Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
ఖర్జూరంలోని విలువైన ఆరోగ్య ప్రయోజనాలు...!

ప్రత్యేకించి పిల్లలకు, సాధారణంగా పెద్దలకు వేసవిలో శక్తినివ్వటానికి వాడవచ్చు. ఈ పండులో వుండే నికోటిన్ పేగు సంబంధిత సమస్యలకు మంచి వైద్యంగా వాడవచ్చు. దీనిని తరచుగా వాడుతూంటే, పేగులలో స్నేహపూరిత బాక్టీరియాను బాగా అభివృధ్ధి చేయవచ్చు. పిల్లలనుండి పెద్దలదాకా ఎంతో ఇష్టంగా తినే పండు ఖర్జూరాలు. ఇందులో ఎక్కువగా ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్, మరియు సాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా కలిగి ఉన్నాయి. ఇవి ఎక్కువ ఫైబర్(పీచుపదార్థాల) ను కలిగి ఉండి జీర్ణవ్యవస్థకు బాగా సహాయపడుతాయి. నేడు ఖర్జూరాలను స్వీట్ల తయారీలో కూడా వాడుతున్నారు. పంచదారకు బదులుగా ఖర్జూరాలను వాడితే ఆరోగ్యానికి హాని కలుగకుండా తియ్యదనం వస్తుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే వీటిలో ఉన్నది సహజసిద్ధమైన తియ్యదనం.
పాలలో ఖర్జూరపండు వేసి బాగా మరిగించి ఆ పాలను తాగితే శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. బరువు తక్కువగా ఉండి సన్నగా ఉండే వారికి ఇవి చాలా బాగా సహాయపడుతాయి. అలాగే కర్జూరాలను రాత్రంతా పాలలో నానబెట్టి ఉదయం మిక్సీలో వేసి జ్యూస్ లా తయారు చేసి తాగడం వల్ల శరీరానికి కావల్సిన న్యూట్రిషియన్స్ అధికంగా అందుతాయి. దాంతో రోజంతా పనిచేయడానికి కావల్సిన శక్తి అందుతుంది. ఆకలిగా ఉన్నప్పుడు..మూడ్ సరిగా లేనప్పుడు చాక్లెట్స్ కు బదులు కర్జూరాలను తినడం వల్ల మంచి మూడ్ తో ఉత్సాహంగా పనిచేయగలరు.
కర్జూరంలో అధిక శాతంలో అంటే అరటి పండులో కంటే ఎక్కుంగా పొటాషియం కలిగి ఉంటుంది. ఇది గుండె కొట్టుకోవడానికి చాలా సహాపడుతుంది. బ్లడ్ లెవన్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది. కర్జూరాలను రెగ్యులర్ గా తినడం వల్ల గుండె నొప్పిని రాకుండా అడ్డుకోవచ్చు. అంతే కాదు ఇందులో ఉండే ఐరన్ క్రోనిక్ అనీమీయా రాకుండా కాపాడుతుంది. కర్జూరంలో విటమిన్స్ కన్నా అమీనో యాసిడ్స్ అధిక శాతంలో ఉంటాయి. ఇవి కండరాల పెరుగుదలకు బాగా సహాపడుతాయి.
కర్జూరంలో ఇంకా పెక్టిన్ అనే రసాయనం ఉండటం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ లెవల్ ను అదుపులో ఉంచుతుంది. కర్జూరాలను తరచూ తినడం వల్ల ఆబ్డామినల్ క్యానర్ రాకుండా కాపాడుతుంది. అంతే కాదు కర్జూరాలు గర్భిణీ స్త్రీలకు చాలా ఆరోగ్యకరం. వారు ఇవి తినడం వల్ల ప్రసవం సులభతరం అవుతుంది. గర్భిణీ స్త్రీకి కావల్సిన కె విటమిన్ పుష్కలంగా లభిస్తుంది.
కర్జూరంలో దంతక్షయాన్ని పోగొడుతాయి. ఇందులో ఉండే ప్లోయిరిన్ దంతాలు గంటిగా ఉండేలా సహాపడి, త్వరగా ఊడిపోకుండా కాపాడుతాయి. ఇంకా బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సెక్స్యూవల్ స్టామినా ను పెంచుతుంది. ఎముకల పెరుగుదలకు బాగా సహాపడుతుంది. ఇన్నిఆరోగ్య ప్రయోజనాలు కలిగించే కర్జూరాలను కేక్స్, కుక్కీస్ లలో విరివిగా ఉపయోగిస్తుంటారు. నేడు ఖర్జూరాలను స్వీట్ల తయారీలో కూడా వాడుతున్నారు. పంచదారకు బదులుగా ఖర్జూరాలను వాడితే ఆరోగ్యానికి హాని కలుగకుండా తియ్యదనం వస్తుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే వీటిలో ఉన్నది సహజసిద్ధమైన తియ్యదనం. కాబట్టి కర్జూరాలను మీ రెగ్యులర్ డైయట్ లో చేర్చి ఆరోగ్యంగా అందంగా జీవించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
