Latest Updates
-
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.!
అలసట-నిద్రవస్తున్నట్లు అనిపిస్తే మేల్కోవడానికి 10సింపుల్ టిప్స్
మీరు రాత్రంతా సరైన నిద్ర పోనపుడు లేదా తెల్లవార్లూ పార్టీలో ఉన్నపుడు మీకు నిద్ర వచ్చేట్లు, అలసిపోయిన భావన కలిగినపుడు మేల్కొని ఉండడానికి మీరు కొన్ని చిట్కాలను తెలుసుకోవడం అవసరం. మీ శరీరం నిద్రను కోరుకున్నపుడు, దానిని అదుపులో ఉంచడానికి ప్రయత్నించడం మంచిది కాదు. అయితే, కొన్నిసార్లు ముఖ్యమైన పనులను సాధించడానికి మేల్కొని ఉండడం చాలా అవసరం. మీకు బాగా నిద్ర వస్తుంది, అలసిపోయాను అనే భావన కలిగినపుడు ఎలా మేల్కొని ఉండాలో 10 చిట్కాల జాబితాను పరిశీలించండి. అవి మీకు సహాయపడతాయని ఆశిస్తున్నాము.

సహజ సూర్యకాంతి
సహజ సూర్యకాంతి త్వరగా, ప్రభావ వంత౦గా మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఇది విటమిన్ D ని ఉత్పత్తి చేసి, కాలానుగునంగా వచ్చే మానసిక మార్పులను రక్షించడానికి సహాయపడుతుంది. సహజ సూర్యకాంతి మీరు బాగా నిద్ర వస్తుంది అనిపించినప్పుడు మేల్కొని ఉండడానికి కూడా సహాయపడుతుంది. కేవలం మీ కర్టెన్లను తెరచి సూర్యకాంతిని లోపలి ప్రవేశింప చేయండి.

ఎక్కువ నీరు త్రాగండి
మీకు వడదెబ్బ తగిలితే, ఎక్కువగా అలసిపోయినట్లు భావిస్తారు. ప్రతిరోజూ తగినంత నీరు త్రాగడం చాలా అవసరం, మీకు నిద్ర వచ్చినపుడు, అలసిపొయాను అనుకున్నపుడు మేల్కొని ఉండడానికి కొద్దిగా ఎక్కువ నీరు త్రాగండి. వేసవి సమయంలో చురుకుగా ఉండడానికి కొద్దిపాటి చల్లటి నీరు తీసుకోవడం మంచిది, ఇది మీరు బాగా అలసి పోయినపుడు ఎక్కువసేపు చురుకుగా ఉండేట్టు చేస్తుంది.

సరైన ఆహరం తినండి
మీకు నిద్రవస్తుంది అనుకున్నపుడు, మీరు మీ ఆహరం పై శ్రద్ధ పెట్టడం అవసరం. అల్పాహారాన్ని మానవద్దు, మీ మధ్యాహ్న భోజనంలో కొవ్వు పదార్ధాలు లేకుండా చోసుకోండి. రోజంతా ప్రోటీన్లు ఎక్కువగా ఉండే సమతుల్య ఆహరం తినడానికి ప్రయత్నించండి, కాఫీ, శక్తి నిచ్చే పానీయాలను మానేయండి.

నడవండి
కూర్చోవడం అనేది మీరు మేల్కొని ఉండడానికి సహాయపడదు. మీకు బాగా నిద్ర ఒస్తుందని అనుకున్నపుడు, మీరు సాధించాల్సిన పనులు ఎన్ని ఉన్న నడవండి. మీరు నిద్ర వస్తుంది, అలసి పోయాను అనే భావన కలిగి ఉన్నపుడు ఇది నిజంగా ఖచ్చితమైన మార్గం. మీరు పనిలో ఉన్నపుడు, ఎక్కువ దూరం వెళ్ళలేరు, ఏదైనా పానీయం తీసుకోండి లేదా మీ తోటి ఉద్యోగి బల్ల దగ్గరకు నడవండి.

దీర్ఘ శ్వాసలు తీసుకోండి
మేల్కొని ఉండడానికి దీర్ఘ శ్వాస చిట్కా కూడా బాగా ఉపయోగపడుతుంది. ముక్కునుండి శ్వాస తీసుకోవడం, వదలడం ప్రారంభించండి, మీ డయాఫ్రం ద్వారా మీ పొట్టను ముందుకు నేట్టండి. ఎలా చేయడానికి ప్రయత్నిస్తే ఎంతో అలర్ట్ గా ఉన్న భావన కలుగుతుంది. దీనిని మీరు మీ భోజన విరామంలో చేయండి.

