స్త్రీల ఆరోగ్య సమస్యలు అధిగమించే ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్స్

ఓమేగా ఫ్యాటీ యాసిడ్స్ హెచ్ డిఎస్ స్థాయిని పెంచడానికి మరియు మంచి కొలెస్ట్రాల్ అంధించడానికి మరియు గుండె ఆరోగ్యానికి మంచిదని సార్వత్రికంగా ఆమోదించబడిన వాస్తవం. ఓమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ బరువు నియంత్రించడానికి, చర్మం ముడతలు లేకుండా ఉంచేందుకు మరియు క్యాన్సర్ నిరోధించడానికి సహాయపడుతుంది. కాబట్టి ఈ ప్రత్యేకమైన పోషకాంశం(ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్)లో ఆరోగ్యానికి ఉపయోగపడే అనేక ప్రయోజనాలున్నాయి. అయితే ఈ ఫ్యాటీ యాసిడ్స్ మహిళలకు ప్రత్యేక ప్రాముఖ్యత కలవని మీరు గ్రహించకపోయివుండవచ్చు.

మహిళల్లో ఏర్పడే వివిధ రకాలైన ఆరోగ్యసమస్యల నివారణకు, అత్యధిక పోషకాంశాలు కలిగిన ఓమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల స్త్రీ ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు. ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ లోపించండం వల్ల స్త్రీలు కొన్ని ప్రత్యేకమైన, ఎవ్వరికీ చెప్పుకోలేని నిర్దిష్ట ఆరోగ్యసమస్యలకు గురికావాల్సి వస్తుంది. ఉదాహరణకు రుతుక్రమంలో తిమ్మెరలు. కాబట్టి మహిళలు మంచి కొలెస్ట్రాల్ కలిగిన ఆహారాలు తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలను నివారించుకోవచ్చు.

రొమ్ముక్యాన్సర్ లాంటి తీవ్రమైన మరియు ప్రాణహాని కలిగించే వ్యాధులను నివారించడం కోసం ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ తగుమోతాదులో తీసుకొంటుండాలి. అంతే కాకుండా రుతుక్రమం ఆగిన లేదా పూర్తిగా నిలిచిపోయిన మహిళల్లో కలిగే పలు సమస్యలను అధిగమించడానికి మంచి కొలెస్ట్రాల్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.

కాబట్టి, ఒమేగా 3ఫ్యాటీఆసిడ్స్ అధికంగా ఉండే ఆహారాలు మహిళలు తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రత్యేకంగా మహిళల కోసం మంచి కొలెస్ట్రాల్ కలిగిన ఆహారాలను తీసుకోవడం వల్ల గొప్ప ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి.

మహిళల బరువు తగ్గించే ఫ్యాటీ యాసిడ్స్...!

రుతుక్రమంలో తిమ్మెర్లు: మహిళల్లో ఒమేగా 3 ఫ్యాటీఆసిడ్స్ తక్కువగా ఉండటం వల్లే, రుతుక్రమంలో తీవ్రమైన రుతు తిమ్మిరిలు కలిగి ఉన్నట్లు కనుగొనబడింది.

మహిళల బరువు తగ్గించే ఫ్యాటీ యాసిడ్స్...!

బ్రెస్ట్ క్యాన్సర్ నివారణ: మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఒక ప్రాణాంతక వ్యాధి. ఒహియో స్టేట్ యూనివర్శిటీ అధ్యయనం ప్రకారం ఒమేగా 3ఫ్యాటీయాసిడ్స్ అధికంగా ఉండే చేపల్లో బ్రెస్ట్ క్యాన్సర్ నివారణాల లక్షణాలు అధికంగా ఉన్నట్లు నిరూపించబడింది. అందుకు మహిళలు చేపలను తమ రోజువారి డైయట్ లిస్ట్ లో చేర్చుకోవాలి.

మహిళల బరువు తగ్గించే ఫ్యాటీ యాసిడ్స్...!

పాలీసిస్టిక్ ఓవరీ: ప్రస్తుత కాలంలో చాలా మంది స్త్రీలలో ఈ సమస్య ఉంది. అండాశయంలో పాలీసెస్టిక్ ఓవేరీ ఉండటం వల్ల రుతుక్రమంలో హెచ్చుతగ్గులు ఏర్పడుతాయి. ఒక్కోక్కోసారి వంధ్యత్వాని(పిల్లలు పుట్టకపోవడాని)కి కూడా కారణం అవుతుంది. మంచి కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల హానికరమైన కొవ్వులను పీరియడ్స్ లో హెచ్చుతగ్గులను నివారించడానికి సహాయపడుతుంది.

