Latest Updates
-
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక!
ప్రిహైపర్ టెన్షన్ గురించి మీకు తెలుసా...?
మీ ఆరోగ్య౦ స్థాయిని గుర్తించడానికి వైద్యుడు ఉపయోగించే ముఖ్యమైన సంకేతాలలో రక్తపోటు ఒకటి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం రక్తపోటు స్థాయిని ఐదుగా విభజించి నిర్వచించారు. ప్రి హైపర్ టెన్షన్ వాటిలో ఒకటి. మీకు అధిక రక్తపోటు ఉంటె, కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, వాటిలో కొన్ని తీవ్రమైనవి కావచ్చు.
ముఖ్యాంశాలు
మీ గుండె ధమనుల ద్వారా రక్తం సరఫరా చేసేటప్పుడు వాటి గోడల మీద పడే ఒత్తిడి కి కొలత మీ రక్తపోటు. రక్తం ఎంత ఎక్కువ శక్తిని ఉపయోగిస్తే, అంత ఎక్కువ రక్తపోటు ఉంటుంది. రక్తపోటు స్థాయిని చదివేటపుడు రెండు అంకెలు ఒకదాని మీద ఒకటి రాసి ఉంటాయి. గుండె కొట్టుకున్నపుడు ధమనుల గోడల మీద పడే ఒత్తిడిని సిస్టాలిక్ ప్రెషర్ అంటారు. అది పైన రాస్తారు. గుండె కొట్టుకున్నపుడు, ఆగినపుడు ఉండే ఒత్తిడిని డయాస్టాలిక్ ప్రెషర్ అంటారు.
రక్తపోటు స్థాయిలలో రకాలు
సాధారణం, ప్రీ-హైపర్ టెన్షన్, ఒకటో దశ హైపర్ టెన్షన్, రెండో దశ హైపర్ టెన్షన్, తీవ్రమైన హైపర్ టెన్షన్. అధిక రక్తపోటుకి హైపర్ టెన్షన్ అనేది వైద్యపరమైన పేరు.
ప్రీ-హైపర్ టెన్షన్ సాధారణం కన్నా కొద్దిగా ఎక్కువ ఉండి, కానీ అధిక రక్తపోటు లేదా హైపర్ టెన్షన్ శ్రేణి లోకి రాని రక్తపోటు స్థాయిలను సూచిస్తుంది. అంటే మీ రక్తపోటు 120/80 - 139/89 మధ్య ఉంటె మీకు ప్రీ- హైపర్ టెన్షన్ ఉన్నట్టు. అధిక రక్తపోటులో మొదటి దశ స్థాయి 140/90 నుంచి 159/99 వరకు ఉంటుంది, రెండో దశ 160/100 పైన ఉంటుంది. 180/110 కన్నా రక్తపోటు ఎక్కువ ఉంటె మీరు తీవ్ర రక్తపోటు కి గురైనట్టు, మీకు వెంటనే వైద్య చికిత్స అత్యవసరం.

ప్రాముఖ్యం
మీకు ప్రీ-హైపర్ టెన్షన్ ఉంటె, అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంది - తద్వారా గుండెపోటు, గుండె జబ్బు, గుండె ఆగిపోయే లాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావచ్చు. జీవన శైలిలో కొద్దిపాటి మార్పులు చేసుకోవడం వల్ల మీ రక్తపోటును హైపర్ టెన్షన్ దాకా వెళ్ళకుండా నివారించుకోవచ్చు. సమతుల ఆహరం తీసుకోవడం, నిత్యం వ్యాయామం చేయడం, మీరు అధిక బరువు ఉంటె బరువు తగ్గడం, పొగ తాగడం మానివేయడం, మద్యం మోతాదులో తాగడం, ఒత్తిడిని ఎదుర్కోవడం లాంటివన్నీ చేయాలనీ సూచించబడుతోంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
