Latest Updates
-
ఐరన్, విటమిన్స్ నిండిన మునగాకు గోధుమ దోసె..బరువు తగ్గాలనుకునేటోళ్లకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ -
ఫోన్ పగలగొట్టాడని తండ్రిని దారుణంగా చంపిన కూతురు! -
కాలిఫ్లవర్ తో ఇలా చేస్తే పకోడీ కూడా పనికిరాదు.. టేస్ట్ అదుర్స్! -
నడుము నొప్పితో విసిగిపోయారా? మీ వెన్నెముకను ఉక్కులా మార్చేసే చిట్కా ఇదే! -
కార్తీక మాసం స్పెషల్ ఉసిరికాయ పులిహోర..చాలా కమ్మని రుచిగా చేసుకోండిలా.. -
ఎముకలు బలంగా అవ్వడానికి,బాడీలో రక్తం పట్టాలంటే ఈ స్వీట్ తినండి..చేయడం చాలా సింపుల్.. -
నెయ్యి గురించి చాలామందికి తెలియని నిజం ఇదే.. -
బీహార్ స్పెషల్ దాల్ పూరీ.. శనగపప్పు స్టఫింగ్ తో పర్ఫెక్ట్ రెసిపీ -
జస్ట్ 20 నిమిషాల్లో ది బెస్ట్ సాంబార్ రైస్.. రెస్టారెంట్ ని మించిన రుచితో ఎలా చేసుకోవాలంటే.. -
మలబద్దకంతో బాధపడుతున్నారా? మోషన్ ఫ్రీగా అవ్వాలంటే ఈ ఫుడ్స్ తినండి
ఆర్థరైటిస్ చేతి నొప్పులు తగ్గటానికి 6 మార్గాలు
చేతుల కీళ్ళ నొప్పి సమస్యలను వైద్యపరంగా ఆర్థరైటిస్ అని అంటారు. ఎముకలు ఒక దానితో ఒకటి రుద్దుకోవటం వలన వచ్చే నొప్పికి ఈ పదంను ఉపయోగిస్తారు.
ఆర్థరైటిస్ తేలికపాటి లేదా చాలా తీవ్రముగా ఉంటుంది. సమస్య ఎక్కువ సమయం కొనసాగితే అప్పుడు మీరు ఒక వైద్యుడుని సంప్రదించవలసిన అవసరం ఉంది. చేతుల్లో ఆర్థరైటిస్ తీవ్రమైన నొప్పి తగ్గించడానికి కొన్ని సహజమైన ఇంటి నివారణా చర్యలు ఉన్నాయి.
మేము చేతులు మరియు వేళ్లలో నొప్పిని తగ్గించటానికి కొన్ని పద్దతులను చర్చిస్తున్నాము.

అదనపు బరువు
అదనపు బరువు అనేది కండర అలసట మరియు కీళ్ళనొప్పులకు బాధ్యత వహిస్తుంది. అదనపు బరువు కండరాలకు బారాన్ని పెంచుతుంది. అంతేకాక ఇది నొప్పిని కూడా జోడిస్తుంది. కొన్ని కిలోల బరువు తగ్గితే చేతులు మరియు భుజం కీళ్ళ నుండి ఒత్తిడి తగ్గుతుంది. మీరు బరువు తగ్గించే సమయంలో తొలిమెట్టుగా అధిక వత్తిడి లేదని నిర్ధారించుకోండి. రెగ్యులర్ వ్యాయామం మరియు ఆహారం అనేవి ఒక ఆరోగ్యకరమైన బరువు నష్టం ప్రోగ్రామ్ కోసం సరిపోతాయి.

