Latest Updates
-
బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. ఇంట్లో ఉన్న వాటితోనే క్రిస్పీ పొటాటో రింగ్స్..ఎలా చేసుకోవాలంటే.. -
కొవ్వు తక్కువ, పోషకాలు ఎక్కువ..థైరాయిడ్ పేషెంట్లకు మఖానా ఎందుకు బెస్ట్? -
అసలైన అంబూర్ చికెన్ బిర్యానీ సీక్రెట్ ఇదే.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి! -
రియల్ లైఫ్ బిచ్చగాడు.. వేల కోట్ల ఆస్తి వదిలి ముంబై వీధుల్లో అడుక్కుంటూ..! -
పితృ పక్షాలకు ముందు అరుదైన కలయిక..ఈ 4 రాశుల దశ, దిశ మారనుంది! -
కోల్కతా ఫేమస్ టాంగ్రా డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది! -
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.!
శ్లేష్మం లేదా కఫాన్ని వదిలించుకోవడానికి కొన్ని సహజమైన చిట్కాలు
గొంతు శ్లేష్మం లేదా కఫాన్ని వదిలించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మీరు బహుశా మీ గొంతు స్లేష్మంతో కలతపెడుతూ ఉంటే, దానివల్ల శ్వాస పీల్చడం చాలా కష్టంగా ఉంటుంది. గొంతులో శ్లేష్మం లేదా కఫం వల్ల అసౌకర్యంగా ఉండవచ్చు, దుర్గంధానికి కారణం ఔతుంది లేదా ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి.
సిగరెట్ త్రాగడం వల్ల కూడా శ్లేష్మం నిర్మాణం పెరుగుతుందని తెలుసుకుని మీరు నిర్ఘంతపోతారు. కానీ ఇక్కడ దగ్గు కఫాన్ని వదిలించుకోవడానికి కొన్ని చిట్కాలు ఇవ్వబడ్డాయి.

1. ఒక టబ్బు వేడి నీళ్ళ నుండి ఆవిరిని పీల్చండి లేదా వేడి నీళ్ళతో స్నానంచేస్తే పేరుకుపోయిన సైన్స్, గొంతులోని కఫం తగ్గుతాయి.
2. ప్రతిరోజూ కనీస౦ ఎనిమిది గ్లాసుల నీళ్ళు తాగడం వల్ల శ్లేష్మం, కఫం తగ్గుతాయి - ఇది మీ మొత్తం ఆరోగ్యానికి మంచిది.
3. మీ గొంతులోని నీటిని బైటికి తీయడానికి, కఫం తొలగించడానికి తరచుగా ముక్కును చీదండి.
4. తరచుగా ఉప్పు కలిపిన వేడి నీతితో పుక్కిలించి ఉమ్మేయండి.
5. కొన్నిచుక్కల యూకలిప్టస్ ఆయిల్ ని వపోరైజర్ లో వేసి పీలిస్తే కఫం నుండి కొంతవరకు ఉపశమనం పొందవచ్చు.
6. డైరీ ఉత్పత్తులు, మాంసం లేదా వేపుడు వంటి కఫాన్ని వృద్ది చేసే పదార్ధాలను తినడం మానేయండి.
7. ముక్కురంధ్రాలు తేమగా ఉండడానికి, శ్లేష్మం తగ్గడానికి హెర్బల్ టీ లేదా ఉడకబెట్టిన చికెన్ పులుసు వంటి వేడి ద్రవాలను త్రాగండి.
8. అర గ్లాసు పాలలో ఒక టీస్పూన్ పసుపు కలపండి - పసుపు క్రిమిసంహారాలను కలిగిఉంటుంది కాబట్టి వ్యాధిపై పోరాడుతుంది.
9. నిమ్మ, తేనెని వాడండి. ఒక కప్పు వేడి నీళ్ళలో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ తేనె కలపండి. ఈ మిశ్రమం మీ గొంతును శుభ్రపరుస్తుంది, నిమ్మరసం కఫాన్ని వదిలిస్తుంది, తేనె గొంతును సరిచేస్తుంది.
10. ఇంటిని శుభ్రంచేయడం, రంగుల వాసన, రసాయనాలు లేదా సిగరెట్ త్రాగడం వంటి ఉత్ప్రేరకాల నుండి దూరంగా ఉండండి.
11. కొన్నిచుక్కల యూకలిప్టస్ ఆయిల్ ని వపోరైజర్ లో వేసి పీలిస్తే కఫం, శ్లేష్మం నుండి కొంతవరకు ఉపశమనం పొందవచ్చు.
12. ధూమపానాన్ని ఆపండి, ఇది శ్వాసను ఇబ్బంది పెడుతుంది, గొంతును చికాకుపెడుతుంది.
13. మసాలా పదార్ధాలు, ముల్లంగి లేదా వేడి కారం మిరియాలు శ్లేష్మాన్ని తగ్గిస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
