జ్వరంతో బాధపడేవారికి తక్షణ ఉపశమనం కలిగించే 20సూపర్ ఫుడ్స్..!

జ్వరం వచ్చినప్పుడు ఏమవుతుంది? శరీరంలో జీవక్రియల వేగం పెరుగుతుంది. దీంతో ఒంట్లో వేడి, బడలిక ఒక్కసారిగా పెరిగి పోతాయి. ఫలితంగా శక్తి వనరులు, పోషకాల అవసరం పెరుగు తుంది. చెమట ఎక్కువగా పట్టి ఒంట్లో నీరు తగ్గటమే కాదు. మాంసకృ త్తులూ తగ్గిపోతాయి. కాబట్టి జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ద అవసరం.

ఏదైనా ఆహారం తీసుకొన్నప్పడు అది అలాగే వామిట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. అందుకు కారణం హై ఫీవర్. జీర్ణక్రియ వేగం తగ్గుతుంది. ఏం తిన్నా టేస్ట్ లేకుండా ఉంటుంది. అయితే జర్వం వచ్చేటప్పుడు తినకుండా మాత్రం ఉండకూదు. తినడం వల్ల శరీర ఆరోగ్యానికి చాలా మంచిది. జర్వం వచ్చేసమయంలో కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల ఉపశమనం కలిగిస్తాయి. ఈ ఆహారాలు కడుపు నిండునట్టు చేయడమే కాకుండా పూర్తి న్యూట్రిషియన్స్ ఉండటమే కాదు ఆరోగ్యానికి కూడా మంచిది. అంతే కాదు ఈ ఆహారాలు పేషంట్ లో సులభంగా జీర్ణం అవుతుంది. జ్వరం వచ్చే సమయంలో చపాతీ, కిచిడి, లేదా దాలియా వంటివి సాధారణంగా తీసుకొనే ఆహారాలు. జ్వరం వచ్చే సమయంలో జీర్ణవ్యవస్థ మందగిస్తుంది కాబట్టి ఆ సమయంలో కారం ఆహారాలు మరియు ఆయిల్ ఫుడ్స్ కు దూరంగా ఉండటం మంచిది. కారం, ఉప్పు, ఆయిల్ ఫుడ్స్ తీసుకోవడం కంటే బాగా ఉడికించినఅన్నం, ఉడికించిన బంగాళదుంప లేదా బార్లీ గంజి వంటివి తీసుకోవచ్చు.

నిజానికి జ్వరం వచ్చినపుడు ఏ ఆహారం తీసుకోవాలనే దానిపై ఎన్నో అపోహలున్నాయి. అన్నం తినకూడదనీ, పప్పు కూరలూ వేసుకోవద్దనీ, పెరుగు తినొద్దనీ.. ఇలా రకరకాల అనుమానాలతో అన్నింటినీ దూరంగా పెట్టి, కేవలం బ్రెడ్డూ, పాలే తీసుకుంటూ గడిపేస్తారు. మరీ ఇంతగా ఆహార నియమాలేం అవసరం లేదు. కాకపోతే , కొన్ని జాగ్రత్తలు తీసు కోవటం తప్ప నిసరి. అవే మిటో చూద్దాం....

జ్వరం వచ్చినప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి...!

రోటీ: చిరు ధాన్యం అంటే గోధుమలతో తయారు చేసి రోటిలు ఇది హెల్తీ న్యూట్రీషియన్. ముఖ్యంగా రోటీలు చాలా తేలికగా జీర్ణం అవుతాయి. కాబట్టి నూనె లేదా నెయ్యి వంటివి వాడకుండా జ్వరం వచ్చినప్పుడు ఆయిల్ ఫ్రీ రోటీలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది.

జ్వరం వచ్చినప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి...!

ఉడికించిన అన్నం: ఇది జీర్ణం అవ్వడానికి చాలా సులభం. మరియు ఇందులో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. శరీరానికి కావల్సిన నీటి శాతాన్ని అంధిస్తుంది.

జ్వరం వచ్చినప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి...!