తక్షణ వ్యాయామాలు
ఆర్థరైటిస్ కారణంగా చేతుల్లో వచ్చే నొప్పి తక్షణ ఉపశమనం కోసం అనేక వ్యాయామాలను ఉపయోగించవచ్చు. సాధారణంగా ఈ వ్యాయామాలు నొప్పి మరియు కండరాల అలసటను తగ్గించటానికి స్ట్రెచింగ్ కదలికలుగా ఉంటాయి. వలయాకార కదలికలు,మణికట్టు స్ట్రెచింగ్,రొటేటింగ్,చేతులు స్ట్రెచింగ్ మరియు మోచేతులు వంచటం వంటివి కొన్ని స్పాట్ వ్యాయామాలు. ఈ తక్షణ వ్యాయామాలు చేయడం సులభం మరియు ఎవరి సహాయం అవసరం లేదు.

నొప్పి ఉపశమనం కొరకు క్రీములు మరియు జెల్స్
చేతుల్లో ఆర్థరైటిస్ వలన వచ్చే నొప్పికి మెంథాల్ ఆధారిత క్రీములు ఒక మంచి ప్రభావం కలిగి ఉంటాయి. ఒక తగిన క్రీమ్ ను ఎంచుకొని మీకు బాధ కలిగినప్పుడు మీ చేతులకు రాయండి. క్రీమ్ దాదాపు వెనువెంటనే పనిచేస్తుంది.ఈ క్రీమ్లు బహిర్గతంగా మాత్రమే ఉపయోగించవచ్చు.క్రీమ్లు మార్కెట్లో లభిస్తాయి. క్రీమ్ లేదా జెల్ ను ఉపయోగిస్తే ఒక మేరకు చేతులు మరియు వేళ్లలో ఆర్థరైటిస్ వల్ల వచ్చే నొప్పి తగ్గిపోతుంది.

మసాజ్
మినరల్ ఆయిల్ మసాజ్ ఆర్థరైటిస్ వల్ల చేతులు మరియు వేళ్లలో వచ్చే నొప్పి చికిత్స కోసం ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఆయిల్ మసాజ్ నొప్పి మరియు వాపు ఉపశమనానికి సహాయపడుతుంది.రెగ్యులర్ మసాజ్ నొప్పి తగ్గించడానికి సహాయపడుతుంది.పామాయిల్,ఆలివ్ నూనె మరియు కొబ్బరి నూనె వంటి ఖనిజ నూనెలు ఈ ప్రయోజనం కోసం ఉపయోగించవచ్చు.వేడి నూనె మసాజ్ కూడా ఆర్థరైటిస్ నొప్పి ఉపశమనం అందించడానికి చాలా మంచిది. ప్రత్యేక సుగంధ మిళితం నూనెలను కీళ్లవాతం నొప్పిని తగ్గించటానికి సహజమైనవి.

అల్లం రసం
అల్లం శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంది. ప్రతి రోజు అల్లం రసం తీసుకుంటే ఆర్థరైటిస్ నొప్పి తగ్గటానికి ఉపయోగపడుతుంది. అల్లం కీళ్ళ నొప్పులు మరియు కండరాల నొప్పులను తగ్గించటానికి ఉపయోగకరంగా ఉంటుంది. అల్లం క్రిమినాశక లక్షణాలను కూడా కలిగి ఉంది. అల్లం రసం చేతులు మరియు వేళ్లు లో నొప్పి నివారణ కోసం ఒక గృహ ఆధారిత పరిహారంగా ఉంది.

ఆవిరి చికిత్స
తక్షణ ఉపశమనం కోసం,ఒక ఆవిరి స్నానం లేదా మీ చేతుల్లో వేడి బ్యాగ్ ను ఉపయోగించండి. ఆవిరి లేదా వేడి నీటి బ్యాగ్ నుండి వచ్చే వెచ్చదనం ఆర్థరైటిస్ నొప్పి నుండి ఉపశమనంను అందిస్తుంది. నొప్పి నుండి ఉపశమనం పొందడానికి సులువైన మరియు ఇంటివద్దనే చేసే నివారణలలో ఒకటి. మీరు ఏ హాని లేకుండా క్రమం తప్పకుండా దీనిని చేయవచ్చు.



Click it and Unblock the Notifications
