వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుండి శరీరానికి రక్షణ కల్పించే ఆహారాలు

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో రోజు, రోజుకి మీరు వెరైటీ ఫుడ్స్ తీసుకుంటూ ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడంతో పాటు, మీ టేస్ట్ బడ్స్ ను సంతృప్త పర్చండి .ముఖ్యంగా మీరు తీసుకొనే ఆహారం, తగినన్ని పోషకాలు మీ శరీరానికి అందేలా చూసుకోవాలి. అంటే మంచి పోషకాహారాన్ని మాత్రమే ఎక్కువగా తీసుకోవాలి. మంచి పోషకాహారం తీసుకోవడం వల్ల మీ శరీర ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఇతర వ్యాధులు మరియు ఇన్ఫెక్షన్స్ సోకకుండా వ్యాధినిరోధకతను పెంచే ఆహారాలు తీసుకోవాలి. మన శరీరానికి అనేక పోషకాంశాలు అవసరం అవుతాయి. అందులో ముఖ్యంగా యాంటీయాక్సిడెంట్స్, విటమిన్స్ ఎ, బి, సి, ఇ మరియు బీటాకెరోటిన్ తో పాటు ఇతరములు. ఇవన్నీ కూడా మన శరీరంలో కలిగే అనేక ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి.

ఇన్ఫెక్షన్లతో పోరాడే అటువంటి ఆహారాలను మీరు తీసుకుంటున్నారా? మీరు ఒక హెల్తీ డైట్ ను ఫాలో చేస్తుంటే కనుక, మీరు తప్పకుండా అనేక ఆరోగ్యప్రయోజనాలు పొందుతారు, మరియు మీ నిరోధక వ్యవస్థను పోషణకు సహాయపడుతాయి. కానీ, మీరు ఏద తినాలి కాదా, కడుపు నింపుకొని ఆకలి తీర్చుకోవాలి కాదా అని ఏదో ఒకటి తింటే మాత్రం మీ ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపెడుతుంది.

మీకు ఇంతకు ముందు ఎప్పుడూ ఈ విషయాన్ని ఆలోచించి ఉండరు, అందుకే ఇప్పటి నుండి మొదలు పెట్టండి. అటు ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని పెంపొందిచే ఆహారాలను ప్రతి రోజూ వీలైనంత ఎక్కువగా తినడానికి ప్రయత్నించండి. మీ శరీరంలోని అనేక ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు వివిధ రకాలా మంచి ఆహారాలున్నాయి. వాటి ఈక్రింది స్లైడ్ లో ఇస్తున్నాం వాటిని పరిశీలించి, ఇన్ఫెక్షన్ల బారీ నుండి బయటపడండి...

ఇన్ఫెక్షన్ల నుండి శరీరానికి రక్షణ కల్పించే ఆహారాలు

ఇన్ఫెక్షన్ల నుండి శరీరానికి రక్షణ కల్పించే ఆహారాలు

పసుపు: ఇండియన్ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగించే ఒక ఇండియన్ స్పైసీ మసాలా దినుసు. పసుపులో యాంటి సెప్టిక్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే , ఇన్ఫెక్షన్లను మరియు ముక్కు కారడాన్ని, జలుబు, మరియు ఇతర స్కిన్ ఇన్ఫెక్షన్స్ ను తగ్గిస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో అర చెంచా పసుపు వేసి త్రాగడం వల్ల జలుబు మరియు థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ను నివారించవచ్చు.

ఇన్ఫెక్షన్ల నుండి శరీరానికి రక్షణ కల్పించే ఆహారాలు

ఇన్ఫెక్షన్ల నుండి శరీరానికి రక్షణ కల్పించే ఆహారాలు

క్యాబేజ్: ఇన్ఫెక్షన్స్ ను ఎదుర్కోవడానికి క్యాబేజ్ ను ఎక్కువగా రెకమెండ్ చేయబడింది. క్యాబేజ్ లో యాంటీబయోటిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మరియు యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉండి స్టొమక్ అల్సర్, వంటి బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. కాబట్టి క్యాబేజ్ ను సలాడ్స్ లేదా డ్రిక్స్ రూపంలో తీసుకోవచ్చు.స్టొమక్ అల్సర్ నివారించుకోవచ్చు.

ఇన్ఫెక్షన్ల నుండి శరీరానికి రక్షణ కల్పించే ఆహారాలు

ఇన్ఫెక్షన్ల నుండి శరీరానికి రక్షణ కల్పించే ఆహారాలు

పెరుగు: పెరుగులో అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు తెలియకుండానే మీ రెగ్యులర్ డైట్ లో తీసుకుంటుంటారు. కానీ ఇందులో చాలా బలమైన యాంటీబ్యాక్టీరియల్ గుణాలున్నాయి. ప్రేగులోని అనేక ఇన్ఫెక్షన్లను ఇది నివారిస్తుంది. పెరుగులోని లాక్టిక్ యాసిడి డయోరియా మరియు డైసెంటరీ వంటివాటికి కారణం అయ్యే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

ఇన్ఫెక్షన్ల నుండి శరీరానికి రక్షణ కల్పించే ఆహారాలు

ఇన్ఫెక్షన్ల నుండి శరీరానికి రక్షణ కల్పించే ఆహారాలు

కోకోనట్: ఇది మంచి పోషకాహారం మాత్రమే కాదు, అనేక ఇన్ఫెక్షన్ల నుండి ఉపయశమనం కలిగిస్తుంది. కాబట్టి మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. దాంతో కలరావంటి వ్యాధులను నివారించవచ్చు. లేదా కొబ్బరి నీళ్ళు, నిమ్మరసం వంటివి రెగ్యులర్ గా తీసుకోవడం ఉత్తమం.

