Latest Updates
-
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి!
ఎక్కువగా త్రేన్పులు వస్తుంటే? ఈ చిట్కాలు అనుసరించండి
కొందరికి కడుపునిండా తిండి, కంటినిండా నిద్ర ఉంటే అంతకన్నా మించిన సుఖం వద్దంటారు. ఏది ఏమయినా ఆహారం, నిద్రా అందరికీ అవసరమే! ఆహారాన్ని అదనంగా తీసుకొనేవాళ్ళను ''భోజన ప్రియులు'' అంటారు. వీళ్ళు తిన్నంత తిని, చివరికి ''బ్రేవ్'' మంటారు. ఎక్కువగా ఆహారం తిన్నవారు ‘బ్రేవ్'మనడానికి మనం సహజంగా గమనిస్తుంటాం. ఈ సమస్య ఉన్నప్పుడు మీరు చాలా అసౌకర్యంగా భావిస్తారు. మరియు రెస్ట్ లెస్ గా ఫీలవుతారు. ఇలా తరచూ వచ్చే త్రేన్పులను కూడా స్టాప్ చేయడం ఎలా అని ఆశ్చర్య పడుతుంటారు. అందుకోసం కొన్ని ఇంటి చిట్కాలున్నాయి. ఇంతకీ ‘బ్రేవ్'అంటే ఏమిటి అని ఆలోచిస్తున్నారా?
ఇలా ''బ్రేవ్'' అనటాన్నే మనం ''త్రేన్పు'' అంటున్నాం!ఇంగ్లీషులో బర్పింగ్(Burping)అంటాము. అసలు త్రేన్పు అనేది భోజన ప్రియులకు మాత్రమే రాదు, అందరికీ వస్తుంది. ...కాకపోతే కాస్త ఎక్కువ తిన్న వాళ్ళకు ''బ్రేవ్'' మనే శబ్దం ఎక్కువగా రావొచ్చు. ఆహారం తీసుకున్న తరువాత ప్రతి వారూ త్రేన్చుతారు... ఒక్కోసారి అజీర్తి చేస్తుందనుకోండి. అప్పుడు కడుపులో నుండి అదే పనిగా పుల్లటి త్రేన్పులు వస్తూ ఉంటాయి.
త్రేన్పు అనేది లోపల ఉత్పత్తి అయిన గాలి, ఆహార నాళం కలసి చేసే ఒక గమ్మత్తు. మనం ఆహారం తీసుకుంటూ ఉంటాం. అప్పుడు నోరు తెరుస్తాం. అలా తెరచినప్పుడు బయటి గాలి నోటి ద్వారా కడుపులోకి (ఉదరం) జేరుకుంటుంది. మన లోపల ఛాతీకి, ఉదరానికి మధ్య తలుపు లాంటిది ఉంటుంది. మనం తీసుకున్న ఆహారం లోపలికి వస్తుంది. కదా; ఆ వెంటనే తలుపు మూసుకుంటుంది. ఇలా మూసుకోవటం వల్ల కడుపులోని జీర్ణరసాలు పైకిరావు.
ఇకను ఉదరంలో కొంత గాలి కూడా చేరుకుంటుందన్న మాట....అంతేకాక, మనం తిన్న ఆహారం జీర్ణమవుతున్నపుడు మరికొంత వాయువు ఉత్పత్తి అవుతుంది. వెంటనే ''ఏమి చేయాలి?'' అని మెదడుకు సంకేతం వెళుతుంది. వెంటనే కడుపులో ఉన్న కండరాలు బిగుస్తాయి. దానితో తలుపు తెరచుకుంటుంది.
కడుపులో ఏర్పడిన వాయువు బయటకు బయలుదేరుతుంది. అలా ఆహారనాళం నుండి బయటకు వస్తూ కొన్ని ప్రకంపనలను కలిగిస్తుంది. దానితో ధ్వని వెలువడుతుంది....ఆ ధ్వనినే ''త్రేన్పు'' అంటున్నాం!
ఇలా విడవకున్నా త్రేన్పు వస్తూనే ఉంటే మీలో అసౌకర్యంగా అనిపిస్తుంది. మరి ఈ త్రేన్పులకు నివారణ లేదా అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పవచ్చు. కొన్ని బెస్ట్ హోం రెమడీస్ త్రేన్పులను ఆపు చేయడానికి లేదా తగ్గించడానికి సహాయపడుతాయి. మరి ఆ చిట్కాలేంటో ఒక సారి చూద్దాం..

1. నీళ్ళు:
ఒక ఉత్తమ సహజ చికిత్స, మీరు తరచూ త్రేన్పుతున్నట్లైతే, కోల్డ్ వాటర్ ను తాగడం వల్ల ఈ బాధాకరమైన అనుభావన్ని తగ్గిస్తుంది.

