Latest Updates
-
వీకెండ్ అయినా, గెస్ట్స్ వచ్చినా..ఎగ్ పులావ్ తో ఇలా చేస్తే కిచెన్ లోనే ఉండిపోతారు! -
ఆగస్టు నెల రాశి ఫలాలు: ఈ 5 రాశుల వారికి తిరుగులేని విజయం..మీ రాశి ఉందో లేదో చూసుకోండి! -
ఎందుకు నాన్నలకు కూతుళ్లంటే అంత ప్రాణం? -
రీసెర్చ్ ప్రకారం ఒక పురుషుడు ఎంతసేపు శృంగారం చేయగలడు? శీఘ్రస్కలనం గురించి ముఖ్య నిజాలు.. -
ఇంట్లో ఈ ఒక్కటి వాడకపోతే ఇన్ని తిప్పలా.. అరికాళ్ల నొప్పులకి ప్రధాన కారణమిదే.! -
ఆ భయంతో భార్యను దూరం పెడుతున్నారా.. పురుషులను ఇబ్బందికి గురిచేసే శృంగార సందేహాలివే.! -
చపాతీ, అన్నంలోకి అదిరిపోయే రుచితో పెరుగు బెండకాయ గ్రేవీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వర్షం పడేటప్పుడు వేడివేడిగా హెల్తీగా తినాలంటే.. ఐదే నిమిషాల్లో లెమన్ గార్లిక్ సోయా చంక్స్ రెడీ.! -
శుక్ర-శని సమసప్తక యోగం.. ఆగస్టు 1 నుండి ఈ రాశులకు ఊహించని కష్టాలు! -
90స్ కిడ్స్ ఫేవరెట్ పల్లి ఉండలు ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!
పురుషులకు క్యారెట్ వల్ల పొందే అదనపు ప్రయోజనాలు
రోజూ మనం తీసుకునే కూరగాయలలో ఎన్నో విటమిన్లు మన శరీరానికి లభిస్తున్నం దువల్లే మనం ఆరోగ్యంగా ఉండగల్గుతున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే వాటిలో క్యారెట్‌ను మించింది మరొకటి లేదు. క్యారెట్‌లో ఎన్నో విటమిన్లతోపాటు మన జీవనాన్ని, ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్షణాలు పుష్కలంగా వున్నాయి. విటమిన్లు, ఖనిజాలు రెండింటి ఉత్తమ సమతౌల్యంగల కూరగాయ క్యారెట్. తాజా క్యారెట్ లో మనశరీరానికి అత్యంత ముఖ్యంగా కావలసిన 12 ఖనిజ లవణాల సమతౌల్యాన్ని మనం ఇందులో చూడగలం. మితంగా ఉపయోగపడే పరిమాణములో క్యారెట్ విటమిన్ బి, సి, జి లను ఇస్తూ శరీరానికి అవసరమైన పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, సోడియం, మాంగనీస్, సిలికాన్, అయోడిన్ లతో పాటు సల్ఫర్, భాస్వరం, క్లోరిన్ వంటి ఖనిజాలను సరఫరా చేస్తుంది. అతి ఉత్తమమైన, సహజమైన కాల్షియం (సున్నం) చక్కటి సమతౌల్యాన్ని అద్భుతంగా ఇది ఇవ్వగలద.
క్యారెట్ ప్రయోజనాలు మహిళ కంటే, పురుషులకే ఎక్కువగా ఉన్నాయడంలో ఆశ్చర్యం కలగక మానదు. ఎందుకంటే పురుషులు, రోజూ ఒక ఆపిల్ తినడం కంటే ఒక క్యారెట్ తినడం వల్ల గొప్ప ప్రయోజనాలను పొందవచ్చు అంటారు. పురుషులుతీసుకొనే ఆహారాల్లో మార్కెట్లో ఉండే అన్ని వెజిటేబుల్స్ లో కంటే క్యారెట్స్ లో అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయి. ఆ ప్రయోజనాలేంటని మనకు ఆశ్చర్యం కలగవచ్చు?క్యారెట్ లోని బీటాకెరోటిన్ స్త్రీలకు మాత్రమే కాదు, పురుషులకు కూడా అధిక ప్రయోజనాలను అంధిస్తుంది.
ఆహారనిపుణల ప్రకారం, ఈహెల్తీ వింటర్ వెజిటేబుల్ ను కనీసం వారంలో రెండు సార్లు తీసుకోవాలని అంటున్నారు . ఈ వింటర్లో ఎదురయ్యే అన్ని ఆరోగ్య సమస్యలను దూరంగా ఉంచే శక్తి సామర్థ్యం క్యారెట్స్ లో పుష్కలంగా ఉంది. క్యారెట్స్ ను ముఖ్యంగా పురుషుల డైట్ లిస్ లో చేర్చుకోవడానికి ప్రధాన కారణాలేమిటి, వాటి ఆరోగ్యప్రయోజనాలేంటి అన్న విషయాన్ని ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకోండి. ప్రతి రోజూ క్యారెట్స్ ను తీసుకోవడం వల్ల పురుషులకు కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ ఉన్నాయి. ముఖ్యంగా , 30 ఏళ్ళ వయస్సు దాటిన పురుషులు వారి రెగ్యులర్ డైట్ లో క్యారెట్ ను తప్పనిసరిగా చేర్చుకోవాలి. !కాబట్టి, పురుషు డైట్ లో క్యారెట్స్ తప్పనిసరి అని ఎందుకో ఈ క్రింది స్లైడ్ ద్వారా పరిశీలించండి...

