Latest Updates
-
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.!
ఆరెంజ్,నిమ్మఎక్కువగా తింటున్నారా?సైడ్ ఎఫెక్ట్స్ చూడండి
సాధారణంగా చాలా వరకూ డాక్టర్లు మరియు ఆహార నిపుణులు, స్పెషలిస్టులు ‘విటమిన్ సి' అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోమని సలహాలిస్తుంటారు. వారి అభిప్రాయం ప్రకారం, ఈ ఆహారాలను మన శరీరాన్నిఆరోగ్యంగా ఉంచుతాయని వారు అభిప్రాయపడుతున్నారు. మానవ శరీరాలకు అత్యంత అవసరమైన ఒక పోషకాహారం ఈ ‘విటమిన్ సి' మన శరీరం విటమిన్ సి 8 అనుబంద విటమిన్స్ గా మార్పు చెంది మన శరీర ఆరోగ్యానికి సహాయపడుతుందని అంటారు.
విటమిన్ సిలో ఆస్కోర్బిక్ యాసిడ్ కలిగి ఉంటుందని, ఇది ఫుడ్ యాడిటివ్ గా తీసుకోవడం వల్ల యాక్సిడేషన్ ను నివారిస్తుందని చెబుతారు. ఈ విటమిన్ సి తాజాగా ఉండే ఆరెంజ్, మరియు నిమ్మ వంటి వాటిలో అత్యధికంగా ఉన్న విషయం తెలిసిందే. నిజానికి విటమిన్ సి దంత ఆరోగ్యానికి కూడా చాలా ఆరోగ్యకరమైనది.
వివిధ రకాల కారణాల చేత విటమిన్ సి మన శరీర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కానీ, విటమిన్ సి అధికమైన కొన్ని దుష్ప్రభాలు కూడా కలుగుతాయి. విటమిన్ సి అధికంగా తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి...

లోయర్ బ్యాక్ సమస్యలు:
విటమిన్ సి అధికంగా తీసుకోవడం వల్ల మీ వెన్నుఎముక క్రింది భాగంలో మరియ వెన్నెముకకు ఇరువైలా కొంచెం నొప్పిగా అనిపిస్తుంటుంది. ఇది ప్రారంభంలో చాలా తక్కువగా నొప్పి కలిగించినా, ముందు ముందు ఎక్కువ నొప్పి, బాధకు గురిచేస్తుంది. విటమిన్ సి అధికమైతే ఎదురయ్యే దుష్ప్రభావాలల్లో ఇది ఒకటి.

యూరిన్ మరియు రక్తం:
విటమిన్ సి అధికమైతే మరో ముఖ్యమైన దుష్ప్రభావం మూత్రంలో రక్తం కనబడుతుంది. ఇది యూరిన్ పాస్ అయ్యేప్పుడు కడుపులో ఒక విధమైన నొప్పి కలిగి ఉంటుంది. చాలా కేసుల్లో నొప్పి ఉండదు.

యూరినరీ ట్రాక్ లో నొప్పి:
మూత్రం విసర్జించే సమయంలో కొంచెం అసౌకర్యానికి మరియు నొప్పికి గురి అవుతారు. విటమిన్ సి అధికంగా తీసుకోవడం వల్ల ఎదురయ్యే సమస్యల్లో ఇది కూడా ఒకటి. దీని వల్ల రెగ్యులర్ గా కూడా నొప్పి కలిగి ఉంటుంది. ఇది మరింత తీవ్రం కాకముందే డాక్టర్ ను సంప్రధించడం చాలా అవసరం.

డయేరియా:
చాలా కేసుల్లో విటమిన్ సి అధికంగా తీసుకోవడం వల్ల చాలా మందిలో ఎదురయ్యే ఒక మేజర్ సమస్య డయేరియా. అధికమోతాదులో విటమిన్ సి తీసుకోవడం వల్ల ఈ సమస్య ఎదురవుతుంది.

మైకం:
విటమిన్ సి ఎక్కువగా వికారం, వాంతులు, మైకం నివారించడానికి ఉపయోగిస్తుంటారు, కానీ, విటమిన్ సి అధికంగా తీసుకోవడం వల్ల ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్ళాల్సి వస్తుంది. అయితే ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటే, డాక్టర్ ను తప్పక కలవాలి.

పొట్ట సంబంధిత సమస్యలు:
విటమిన్ సి అధికంగా తీసుకోవడం వల్ల స్టొమక్ క్రాంప్ ఒక బేసిక్ సైడ్ ఎఫెక్ట్. మీరు తరచూ స్టొమక్ క్రాంప్స్ తో బాధపడుతున్నట్లైతే మీకు పొట్ట సంబంధిత సమస్యలేమైనా ఉన్నాయి లేదా చెక్ చేయించుకోవాలి.

వికారం మరియు వాంతులు:
తరచూ వికారం, వాంతి వచ్చేఅనుభూతిని మీరు పొందుతున్నారా?తరచూ మీరు వాంతి వచ్చేట్లు మీలో ఫీలింగ్ ఉంటే, మీరు విటమిన్ సి తీసుకోవడం లో సైడ్ ఎఫెక్ట్ దాగి ఉందని గుర్తించాలి.

తరచూ తలనొప్పి:
నిరంతరం తలనొప్పికి గురి అవ్వడం. కొంత మంది వాతావరణంలో మార్పుల వల్ల తలనొప్పి అని చెబుతుంటారు. మరియు మరికొన్ని సందర్భాల్లో అధిక ఒత్తిడి వల్ల కూడా తలనొప్పికి గురవుతన్నట్లు చెబుతుంటారు. అయితే మీ శరీరంలో విటమిన్ సి ఎక్కువ అవ్వడం వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్ ను మీరు ఎదుర్కొంటుండవచ్చు అని మీరు ఎప్పుడైనా గమనించారా?

ఫ్లషింగ్ :
వేడి ఆవిర్లు, చర్మం మీద ఎరుపు మచ్చలను మీరెప్పుడైనా గమనించారా? చర్మం కింద భాగంలో జలదరింపు గురవుతారా లేదా?మీకు ఏకారణంచేతనో తెలియకుండానే చర్మం ఎర్రబడటం వంటి సమస్యలను ఎదుర్కొంటుంటే విటమిన్ సి ప్రభావం ఉంటుంది.

గుండెలో మంట:
తరచూ పొట్టలో లేదా గుండెలో బర్నింగ్ సెన్షేషన్ కలుగుతుంటే విటమిన్ సి అధికంగా తీసుకోవడం వల్ల ఇది ఒక మేజర్ సైడ్ ఎఫెక్ట్ గా గుర్తించాలి. ఇది ఇలాగే కంటిన్యూ అయితే, డాక్టర్ ను తప్పనిసరిగా కలవాలి.



Click it and Unblock the Notifications