2.సోడా:
కొన్ని సందర్భాలు ఎసిడిక్ సంబంధించిన పానీయాలు త్రాగడం వల్ల మీ కడుపులోని గ్యాస్ ను నివారిస్తుంది. కాబట్టి ఒక గ్లాస్ సోడాతో ఈ సమస్యను నివారించండి.

3. పుదీనా:
తరచూ ఇబ్బంది పెట్టే త్రేన్పులకు ఒక బెస్ట్ హోం రెమడీ పుదీనా టీ. మీకు ఈ సమస్య ఉన్నప్పుడు ఒక కప్పు పుదీనా టీ త్రాగాలని గుర్తించుకోండి.

4. బ్లాక్ టీ:
తరచూ ఇబ్బంది పెట్టే త్రేన్పుకు బ్లాక్ టి ఒక చక్కటి నివారణి. గోరువెచ్చని బ్లాక్ టీ ఒక కప్పు తీసుకోవడం వల్ల సమస్యను అరికట్టవచ్చు.

5. సోంపు:
ఎక్కువ భోజనం తిన్నప్పుడు త్రేన్పులు సహజం, అందుకే తిన్న వెంటనే కొన్ని సోంపు గింజలు నోట్లో వేసుకొని నమలడం వల్ల సమస్య కొంత వరకూ తగ్గుతుంది.

6. చమోమైల్ టీ(ఛామంతి టీ):
తరచూ త్రేన్పులకు గురియైనప్పుడు ఇది ఒక బెస్ట్ టీ. ఎప్పుడైనా కానీ చమోమెలీ టీ త్రాగడం వల్ల మీకు ఉత్తమ ఉపశనం కలిగిస్తుంది.

7. సెలెరీ:
నిరంతరం త్రేన్పులనకు గురిచేస్తుంటే పచ్చిసెలరీ ఒక బెస్ట్ నేచురల్ హోం రెమడీ . తాజాగా ఉండే సెలరీను కొద్దిగా నోట్లో వేసుకొని నమలడం వల్ల త్వరగా సమస్య నివారించబడుతుంది.

8. యాలకులతో తయారుచేసిన టీ:
వేడిగా ఉండే టీ అదీ యాలకుల టీ త్రాడం వల్ల స్థిరంగా ఉన్న త్రేన్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. భోజనం చేసిన తర్వాత ఒక చిన్న కప్పు యాలకుల టీ త్రాగండి.

9. అల్లం టీ:
తురిమిన అల్లం లేదా అల్లం టీ ఒక ఉత్తమ సురక్షితమైన మరియు బెస్ట్ నేచురల్ పద్దతి. ఇది తరచూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి త్రేన్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

10. చల్లటి పాలు:
చల్లటి పాలు ఈ సమస్యను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది . కాబట్టి తరచూ త్రేన్పులు ఇబ్బంది పెడుతంటే ఒక గ్లాసు చల్లటి పాలను త్రాగండి. సమస్య నుండి బయటపడండి.

11. లవంగాలు:
మరో నేచురల్ మరియు ఉత్తమ హోం రెమడీ లవంగాలు. ఎక్కువగా భోజనం తిన్నప్పుడు ఒకటి రెండు లవంగాలు నోట్లో వేసుకొని నమలడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

12. సిట్రస్ పండ్లు:
ఒక ఉత్తమ సిట్రస్ పండ్లు అంటే ఆరెంజ్ లేదా స్వీట్ లైమ్. ఈ రెండు పండ్లు కూడా సులభంగా కడుపు నుండి గాలి నోటి ద్వారా వెళ్ళటానికి అనుమతించడానికి సహాయపడుతుంది.

13. గోధుమ బ్రెడ్:
ఈ సమస్య ఉన్నప్పుడు గోధుమలతో తయారుచేసి బ్రెడ్ చాలా ఉపశమనం కలిగిస్తుంది. మీలో త్రేన్పులు రావడం మొదలవగానే ఇక చిన్న స్లైస్ వీట్ బ్రెడ్ తినడం గుర్తించుకోండి .

14. నిమ్మరసం:
నిమ్మరసం మరో నేచురల్ హోం రెమడీ. మీలో స్థిరంగా త్రేన్పులు వస్తుంటే నిమ్మరసం త్రాగడం వల్ల కొంత ఉపశమనం కలిగిస్తుంది. పంచదార వేయకుండా త్రాగే నిమ్మరసం మరింత మేలు చేస్తుంది.

15. పెరుగు:
ఒక చిన్న కప్పులో తాజా పెరుగును తీసుకొని తినడం వల్ల సమస్య నివ్రుత్తి అవుతుంది. నిధానంగా పెరుగు తినడం మొదలు పెట్టండి మార్పు మీకే తెలుస్తుంది.



Click it and Unblock the Notifications











