వర్షాకాలంలో పాటించాల్సిన ఆరోగ్య రక్షణ చిట్కాలు!

వేసవి మెల్లిమెల్లిగా జారుకుంటోంది. వాతవరణం, రుతుపవనాలు వర్షాకాలానికి స్వాగతం పలుకుతున్నాయి. ఈ వాతావరణంలో మార్పులు మనుషుల ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపెడుతుంది. దాంతో సీజనల్ ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. వేసవికాలంలో చల్లనీటి స్నానం చేయాలంటే మహా సరదా, అయితే వర్షాకాలంలో చల్లటి నీటిని ముట్టుకోవాలంటే చాలా కష్టం. వాతావరణంలో మార్పుల వల్ల ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపెడుతుంది, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వర్షాకాలంలో జలుబు, జ్వరం, మరియు ఫ్లూ వంటి జబ్బులు చాలా సాధారణంగా వచ్చేటటువంటివి. కాబట్టి వాతావరణంలో మార్పులను బట్టి, మీ శరీరం అందుకు ఆరోగ్యంగా ఉండటానికి సిద్దం కావాలి .

వర్షం అంటే మనందరికీ చాలా ఇష్టం, కానీ, ఈ సీజన్ చాలా త్వరగా ఆరోగ్యసమస్యలను కూడా తీసుకొస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలంలో తడవడానికి చాలా మంది ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇది సరదాగా అనిపించవచ్చు, కానీ అది అవాంఛిత ఆరోగ్య సమస్యలు జలుబు, జ్వరం వంటి వాటికి దారితీస్తుంది. వేసవిలో వేసవి తాకిడిని తట్టుకోవడానికి చల్లటి నీటిని, చల్ల చల్లని పానియాలను తాగుతుంటాం. అలాగే వర్షాకాలంలో కూడా చాలా మంది చల్లని నీటిని తాగడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇది గొంతు నొప్పి మరియు జ్వరానికి దారితీస్తుంది. కాబట్టి వర్షాకాలంలో చల్లటి నీరు తాగడాన్ని నివారించండి. హేర్బల్ టీ మరియు సూపులు వంటి వేడి వేడి పానీయాలను తాగడానికి ఇష్టపడండి. ఇది మీ శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు మరియు రోగనిరోధక వ్యవస్థను పెంచడానికి సహాయపడుతుంది. మీ మాన్ సూన్ డైట్ లో అధికంగా డైరీ ప్రొడక్ట్స్ కు ప్రాధాన్యత కల్పించండి. వర్షాకాలంలో వచ్చే జబ్బులకు కారణం అయ్యే సూక్ష్మక్రిములతో పోరడటానికి ఈ డైరీప్రొడక్ట్స్ బాగా సహాయపడుతాయి. ఒక గ్లాసు వేడి పాలు ఆరోగ్యకరమే కాదు, మంచి పోషకాహారం కూడా..

వర్షాకాలంలో అనారోగ్యపాలు కాకుండా ఇటువంటివి మరికొన్ని హెల్త్ టిప్స్. వాటిని పాటించి ఆరోగ్యంగా వర్షాకాలన్ని ఎంజాయ్ చేయండి...

సూపులు మరియు టీ:

సూపులు మరియు టీ:

వర్షాకాలంలో, మసాలా టీ మరియు కాఫీ వంటి పానీయాలు తాగడానికి చాలా ఇష్టపడుతాం. వీటితో పాటు ఒక కప్పు వేడి వేడి సూప్ తాగవచ్చు. ఇది శరీరాన్ని వేడిగా ఉంచుతుంది. సూపులలో గార్లిక్ చేర్చడం వల్ల రోగనిరోధకత పెరుగుతుంది.

తేలికగా జీర్ణం అయ్యే ఆహారాలు:

తేలికగా జీర్ణం అయ్యే ఆహారాలు:

ఫైబర్ మిరయు న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉండి ఆహారాలు వర్షాకాలంలో ఎక్కువగా తీసుకోవడం చాలా అవసరం. వాతావరణంలో మార్పుల వల్ల జీర్ణ సమస్యలు కూడా తోడవుతాయి, కాబట్టి వర్షాకాలంలో కూడా తేలికగా జీర్ణం అయ్యే ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఓట్స్, బ్రౌన్ రైస్, పప్పులు మరియు లెగ్యుమ్స్ రెగ్యులర్ డైట్ లో తీసుకోవడం వల్ల శరీరానికి సరిపడా శక్తినందిస్తుంది మరియు జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.

