Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి!
స్త్రీలలో లైంగిక వాంచ తగ్గడానికి-మోనోపాజ్ కు సంబందమేంటి..?
స్త్రీ జీవితంలో ఓ వయసు తర్వాత నెల నెలా వచ్చే వారి బుతుక్రమం ఆగిపోవడం అనేది ఓ సాధారణమైన శారీరక మార్పు. దీనినే వైద్య పరిభాషలో మోనోపాజ్ అంటారు. అయితే ఈ దశలోకి ప్రవేశించిన తర్వాత చాలామంది ఆడవాళ్లు తమ జీవితంలో ఇక ఆనందానికి పుల్‌స్టాప్ పెట్టెయ్యాల్సిందే అన్నట్టుగా మారిపోతుంటారు.
స్త్రీలలో మోనోపాజ్ వల్ల వచ్చే సమస్యలు అందరిలో ఒకేలాగా ఉండకపోవచ్చు. ఓ యాభై శాతం మంది మహిళల్లో మోనోపాజ్ సైతం ఎలాంటి ఇబ్బందుల్ని ఏర్పరచదు. అయితే మిగిలిన వారిలో మాత్రం మోనోపాజ్ దశలోకి ప్రవేశించగానే వివిధ రకాల మానసిక, శారీరక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
మెనోపాజ్ లక్షణాలు అనేక విధాలుగా కనపడతాయి.దీనిలో ఎక్కువగా గుర్తించదగిన లక్షణం రుతుస్రావం కొద్దికొద్దిగా అవుతూ ఆగిపోతుంది. ఏదిఏమైన, ఇది మొదలైన నాటినుండి చాలా లక్షణాలు మరియు గుర్తులు కనపడుతూ మెనోపాజ్ దగ్గరలోనే ఉన్నదని తెలుస్తుంది. అవి ఏమిటంటే ఇక్కడ వివరిస్తున్నాము.

వేడి ఆవిర్లు-ఇది చాలా సాధారణ లక్షణం, ఈ వేడి ఆవిర్లు రుతుక్రమం ఆగిపోవటానికి ఒక సంకేతం. ఈ వేడి ఆవిర్లు హఠాత్తుగా రక్తం ముఖంలోకి లేదా ఛాతీ వేగవంతంగా వోచ్చినట్లుగా ఉంటుంది. ఇది చూపులకు ఎరుపుగా మరియు చెమటగా ఉండి, ముట్టుకుంటే చాలా వేడిగా అనుభూతి చెందుతాం.

రాత్రిపూట చెమటలు-ఇవి సాధారణంగా వేడి ఆవిర్లతోపాటు వెళుతుంటాయి, కాని తుఫానులాగా అవుతున్నా హఠాత్తుగా మీరు అర్థ రాత్రుళ్ళు చాలా చలిగా అనుభూతి చెందుతారు. ఈ రకమైన జిగట భావన అసౌకర్యంగా ఉంటుంది కాని ఈ లక్షణం రుతుక్రమం ఆగిపోవటానికి సంకేతం.

మనఃస్థితిలో మార్పులు- మానసిక మార్పులు తరచుగా PMS తో పాటు ఉంటాయి, ఇవి మెనోపాజ్ తో సంబంధం కలిగి ఉంటాయి. మీరు ఈ సమయంలో చిరాకు, అమితసంతోషం లేదా మానసికంగా క్రుంగిపోవటం వంటి అనుభూతులను పొందుతారు. మీ మానసిక స్థితి ఏదైనప్పటికీ, ఈ మెనోపాజ్ సమయంలో స్పెక్ట్రం యొక్క ఒక చివరి నుండి మరొక చివరికి కదలుతున్నట్లుగా, ఈ అనుభూతులు ఉంటాయి.

అలసట-దీనికి గల కారణాలు అనేకం ఉండవొచ్చు, కాని ఇది కూడా మెనోపాజ్ లక్షణమే. అలసట అనేది సాధారణంగా బలహీనంగా ఉండటంవలన గాని, కావలిసినంత నిద్ర లేకపోవటం వలన గాని మరియు రోజువారి పనులను చేసుకోలేక వొచ్చే అనుభూతి కూడా కావొచ్చు.