సూప్: సాధారణంగా జ్వరంతో పాటు జలుబు దగ్గు అనేవి వస్తుంటాయి . వీటిని నుండి ఉపశమనం పొందాలంటే వేడిగా ఉండే టమోటో లేదా క్యారెట్ సూప్ తీసుకోవడం ఆరోగ్యకరం. ఇది జీవక్రియలను ఉత్తేజపరుస్తుంది. మరియు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. బ్యాక్టీరియాకు విరుద్దగా పోరాడుతుంది.

జ్వరం వచ్చినప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి...!

కిచిడి: ఈ ఇండియన్ ఫుడ్ సు జర్వస్థులు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఇది చాలా లైట్ గా మరియు అతి సులభంగా జీర్ణం అవుతుంది. మరియు లోక్యాలరీలను కలిటి ఉంటుంది. కొద్దిగా లెమన్ పికెల్ వేసుకొని తినవచ్చు.

జ్వరం వచ్చినప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి...!

ఉడికించిన బంగాళాదుంప: ఉడికించిన బంగాళాదుంపలతో వివిధ రకాల వెరైటీలను తయారు చేస్తారు. వీటికి కొద్దిగా బ్లాక్ పెప్పర్ మరియు లవంగాల వంటి పౌడర్లు చల్లి తీసుకవోడం వల్ల జర్వంతో పాటు వంచ్చే జలుబు, దగ్గుకు తక్షణ ఉపశమనం కలిగించవచ్చు.

జ్వరం వచ్చినప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి...!

ఆపిల్స్: ఆపిల్స్ ను తీసుకోవడం వల్ల మీ శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుతుంది మరియు తెల్ల మరియు ఎర్రరక్త కణాల సెల్స్ ను ఉత్పత్తి చేస్తుంది మరియు రోగనిరోధక శక్తిని పెంపొదిస్తుంది. వైరల్ బ్యాక్టీరియాతో పోరాడుతుంది.

జ్వరం వచ్చినప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి...!

పండ్ల రసాలు: బాడీ టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు, నీరు మరియు పండ్ల రసాల వంటి డ్రింక్స్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. పానీయాలు డీహైడ్రేషన్ నుండి ఉపశమనం కలిగిస్తాయి మరియు ఇవి కడుపు నిండుగా ఉండేట్లు చేస్తాయి. అయితే జ్యూసులు చాలా చల్లగా తీసుకోకుండా జాగ్రతపడాలి.

జ్వరం వచ్చినప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి...!

తులసి టీ: హెర్బల్ టీ తీసుకోవడం వల్ల జర్వంతో పాటు వచ్చే దగ్గు, జలుబు మరియు గొంతు నొప్పికి తక్షణ ఉపశమనం కలిగించవచ్చు. జర్వంలో మీ మూడ్ బాగోలేనప్పుడు రిఫ్రెషింగ్ కోసం ఒక కప్పు తులసి టీ తాగి చూడండి.

జ్వరం వచ్చినప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి...!

గుడ్డు: ఉడికించి గుడ్లు పూర్తి పోషకాంశాలు కలిగి ఉండి వైట్, రెడ్ బ్లడ్ సెల్స్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది శరీరంలోని వివిధ రకాల ఇన్ఫెక్షన్ లతో పోరాడుతుంది.

జ్వరం వచ్చినప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి...!

కాచిన పాలు: పాలలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. జ్వరం వచ్చే సమయంలో మీరు చాలా వీక్ గా మారుతారు. మరియు మీరు బెడ్ మీద నుండి లేవాలంటే అందుకు స్టామినా చాలా అవసరం. కాబట్టి జ్వరం వచ్చే సమయంలో కాచి చల్లార్చిన పాలు తాగి స్టామినా పెంపొందించుకోవండంతో పాటు జ్వరంతో పోరాడండి.

జ్వరం వచ్చినప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి...!

చీజ్: ఇండియన్ కాటేజ్ చీజ్ ను జ్వరంతో బాధపడేవారి ప్రిఫర్ చేయవచ్చు. ఈ ఇండియన్ ఫుడ్ హెల్తీ మరియు బ్రేక్ ఫాస్ట్ గా చాలా మంచిది. చీజ్ ను పంచదారతో కలిపి తీసుకోవచ్చు.

