Latest Updates
-
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా..
శరీరానికి ఇన్‌ఫ్లమేషన్(హాని) కలిగించే ఆహారాలు...!
ఏదైనా దెబ్బతగిలినప్పుడు అక్కడ ఎర్రగా మారి, వాపు వచ్చి మండుతూ నొప్పిగా అనిపించడాన్ని ఇంగ్లిష్‌లో ఇన్‌ఫ్లమేషన్ అంటారు. కొన్నిసార్లు గాయాల కారణంగా ఇన్‌ఫ్లమేషన్ వస్తే మరికొన్నిసార్లు ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఇన్‌ఫ్లమేషన్ రావచ్చు. ఆర్థరైటిస్ వంటి సందర్భాల్లోనూ ఇన్‌ఫ్లమేషన్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో గుండెకు సంబంధించిన కార్డియోవాస్క్యులార్ జబ్బుల్లోనూ ఇన్‌ఫ్లమేషన్ కనిపించవచ్చు.
ఇలాంటి సందర్భాల్లో ఉపశమనం కోసం యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందులు ఇస్తారు. కొన్ని నొప్పి నివారణ మందులను దీర్ఘకాలం వాడితే వ్యాధినిరోధకశక్తి తగ్గడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవచ్చు. అయితే దీనికి బదులు పరిమితంగా మందులు వాడుతూ ఆహారంతో ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడమూ సాధ్యనంటున్నారు ఆహార నిపుణులు. వీటివల్ల రోగనిరోధకశక్తిని పెంపొందించుకోవచ్చు, శరీరానికి అవసరమైన విటమిన్లు, లవణాలను సమకూర్చుకోవచ్చు. అయితే శరీరానికి ఇన్ ఫ్లమేషన్ కలిగించకుండా ఉండాలంటే అందుకు కారణం అయ్యే ఆహారాలకు దూరంగా ఉండాలి. మరి అవేంటో చూడండి.మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

చక్కెరలు: చక్కెరతో తయారుచేసిన అన్ని పదార్థాలూ ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచుతాయి.

వంటనూనెలు: కుసుమ, సోయా, పొద్దుతిరుగుడు, కార్న్ నూనెలతో పాటు, పత్తినూనె సహా అన్ని రకాల వంటనూనెలూ (ఆలివ్ నూనె మినహా) ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచుతాయి.

ట్రాన్స్‌ఫ్యాట్స్ (కొవ్వులు): కొలెస్ట్రాల్‌ను పెంపొందించే అన్ని కొవ్వులు, వేపుళ్లు, ఫాస్ట్‌ఫుడ్స్, బేకరీ ఐటమ్స్, దీర్ఘకాలికంగా నిల్వ ఉంచడానికి మార్జరిన్ వంటి నూనెను ఉపయోగించిన ఆహారాలు ఇన్‌ఫ్లమేషన్‌ను అధికం చేస్తాయి.

పాలలోని అలర్జీకి కారణమయ్యే అంశాలు: పాలలోని అలర్జీ కలిగించే పదార్థాలు చాలా సందర్భాల్లో ఒంటిపై ర్యాష్ వచ్చేలా చేయడం ద్వారా ఇన్‌ఫ్లమేషన్ కలిగించవచ్చు. (అయితే అలర్జీ కారణంగా అవి సరిపడనివారికి మినహా మిగతా వారందరికీ పాలు మంచి ఆహారం).

కొన్ని రకాల ఆహారంపై పెంచిన జంతు మాంసం: కొన్నిచోట్ల ఆహారంగా ఉపయోగపడే జంతువులను సోయా, కార్న్ వంటి ఎక్కువ ఇన్‌ఫ్లమేషన్‌కు కారణమయ్యే ఆహారంపై పెంచుతారు. ఇక కొన్ని జంతువులు త్వరగా లావెక్కి, వేగంగా కొవ్వు పట్టడానికి హార్మోన్ ఇంజెక్షన్లు చేస్తారు. ఇలాంటి జంతువుల మాంసం ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచుతుంది.

రెడ్‌మీట్, ప్రాసెస్‌డ్ మీట్: కొవ్వు ఎక్కువగా ఉండే గొడ్డు మాంసంలో ఎన్‌ఈయూ5జీసీ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరంలోకి చేరగానే ఇన్‌ఫ్లమేటరీ గుణాన్ని పెంపొందిస్తుంది. అందుకే ఏదైనా ఇన్‌ఫ్లమేషన్ ఉన్నప్పుడు రెడ్‌మీట్‌ను పరిమితంగా తీసుకోవాలి లేదా దానికి బదులు ఆ సమయంలో కోడిమాంసం, చేపలు తీసుకోవాలి.

ఆల్కహాల్ : ఆల్కహాల్ శరీరంలోని చాలా భాగాల్లో ఉండే ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచుతుంది. శరీరంలో లోపల ఉండే భాగాల్లో ఇన్‌ఫ్లమేషన్ ఉండి, క్రమం తప్పకుండా ఆల్కహాల్ తీసుకుంటుంటే ఆ ఇన్‌ఫ్లమేషన్ క్యాన్సర్‌గా రూపొందే అవకాశమూ ఉంది.

రిఫైన్‌డ్ ధాన్యాలు : ధాన్యంపై ఉండే పొట్టును తొలగించి తీసుకునే ఆహారం ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచుతుంది.

ఆహారానికి కలిపే కృత్రిమ పదార్థాలు : కొన్ని రకాల ఆహారాలకు ఆస్పార్టమే, ఎమ్‌ఎస్‌జీ అనే అడెటివ్స్ కలుపుతారు. ఇవి కలిపిన ఆహారం ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచుతుంది.

మీరు సరిపడని ఆహారం : కొందరిలో కొన్ని ఆహారాలు అలర్జీని కలిగిస్తాయి. ఇలా సరిపడని ఆహారాల వల్ల కూడా ఇన్‌ఫ్లమేషన్ పెరుగుతుంది.
ఇన్‌ఫ్లమేషన్‌ను కలిగించే ఆహారాన్ని పూర్తిగా తీసుకోకుండా నివారించడం సాధ్యం కానప్పుడు చాలా పరిమితంగా తీసుకోవాలి. ఇన్‌ఫ్లమేషన్‌కు వ్యతిరేకంగా పనిచేసే యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.



Click it and Unblock the Notifications