ఆత్రుత-మానసిక మార్పులతో పాటు, ఆందోళన కూడా మెనోపాజ్ కు ఒక కారణం కావచ్చు. మీరు సులభంగా చేయగలిగే పనులకు కూడా ఆందోళన చెందుతుంటారు లేదా మునుపటి ఆందోళన ఎక్కువగా అనుభవిస్తుంటారు. మీ ఆందోళన ఎక్కువై మీరు పనులేమి చేసుకోలేకపోతే ఇంకొకరి సహాయం తీసుకోవటం మంచిది.

లైంగిక వాంఛ లేకపోవడం-హార్మోన్ స్థాయిలు పడిపోయినప్పుడు కామాతురత తగ్గుతుంది. సెక్స్ యొక్క ఆలోచనలు తక్కువగా ఉంటాయి.

వక్షోజాలు తాకితే నొప్పిపుట్టడం - రొమ్ముల సున్నితత్వ లక్షణం కూడా PMS తో సంబంధం ఉండవచ్చు, అలానే ఇది కూడా మెనోపాజ్ లక్షణమే. మీ శరీరంలో మార్పులు ఎలా చెందుతాయో మరియు హార్మోనల్ హెచ్చుతగ్గులు ఉండటంవలన, వీటి ఫలితంగా రొమ్ముల సున్నితత్వ లక్షణం కోల్పోయి చాలా నొప్పి మొదలవుతుంది.

తలనొప్పులు - హార్మోనల్ హెచ్చుతగ్గులు ఈ తలనొప్పులకు కారణమై ఉండవొచ్చు, అందువలన మెనోపాజ్ దశలో మీరు తలనొప్పితో కూడా బాధపడతారు. మీరు ఇంతకుముందే తలనొప్పులతో బాధపడుతున్నట్లైతే, అవి మెనోపాజ్ దశలో ఎక్కువ అవవొచ్చు లేదా మార్పు రావొచ్చు.

పొడి యోని- యోని గోడలు సహజంగా కందెన వేసినట్లుగా ఉండి, లైంగిక ప్రేరేపణలో ఎక్కువగా ఉంటుంది. కాని మెనోపాజ్ దశలో ఎండిపోయినట్లుగా ఉంటుంది. హార్మోన్ స్థాయిల మార్పులు మరియు ఈస్ట్రొజెన్ పరిమాణం శరీరంలో తగ్గటం, యోని పొడిగా అవటం వంటి లక్షణాలు అసౌకర్యంగా ఉంటుంది.

బరువు పెరగడం- బరువులో మార్పులకు కూడా హార్మోన్ ఒడిదుడుకులే కారణం . ఇలా శరీరంలో అనేక రకాల మార్పుల వలన, అతి దుర్వాసన కూడా ఏర్పడుతుంది. బరువు పెరగటం మెనోపాజ్ కు సంకేతం. దీనివలన మీ జీవప్రక్రియ నెమ్మదిగా పని చేస్తుంది-ఇది మెనోపాజ్ యొక్క ముఖ్య లక్షణం.

జుట్టు సాంద్రత తగ్గటం లేదా జుట్టు రాలిపోవటం-జుట్టు కుదుళ్ళకు ఈస్ట్రోజెన్ అవసరం ఎంతైనా ఉన్నది.

నిద్రలేమి లేదా ఇన్సొమ్నియా-వేడి ఆవిర్లు, రాత్రి చెమటలు మరియు హార్మోన్ స్థాయిలు నిద్రలేమికి కారణాలు.

కీళ్ళ నొప్పి-శరీరంలో హార్మోన్ స్థాయిల మారుపులు దీనికి కారణం.

వేగవంతంగా గుండె కొట్టుకోవటం-సాధారణంగా పెరిమెనోపాజ్ సమయంలో ఉంటుంది.

నిర్ధారణలోపం మరియు మతిమరపుతనం- ఇవి నిద్రలేమి మరియు ఈస్ట్రొజెన్ లోపం వలన ఏర్పడతాయి.



Click it and Unblock the Notifications