జ్వరం వచ్చినప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి...!

దాలియా: బ్రోకెన్ వీట్(గోధుమ రవ్వ)మరో ఇండియన్ హెల్తీ ఫుడ్. దీన్ని జర్వంతో బాధపడేవారు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు . ఇది చాలా తేలికైన ఆహారం మరియు జీర్ణం అవ్వడం చాలా సులభం.

జ్వరం వచ్చినప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి...!

పోహ(అటుకులు): హెల్తీ బ్రేక్ ఫాస్ట్ డిష్ . కడుపు నిండుగా ఉంచుతుంది. మరియు టేస్టీగా ఉంటుంది. జర్వంతో బాధపడేవారు అతి తక్కువ మసాలాలు మరియు వెజిటేబుల్స్ తగ్గించి తీసుకోవచ్చు.

జ్వరం వచ్చినప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి...!

పెరుగు అన్నం: పెరుగు చాలా మెత్తగా ఉండటం వల్ల జీర్ణం అవ్వడానికి చాలా తేలిక. చాలా చల్లని పెరుగును తీసుకోకుండా ఉంటే గొంతునొప్పిని నివారించవచ్చు.

జ్వరం వచ్చినప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి...!

ఓట్స్: ఓట్ మీల్ చాలా ఆరోగ్యకరం మరియు న్యూట్రీషియన్ ఫుడ్ కూడా. ఓట్ మీల్ ను తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కడుపు ఫుల్ గా ఉన్నట్లు అనిపిస్తుంది.

జ్వరం వచ్చినప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి...!

ఇడ్లీ: జర్వంతో బాధపడే వారు కారం లేని సాంబార్ తో పాటు ఇడ్లీలను తీసుకోవడం వల్ల అతి తేలికగా జీర్ణం అవుతుంది. కడుపు నిండుగా అనిపిస్తుంది.

జ్వరం వచ్చినప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి...!

బార్లీ గంజీ: జర్వంతో బాధపడే వారు బార్లీ గంజిని తీసుకోవడం వల్ల తగినంత స్టామినా పొందవచ్చు. ఇది తాగడానికి టేస్ట్ గా కూడా ఉంటుంది. మరియు జ్వరంతో బాధపడే వారికి కొంత ఉపశమనం కలిగిస్తుంది.

జ్వరం వచ్చినప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి...!

విటమిన్ సప్లిమెంట్: జ్వరం వచ్చినపుడు శరీరానికి విటమిన్లు ఎ.సి.బి.కాంప్లెక్స్‌ల అవసరం పెరుగుతుంది. మనకు ఆహారం ద్వారా లభించే విటమిన్లు సరిగ్గా ఒంట బట్టకుండా కొన్ని రకాల యాంటీబయాటిక్స్‌ మాత్రలు అడ్డుకునే అవకాశం ఉంది. అందుకని కొంతకాలం పాటు విటమిన్‌ సప్లిమెంట్లూ తీసుకోవడం మంచిదే.

జ్వరం వచ్చినప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి...!

వీట్ బ్రౌన్ బ్రెడ్: జ్వరంతో బాధపడే వారు ఎటువంటి ఆహారాన్ని తీసుకోలేని పరిస్థితుల్లో గోధుమలతో తయారు చేసిన బ్రౌన్ బ్రెడ్ మరియు పాలు తీసుకోవడం వల్ల కొంత శక్తిని పొందవచ్చు.

జ్వరం వచ్చినప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి...!

పచ్చికూరగాయలు, క్యాబేజీ, బీన్స్‌ , బెండకాయలు, కాకరకాయ వంటి కూరలు, పచ్చళ్ళు, మసాలాలు, వేపుళ్ళు, చాక్లెట్లు, కేకులు, నెయ్యి, ఐస్‌క్రీములు, బిర్యానీ, పలావు లాంటి నూనె /కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు.

Desktop Bottom Promotion