అప్ బీట్ మ్యూజిక్ వినండి
అప్ బీట్ మ్యూజిక్ వినేటపుడు మీరు మీ పాదాన్ని కొట్టడం జరుగుతుంది ఇది మిమ్మల్ని ఆ సమయంలో అలర్ట్ గా ఉన్న భావన కలిగిస్తుంది. మీకు నిద్ర తెప్పించే సాంప్రదాయ సంగీతం వంటి ప్రసాంతమైన సంగీతం వినడం మానేయండి. నేను తరచుగా ఈ మార్గాన్ని అనుసరిస్తాను, ఇది నిజంగా పనిచేస్తుందని నేను చెప్తాను.
మ్యూజిక్ థెరపీ వల్ల 7 అద్భుతమైన ప్రయోజనాలను - కూడా చదవండి

ప్రతి 30 నిమిషాలకు ఒకసారి చురుకుదనాన్ని పొందండి
రోజంతా కంప్యూటర్ లేదా TV ముందు గడిపితే చాలా అలసటగా, నిద్ర వచ్చిన భావన కలుగుతుంది. మేల్కొని ఉండాలంటే, మీ శరీరానికి చురుకుదనం అవసరం. లేవండి, ప్రతి 30 నిమిషాల కొకసారి మీ కాళ్ళను అటుఇటూ వంచండి, ఇలాచేస్తే రోజంతా మీరు ఎక్కువ శ్రద్ధతో ఉన్న భావన కలుగుతుంది.

తాజా గాలి
మీకు నిద్ర వస్తుంది అనుకున్నపుడు, ఒక సారి తాజా గాలి పీల్చితే మీరు జాగ్రత్తగా ఉన్నట్లు భావన కలగడానికి సహాయపడుతుంది. మీరు పనిలో ఉన్నపుడు, కిటికీలు తెరవండి లేదా మీకు ఒక బ్రేక్ లేదా భోజనం సమయంలో బైటికి రండి. మీరు కారులో ఉన్నపుడు, ఎంత కుదిరితే అంత తాజా గాలికోసం కారు తలుపులు తరచుగా తెరవండి.

స్నానం చేయండి
మీరు ఇంట్లోనే పనిచేస్తుంటే, మేల్కొని ఉండడం అవసరం, అందువల్ల స్నానం చేయండి. మీరు పనిలో ఉన్నపుడు, స్నానం చేయలేరు, మేల్కొని ఉండడానికి చల్లని నీటితో ముఖం కడుక్కోండి, చాలా శ్రద్ధగా ఉన్నట్లు భావిస్తారు. ఇది చేయడం చాలా కష్టం, కానీ మీ నిద్ర తగ్గడానికి ఇది ఖచ్చితంగా సహాయపడుతుంది.

ఒక కునుకు తీయండి
బాగా నిద్ర వచ్చినపుడు, అలసిపోయాం అనుకున్నపుడు మేల్కొని ఉండాలంటే ఒక కునుకు తీయడం అనేది ఖచ్చితంగా అందరికీ సహాయపడదు, కానీ ఇది చాలావరకు సహాయపడుతుంది. అది కేవలం 10-15 నిమిషాలే అయినా సరే, కునుకు శక్తి అద్భుతంగా పనిచేస్తుంది. అందువల్ల, కునుకు తరువాత నిద్రపోదామని అనుకుంటారు. కొన్నిసార్లు కునుకు తరువాత నిద్రను పోగొట్టుకోవడానికి 35 నిముషాలు తీసుకుంటారు.
మనం బాగా అలసిపోయినపుడు కాఫీ, శక్తినిచ్చే పానీయాలను తీసుకుంటాం. నిజానికి, అవి అసలు సహాయపడవు, పైగా ఆరోగ్యానికి చాలా ప్రమాదం. ఇక్కడ ఇచ్చిన కొన్ని చిట్కాలను ప్రయత్నించి, మీకు పనిచేశాయో లేదో చూడండి. మీకు నిద్ర వస్తుంది అనుకున్నపుడు మేల్కొని ఉండడానికి మీకు ఇంకేమైనా చిట్కాలు ఉంటే, విమర్శల విభాగంలో వాటిని మాతో పంచుకోవడం మర్చిపోకండి. ఏమీ తెలీని వారికి మీరు సహాయం చేసినవారౌతారు.



Click it and Unblock the Notifications
