Latest Updates
-
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే!
జ్ఞాపక శక్తి లోపించడానికి కారణాలు తీసుకోవల్సిన జాగ్రత్తలు..!
జ్ఞాపకశక్తి అనేది మన నిత్య జీవితంలో ప్రతి పనికి అవసరం. ఇది లోపిస్తే ప్రతి పనికి అంతరాయం. ఏదెైనా విషయం గుర్తుంచుకున్నప్పుడు వెంటనే గుర్తుకు రాకపోవడాన్ని జ్ఞాపకశక్తి లోపంగా వ్యవహరిస్తారు. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు జరిగే సంఘటనలు మెదడులోని న్యూరాన్లలో నిక్షిప్తమై ఉంటాయి. అవసరమైనప్పుడు ఆ విషయాన్ని బయటకు వెంటనే తేవడమే జ్ఞాపకశక్తి

జ్ఞాపక శక్తి లోపించడానికి కారణాలు:
1. సరెైన పోషక ఆహారం తీసుకోకపోవడం.
2. మెదడులో కణుతులు ఏర్పడటం వల్ల మెదడుకు సోకే ఇన్‌ఫెక్షన్స్ వలన
3. థయామిన్ లోపం వలన
4. మెదడుకు ఆక్సీజన్, గ్లూకోజ్ సరిగా అందని పరిస్థితుల్లో
5. తలకు బలమైన గాయాలు తగలడం వలన
6. కొన్ని రకాల మత్తు పదార్థాలను అధికంగా వాడటం వలన (ఆల్కహాలు వంటివి)
7. థెైరాయిడ్ లోపం
8. మానసిక ఒత్తిడికి అధికంగా గురికావడం
జ్ఞాపక శక్తి లోపించిన లక్షణాలు ఎలా ఉంటాయి :
1. సరెైన సమయంలో చదివింది గుర్తుకు రాకపోవడం.
2. వస్తువులు ఎక్కడ పెట్టామో గుర్తుకు రాకపోవడం.
3. కొందరు కొన్ని విషయాలు ఒకటి రెండు రోజులు తర్వాతనే మరచిపోవడం.
4. కొంతమంది గృహిణులు బజారుకు వెళ్ళిన తర్వాత ఇంటికి తాళం వేసామో, లేదో, గ్యాస్ ఆఫ్ చేసామో లేదో అని ఆందోళన పడటం వంటి లక్షణాలు ఉంటాయి.
ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు తమకు జ్ఞాపకశక్తి లోపించిదేమో అని ఆందోళన చెందడం సహజం. అలా కాకుండా చేసే పని మీద దృష్టి సారించి ఏకాగ్రతతో చేయుట భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం వలన మానసికి ఒత్తిడి లేకుండా జీవనాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తే ‘జ్ఞాపకశక్తి' మెరుగుపడుతుంది.
మన మేధస్సు పెరగాలన్నా. మన జ్ఞాపక శక్తి పెరగాలన్నా మనం తీసు కోవాల్సిన ఆహారపదారాధలు ఏమిటి? ఏ ఏ ఆహార పదార్ధాలు తీసుకుంటే మన మెదడు చురుకుగా ఉంటుంది. ఈ విషయం మీద అనేక పరిశోధ నలు చేసి మెధస్సు పెరగాల న్నా, మన మెదుడు చురుకుగా పనిచే యాలన్నా ఏ ఆహారం తీసుకోవాలో వెల్లడిస్తున్నారు పరిశోధకులు.
విటమిన్ ‘సి': మన మెదడులోని నాడీ కణాలు ఆరోగ్యంగా ఉండటంలో విటమిన్ ‘సి' తోడ్పడుతుంది. ఇది ఒక యాంటిఆక్సిడెంట్. నిమ్మ, నారింజ, బత్తాయి. క్యాబేజి, బంగాళ దుంపలలో ఇది లభ్యం అవుతుంది.
విటమిన్ ‘ఇ':ఇది ఎక్కువగా లభించే ఆహారం తీసుకుంటే ఆర్జీమర్స్ వంటి వ్యాధులు దరిచేరవు. మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ అనేవి వాటి ఇష్టానుసారం తిరుగుతూ ఉంటాయి. వీటి కారణంగా దెబ్బతిన్న మెదడు కణాలను సరిదిద్ద డంతో విటమిన్ ‘ఇ' కీలక పాత్ర పోషి స్తుంది. విటమిన్ ‘ఇ' తక్కువైతే జ్ఞాపక శక్తి తగ్గుతుంది. మామిడి, పొద్దు తిరుగుడు గింజలు, కాలిఫ్లవర్, వేరుశనగ పప్పులో విటమిన్ ‘ఇ' సమృద్ధిగా లభి స్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