ఇన్ఫెక్షన్ల నుండి శరీరానికి రక్షణ కల్పించే ఆహారాలు

ఇన్ఫెక్షన్ల నుండి శరీరానికి రక్షణ కల్పించే ఆహారాలు

వెల్లుల్లి: ఇన్ఫెక్షన్స్ మరియు ఎలర్జీలని తగ్గించే లక్షణాలు వెల్లుల్లిలో ఉన్నాయి. వండిన వెల్లుల్లి కంటే పచ్చి వెల్లుల్లి ఎంతో మంచిది. అందువల్ల 3 లేదా 4 రెబ్బల వెల్లుల్లిని తేనెతో కలిపి ప్రతి రోజూ తీసుకోవడం వల్ల ఎలర్జీలు తగ్గుతాయి. వీటిలో యాంటీబ్యాక్టీరియాల్, యాంటీమైక్రోబ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ మరియు యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల అనేక ఇన్ఫెక్షన్లతో పోరాడి, ఆరోగ్యంగా ఉంచతుంది. ఇన్ఫెక్షన్ల కు కారణం అయ్యే బ్యాక్టీరియాతో పోరాడుతుంది.

ఇన్ఫెక్షన్ల నుండి శరీరానికి రక్షణ కల్పించే ఆహారాలు

ఇన్ఫెక్షన్ల నుండి శరీరానికి రక్షణ కల్పించే ఆహారాలు

అల్లం: అల్లంలో యాంటీబయోటిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్స్ డయోరియా, కలరా, ఎసిడిటి వంటివి తగ్గించడానికి సహాయపడుతాయి. అలాగే గొంతు ఇన్ఫెక్షన్స్ కు అద్భుతంగా సహాయపడుతుంది. ఒక టేబుల్ స్పూన్ అల్లం రసంకు ఒక చెంచా తేనె మిక్స్ చేసి, తీసుకోవాలి.

ఇన్ఫెక్షన్ల నుండి శరీరానికి రక్షణ కల్పించే ఆహారాలు

ఇన్ఫెక్షన్ల నుండి శరీరానికి రక్షణ కల్పించే ఆహారాలు

క్యారెట్: క్యారెట్ ఇన్ఫెక్షన్లకు చాలా మంచిది. కార్యెట్ జ్యూస్ కళ్ళ ఇన్ఫెక్షన్స్ ను తగ్గిస్తుంది. గొంతు ఇన్ఫెక్షన్స్, టాన్సిల్స్, శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. క్యారెట్ లో యాంటీయాక్సిడెంట్స్, బీటా కెరోటిన్ పుష్కలం. ఇవి అల్సర్ మరియు క్యాన్సర్ లక్షణాలను నివారిస్తుంది.

ఇన్ఫెక్షన్ల నుండి శరీరానికి రక్షణ కల్పించే ఆహారాలు

ఇన్ఫెక్షన్ల నుండి శరీరానికి రక్షణ కల్పించే ఆహారాలు

తేనె: తేనెలో చాలా బలమైన యాంటీబయోటిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి మరియు చాలా రకాల ఇన్ఫెక్షన్లకు నుండి మనల్ని రక్షిస్తుంది. మీకు గొంతుఇన్ఫెక్షన్ ఉన్నట్లైతే తేనె నీళ్ళలో వేసి గార్గిల్ చేయండి. మరియు నాలుక, ఓరల్ అల్సర్ కు చాలా మేలు చేస్తుంది.

ఇన్ఫెక్షన్ల నుండి శరీరానికి రక్షణ కల్పించే ఆహారాలు

ఇన్ఫెక్షన్ల నుండి శరీరానికి రక్షణ కల్పించే ఆహారాలు

నిమ్మరసం: త్రోట్ ఇన్ఫెక్షన్స్ కు ఇది ఒక మంచి రెమడీ. మీకు త్రోట్ సమస్య ఉన్నప్పుడు, నిమ్మరసం, తేనె మిక్స్ చేసి ఒక గంట కొకసారి తీసుకోండం వల్ల మంచి ఉపశమనం కలిగిస్తుంది. మరియు ఇది కలరా ఇన్ఫెక్షన్ కు కూడా చాలా మంచిది.

ఇన్ఫెక్షన్ల నుండి శరీరానికి రక్షణ కల్పించే ఆహారాలు

ఇన్ఫెక్షన్ల నుండి శరీరానికి రక్షణ కల్పించే ఆహారాలు

పైనాపిల్: పైనాపిల్ అద్భుతమైన రుచికలిగిన పండు మాత్రమే కాదు, ఇందులో అనేక ఆరోగ్యప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇది ఇన్ఫెక్షన్స్ ను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

Story first published: Thursday, November 7, 2013, 18:06 [IST]
Desktop Bottom Promotion