్, నట్ మగ్, లవంగాలు మొ..కడుపు ఉబ్బరానికి కారణం కావచ్చు. అవి జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇవి రెగ్యులర్ డైజెస్టివ్ సిస్టమ్ ను ఇర్రెగ్యులర్ చేస్తుంది.

పప్పు ధాన్యాలు: చాలా మందికి, పప్పు ధాన్యాలు పడువు కడుపు ఉబ్బరానికి గురిచేస్తాయి. ధాన్యాలు గ్యాస్ ను అధికంగా ఉత్పత్తి చేసే ఆహారాల్లో ప్రధానమైనవిగా భావిస్తారు. కాబట్టి మీ రెగ్యులర్ డైట్ నుండి మీకు పడని ధాన్యాలను మినహాయించాలి.

డైరీ ప్రొడక్ట్స్: టాక్టోస్ పడకపోవడం కూడా గ్యాస్ కు ఉబ్బరానికి కారణం అవుతుంది. కాబట్టి డైరీ ప్రొడక్ట్స్ వల్ల మీరు కడుపు ఉబ్బరంగా అనిపిస్తే వీటిని మీ డైట్ నుండి మినహాయించండి.



Click it and Unblock the Notifications