రక్తం ప్యూరిఫై చేస్తుంది:
పురుషులు కూడా వారి శరీరంలోని రక్తంను శుద్దిచేసుకోవడం చాలా అవసరం!కాబట్టి, క్యారెట్స్ వల్ల పురుషులకు ప్రధాన ప్రయోజనం బ్లడ్ ఫ్యూరిఫికేషన్ . క్యారెట్స్ ను మెత్తగా గ్రైండ్ చేసి, జ్యూస్ తయారుచేసుకొని వారానికి ఒక సారి తీసుకోవచ్చు.

వీర్యకణాలను మెరుగుపరుస్తుంది:
ఆరోగ్యనిపుణుల ప్రకారం క్యారెట్ లోని అనేక విటమిన్లు, మినరల్స్, కెరోటినాయిడ్స్ పురుషుల్లో వీర్యకణాల క్వాలిటీని మెరుగుపరచడానికి సహాయపడుతందిని చెబుతున్నారు . కాబట్టి, ఫ్యామిలీ కోసం ప్రయత్నించే వారు వారానికొకసారి క్యారెట్స్ జ్యూస్ ను తీసుకోవాలి.

జీర్ణక్రియ:
క్యారెట్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది . పురుషులు ఎవరైతే, జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్నారో వారు, వారి రెగ్యులర్ ఆహారంలో రోజుకు రెండు సార్లు క్యారెట్స్ ను జోడించండి.

స్టొమక్ డిజార్డర్:
పురుషులకు క్యారెట్స్ చాలా ఆరోగ్యకరం. పురుషుల్లో వచ్చే అన్నిరకాల డిజార్డర్స్ ను క్యారెట్స్ నివారిస్తుంది . పురుషుల్లో గ్యాస్ట్రిక్ సమస్యను చాలా తేలికగా నివారిస్తుంది.

కొలెస్ట్రాల్:
పురుషులకు క్యారెట్ యొక్క బెస్ట్ బెనిఫిట్, వారిలో కొలెస్ట్రాల్ ను తగ్గించాడానికి సహాపడుతుంది. ప్రతి రోజూ డిన్నర్ తర్వాత ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ ను తీసుకోండి.

కళ్ళు ఆరోగ్యానికి :
పురుషులకు ఈ వింటర్ వెజిటేబుల్ యొక్క ముఖ్య ప్రయోజన కంటిచూపును మెరుగుపరుస్తుంది. కంటిచూపును మెరుగుపచడంతో పాటు దీర్ఘకాలిక చూపును మెరుగుపరుస్తుంది.

