Latest Updates
-
ఇన్‌స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.! -
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.!
గ్రీన్ గార్లిక్ ను ఎప్పుడైనా చూసారా.?పోనీ విన్నారా...?
లేలేతగా ఉండే గ్రీన్ గార్లిక్స్ ఈ వేసవికి మెళ్ళిమెళ్ళిగా మార్కెట్లోనికి అడుగిడుతున్నాయి. ఈ ఆరోమాటిక్ స్పింగ్ర్ గ్రీన్ గార్లిక్ (చిన్నవెల్లుల్లి) ఎలా ఉంటాయంటే?అచ్చు చిన్న ఉల్లిపాయల్లా ఉంటాయి. ఈ వసంత కాలంలో ఈ గ్రీన్ గార్లిక్ ఎక్కువగా లభిస్తాయి కనుకవీటిని వివిధ రకలా వంటల్లో ఉపయోగిస్తారు. మీరు ఇప్పటికీ ఆలోచిస్తుండొచ్చు పెద్దపెద్ద వెల్లుల్లి రెబ్బలుండాగా ఈ గ్రీన్ గార్లిక్ అవసరమేంటని? ఈ గ్రీన్ గార్లిక్ లో పెద్ద వెల్లుల్లిలో ఉన్నంత ఘాటు వాసన ఉండదు. ఈ గ్రీన్ గార్లిక్ చాలా సాఫ్ట్ గా అంతే టేస్ట్ తో ఒక డిఫరెంట్ ఆరోమా(సువాసనను)కలిగి వంటలకు ప్రత్యేక రుచిని అందిస్తాయి. చిన్న ఉల్లిపాయలు, మరియు గ్రీన్ గార్లిక్ దరిదాపు ఒకే విధంగా ఉండటం వల్ల చాలా మంది, రెండూ ఒకటేనని పొరబడుతుంటారు. అయితే, చిన్న ఉల్లిపాయల కంటే గ్రీన్ గార్లి లైట్ పర్పుల్ కలర్ కలిగి ఉంటాయి.
మరి, గ్రీన్ గార్లిక్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటి?పెద్ద వెల్లుల్లిలో ఉండే ధరిదాపు లక్షణాలు, ఆరోగ్యప్రయోజనాలు ఈ చిన్న వెల్లుల్లిలో కూడా పుష్కలంగా ఉన్నాయి. మరింకెదుకు ఆలస్యం ఈ స్ర్పింగ్ వెజిటేబుల్ లోని హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఒకసారి చూద్దాం...
స్ర్పింగ్ గార్లిక్ హెల్త్ బెనిఫిట్స్:
వ్యాధినిరోధక శక్తిని పెంపొదిస్తుంది: గ్రీన్ గార్లిక్ వల్ల ఇది ఒక అతి పెద్ద హెల్త్ బెనిఫిట్. ఇందులో అల్లిసిన్, సల్ఫర్ అధికంగా ఉండటం వల్లే వీటికి అంత ఘూటైన వాసన వస్తుంది . ఈ సల్ఫర్ గుణాలే మన శరీరానికి ఎటువంటి వ్యాధి సోకకుండా, ఇన్ఫెక్షన్లు సోకకుండా...వ్యాధినిరోధకతను పెంపొందిస్తుంది.

యాంటీబయాటిక్: గ్రీన్ గార్లిక్ లో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల శరీరాన్ని ఎటువంటి ఇన్ఫెక్షన్లకు గురికాకుండా కాపాడుతుంది.
రక్తహీనత/ఐరన్ పుష్కలం: ఎవరికైతే బ్లడ్ కౌంట్ తక్కువగా ఉండి, రక్తహీనతతో బాధపడుతుంటారో వారి ఈ గ్రీన్ గార్లిక్ ను తినడం వల్ల ఐరన్ పుష్కలంగా ఉంటుంది . ఇంకా ఇందులో ప్రోటీనులు, ఫెర్రోప్రోటీనులు ఉండి ఐరన్ నిల్వ ఉండటానికి సహాయపడుతుంది. దాంతో శరీరంలో బ్లడ్ పెరగడానికి మరియు ఐరన్ లెవల్స్ పెంచడానికి గ్రీన్ గార్లిక్ బాగా సహాపడుతాయి.
గ్యాస్ట్రిక్ తో పోరాడుతుంది: గ్రీన్ గార్లిక్ జలుబు మరియు దగ్గును నివారించడమే కాకుండా గ్యాస్ట్రిక్ ను నివారించడానికి సహాయపడుతుంది. జీర్ణ సంబంధిత ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది.
ఈ వన్నీ కూడా గ్రీన్ గార్లిక్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు. కాబట్టి గ్రీన్ గార్లిక్ ను ఈ రోజే మీ డైయట్ లో చేర్చేసుకోండి..!
గ్రీన్ గార్లిక్ ఎలా ఉపయోగించాలి: సలాడ్స్ లో గార్నిషింగ్ గా ఉపయోగించవచ్చు. ఆకులను కంట్ చేసి వైట్ వెల్లుల్లిని గ్రేవీలో కలుపుకోవచ్చు. ఇంకా సూప్స్, పిజ్జా వంటి వాటిలో విరివిగా వాడుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