మహిళల బరువు తగ్గించే ఫ్యాటీ యాసిడ్స్...!

సంతాన ప్రాప్తి లేకుండుట: ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గర్భశయం యొక్క గర్భాశయ పొర మీద రక్తం గడ్డకట్టడాన్ని తగ్గిస్తుంది. గర్భాశయ గోడలు (యూట్రస్ వాల్స్)సులభంగా మరియు బలంగా ఏర్పడటానికి సహాయపడుతుంది.

మహిళల బరువు తగ్గించే ఫ్యాటీ యాసిడ్స్...!

మీ బేబీ బ్రెయిన్: మంచి కొవ్వులు గర్భణీ స్త్రీలకు చాలా అవసరం. ఎందుకంటే గర్భంలో ఉండే పిండం యొక్క మెదడు కణాల అభివృద్ధికి బాగా సహాయపడుతుంది.

మహిళల బరువు తగ్గించే ఫ్యాటీ యాసిడ్స్...!

అపరిణత జననాలు(నెలతక్కువ పుట్టుకను) నివారిస్తుంది: అపరిణత పుట్టుకకు కారణం ఒత్తిడి, పోషకాహార లోపం లేదా హార్మోన్ల అసమతుల్యత వంటివి. కాబట్టి గర్భిణీ స్త్రీలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సప్లిమెంట్స్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఈ సమస్యలను 50శాతం తగ్గించవచ్చు.

మహిళల బరువు తగ్గించే ఫ్యాటీ యాసిడ్స్...!

బోలు ఎముకల వ్యాధిని నివారిస్తుంది: సాధారణంగా బోలు ఎముకల వ్యాధికి కాల్షియం లోపం అనుకుంటాం. అయితే మంచి కొవ్వులు తీసుకోవడం వల్ల మీ పెళుసు బారిన ఎముకలు త్వరగా నయం చేసేందుకు సహాయం చేయవచ్చు.

మహిళల బరువు తగ్గించే ఫ్యాటీ యాసిడ్స్...!

వేడి ఆవిర్లు తగ్గిస్తుంది: ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లో నరాల మీద ఓదార్పు ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అందుకే రుతుక్రం ఆగిన తర్వాత కూడా శరీరంలో ఏర్పడే వేడి ఆవిర్లు తగ్గించడానికి సహాయం చేస్తుంది.

మహిళల బరువు తగ్గించే ఫ్యాటీ యాసిడ్స్...!

జ్ఞాపకశక్తిని పెంచుతుంది: సాధారణంగా, హార్మోనుల అసమతుల్యత వల్ల మహిళల మోనోపాజ్ దశలోనూ మరియు గర్బాధారణ దశలో జ్ఞాపకశక్తి మీద ప్రభావితం చూపెడుతుంది. కాబట్టి ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ తీసుకోవడం వల్ల మెదడు కణాలను ఉత్తేజపరచి, జ్ఞాపకశక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

మహిళల బరువు తగ్గించే ఫ్యాటీ యాసిడ్స్...!

మానసిక కల్లోలం: ఈ మానసిక కల్లోలం రుతుక్రమంలోనూ మరియు మోనోపాజ్ దశలోను అధికంగా ఉంటాయి. కాబట్టి ఒమేగా 3ఫ్యాటీయాసిడ్స్ తీసుకోవడం వల్ల మెదడులో సానుకూల ఆలోచనలు ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది.

మహిళల బరువు తగ్గించే ఫ్యాటీ యాసిడ్స్...!

పోస్ట్ మెనోపాజ్ హార్ట్ హెల్త్: మహిళల్లో మోనోపాజ్ తర్వాత ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు(గుండె రక్షిస్తుంది) తగ్గిపోవడం వల్ల గుండెసంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. అందువల్ల గుండె ఆరోగ్యంగా ఉండేందుకు మంచి కొలెస్ట్రాల్ తీసుకోవడం వల్ల ప్రమాదం నుంచి వారిని దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది.

Story first published: Tuesday, February 5, 2013, 17:32 [IST]
Desktop Bottom Promotion