స్ట్రీట్ ఫుడ్ ను నివారించండి:

స్ట్రీట్ ఫుడ్ ను నివారించండి:

వర్షాకాలంలో పకోడా మరియు చాట్స్ వంటి స్ట్రీట్ ఫుడ్ కు చాలా ఆకర్షితులవుతుంటారు. అయితే, వర్షాకాలంలో ఇంటి చుట్టూ లేదా రోడ్ల మీద చెత్తా చెదారం మరియు వర్షపు నీరు వల్ల దోమలు, ఈగలు ఎక్కువగా వ్యాపించి మలేరియా మరియు డేంగ్యు వంటి జబ్బులు త్వరగా ప్రభలుతాయి. కాబట్టి, వర్షాకాలంలో పరిశుభ్రమైన ఆహారాలకు మాత్రమే ప్రాధాన్యతను ఇవ్వండి.

నీరు ఎక్కువగా త్రాగండి:

నీరు ఎక్కువగా త్రాగండి:

వేసవి కాలంలో, ఎక్కువ నీరు చమట రూపంలో బయటకు రావడం వల్ల మనం ఎక్కువ దప్పికను పొందుతాం. కానీ, వర్షాకాలంలో మీరు దప్పికను పొందరు. దాంతో నీరు తాగాలనే కోరిక కలగదు. నీరు ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల శరీరానికి తగినంత తేమ అందదు మరియు శరీరంలోని వ్యర్థాలు తొలిగిపోవు. కాబట్టి సీజన్ ఏదైనా ప్రతి రోజూ తగినంత నీరు తాగడం చాలా అవసరం.

వ్యక్తిగత పరిశుభ్రత:

వ్యక్తిగత పరిశుభ్రత:

వర్షాకాలంలో చర్మానికి అంటువ్యాధులు(ఫంగల్ ఇన్ఫెక్షన్స్) వస్తుంది. కాబట్టి తడిగా ఉన్నపాదాలను, కాళ్ళను శుభ్రంగా కడగడం వల్ల ఇన్ఫెక్షన్ ను నివారించవచ్చు. అలాగే బూట్లు వేయకూడదు మరియూ మీరు ధరించే దుస్తులు రెగ్యులర్ గా శుభ్రం చేసుకోవాలి.

చర్మం మరియు కేశాలు:

చర్మం మరియు కేశాలు:

వర్షాకాలంలో చర్మం మరియు కేశాల మీద కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తేమ కారణంగా, మీ చర్మం జిడ్డుగా తయారువుతుంది. కాబట్టి, మీ ముఖాన్ని సాద్యమైనన్ని సార్లు కడగడం మంచిది. వర్షపు నీరు కేశాలకు కూడా హానికలిగించవచ్చు. కాబట్టి వర్షంలో తడిసి రాగానే షాంపు, యాంటీబ్యాక్టీరియల్ సోపు ఉపయోగించడం వల్ల వర్షాకాలంలో స్కిన్ ఇన్ఫెక్షన్ ను నిరోధించవచ్చు.

నో ఆయిల్ ఫుడ్స్:

నో ఆయిల్ ఫుడ్స్:

వర్షాకాలంలో మరో ముఖ్యమైన హెల్త్ కేర్ టిప్, ఆయిల్ ఫుడ్ ను తినకుండా ఉండటమే. ఆయిల్ ఫుడ్ జీర్షం అవ్వడం కష్టం మరియు శరీర బరువు కూడా పెంచేస్తుంది.

కారంను తగ్గించాలి:

కారంను తగ్గించాలి:

కారం మరియు మసాలా వంటలు శరీరపు ఉష్ణోగ్రతను పెంచుతుంది మరియు ఇది మొటిమలకు దారితీస్తుంది.

 వెచ్చని నీటితో స్నానం:

వెచ్చని నీటితో స్నానం:

వర్షాకాలంలో స్నానానికి గోరువచ్చని నీరు ఉపయోగించండి. ఇది సీజనల్ ఫీవర్, జలుబు, దగ్గు నుండి రక్షణ కల్పిస్తుంది. ముఖ్యంగా గోరువెచ్చని నీటితో స్నానం చేసుకోవడం వల్ల కొంత విశ్రాంతి పొందవచ్చు మరియు చర్మంలో దాగి ఉన్న బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.

పెరుగు:

పెరుగు:

వెచ్చిని గట్టి పెరుగును మాన్ సూన్ డైట్ గా తీసుకుంటారు. పెరుగులో హెల్తీ బ్యాక్టీరియా ఉండి వివిధ రకాల ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది మరియు రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

Story first published: Saturday, June 15, 2013, 17:39 [IST]
Desktop Bottom Promotion