గుండె ఆరోగ్యానికి :
గుండెను ఆరోగ్యంగా ఉంచి, గుండె వ్యాధులు రాకుండా కాపాడుతుంది. యారెట్ గుండెకు సంబంధించిన వ్యాధులను దూరం చేస్తుంది. గుండెల్లో మంటగా ఉంటే క్యారెట్‌ను ఉడకబెట్టండి. దానిని చల్లార్చిన తర్వాత ఒక కప్పు రసంలో ఒక చెంచా తేనెను కలిపి సేవించండి. దీంతో గుండెల్లో మంటగా ఉంటే అది మటుమాయం అవుతుంది.

దంత సంరక్షణ:
క్యారెట్ల జ్యూస్ వల్లా, క్యారెట్‌ను పచ్చిగా అలాగే తినడం వల్లా నోటి అల్సర్ నివారణ సాధ్య మవుతుంది. క్యారెట్, టవెూటా, బత్తాయి పండ్ల రసాలను సమపాళ్ళలో తీసుకుని రెండు నెలల పాటు క్రమం తప్పకుండా వాడి నట్లయితే, నోటి అల్సర్‌నున పూర్తిగా నివారించవచ్చు.

కీళ్ళనొప్పులు:
వయస్సు పెరిగే కొద్దీ, కీళ్ళనొప్పులు స్త్రీలు మరియు మహిళల్లో తప్పనిసరిగా వేధించే సమస్య ఇది. అందువల్ల, ఈ సమస్యను నివారించడానికి ప్రతి రోజూ ఒక పచ్చిక్యారెట్ ను తినండి. ఇందులో ఉండే విటమిన్ సి అందుకు బాగా సహాయపడుతుంది. ఎముకలను బలంగా ఉంచుతుంది.

క్యాన్సర్ నివారిణి:
క్యారెట్, కాలిఫ్లవర్‌లోని ఎ విటమిన్ శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతో పాటు క్యాన్సర్ పెరుగుదలకు బ్రేక్ వేయడంతో సహా నియంత్రిస్తుందని స్టడీలో వెల్లడైంది.

వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది:
క్యారెట్‌లో రక్తహీనతను పోగొట్టే గుణం ఉంది. రక్తహీనతకు కూడా క్యారెట్ దివ్య ఔషధంగా పనిచేస్తుంది. అధిక పోషక విలువలుండటం వల్ల క్యారెట్‌లో రోగ నిరోధక శక్తి కూడా అధికంగానే ఉంటుంది. ఇందులోని రోగ నిరోధకశక్తి వలన కఠినమైన మొండి రోగాలు, దీర్ఘ వ్యాధులకు సైతం చెక చెప్పవచ్చునంటు న్నారు డాక్టర్లు.

డయాబెటిస్ తో బాధపడుతున్న పురుషులు వారి ఇన్సులిన్
డయాబెటిస్: స్థాయిలను క్రమంగా ఉంచుకోవడానికి పచ్చిక్యారెట్లను తింటుండాలి.

మలబద్దకం:
క్యారెట్లు రెగ్యులర్ గా తినడం వల్ల మలబద్దకం దూరం చేస్తుంది. ఇది ప్రేగుల్లో పేరుకుపోయిన మలాన్ని శుద్ధి చేస్తుంది. క్యారెట్ జ్యూస్‌లోని పీచు పదార్థం ప్రేవుల గోడలను శుభ్రం చేసి, మలినా లను బయటికి పంపించివేస్తాయి.

బ్లడ్ ప్రెజర్:
క్యారెట్స్ లో ఉండే పొటాషియం పురుషులకు చాలా ప్రయోజనకరం. ఇది హైపర్ టెన్షన్ కు అనుసంధానమైన హైలెవల్ సోడియంను బ్యాలెన్స్ చేస్తుంది.



Click it and Unblock the Notifications