Latest Updates
-
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్పీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు! -
ప్రేమంటే రొమాన్స్ మాత్రమేనా.. ఎన్ని రకాలు ఉన్నాయో తెలిస్తే ఇట్టే లవ్లో పడిపోతారు.!
తెల్ల జుట్టును నివారించే 8 సూపర్ ఫుడ్స్
గ్రే హెయిర్ (తెల్ల జుట్టు) వయస్సు పైబడిందని చెప్పడానికి ఒక చిహ్నాం. దీన్ని ఫ్యాషన్ స్టేట్మెంట్ అని కూడా పిలుస్తుంటారు. లేదా వయస్సైన తర్వాత జుట్టు తెల్లబడటం నివారించడం సాద్యం కాదు. అయితే 20సంవత్సరంలోనే జుట్టు తెల్లబడుతుంటే, దిగాలుపడుతుంటారు. చిన్న వయస్సులో జుట్టు తెల్లబడుటను నివారించడంకోసం కొన్ని ఆహారాలు ప్రత్యేకంగా సహాయపడుతాయి.
ఈ ఆహారాలు వల్ల తెల్ల జుట్టు చాలా ఎఫెక్టివ్ గా నివారించబడుతుంది. కాబట్టి, తెల్ల జుట్టు నివారించడం కసం మీరు తప్పనిసరిగా డైట్ ను అనుసరించాల్సి ఉంటుంది. తెల్ల జుట్టును నివారించడం కోసం హెల్తీ లైఫ్ స్టైల్ కూడా అనుసరించాల్సి ఉంటుంది. మరియు ఒత్తిడి తగ్గించుకోవాలి. ఈ బహిర్గత మార్గాలు మాత్రమే కాదు, వీటితో పాటు, అంతర్గతంగా మీ జుట్టుకు న్యూట్రీషియన్స్ తప్పనిసరిగా అవసరం అవుతుంది. మరి మీ తెల్ల జుట్టు సమస్యను నివారించడం కోసం, ఈ హెల్తీ ఫుడ్స్ ను ఖచ్ఛితంగా తినాల్సి ఉంటుంది. ఇవి మీ జుట్టుకు ఒక బేసిక్ న్యూట్రీషియన్ ఫుడ్స్.
ఈ ఆహారాలను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల తెల్లజుట్ట రాకుండా, ఉన్న జుట్టు రంగు మారకుండా నిర్వహించవచ్చు. మంచి ఫలితం పొందడానికి ఈ ఆహారాలను మీ రెగ్యులర్ డైట్ లో సరైన పరిమాణంలో తీసుకోవడమే ఉత్తమం..

ఆకుకూరలు:
ఆకుకూరలు పిగ్మెంట్ ను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. ఇది జుట్టు రంగు మారకుండా సహాయపడుతుంది. అందువల్ల తెల్ల జుట్టు నివారించడం కోసం మీ రెగ్యులర్ డైట్ లో ఆకుకూరలను ఖచ్చితంగా చేర్చుకోవాలి.

బీన్స్:
బీన్స్ మరియు లెగ్యుమ్స్ లో మనం అనుకొన్నవాటికంటే ప్రోటీనులు అధికంగా ఉంటాయి. జుట్టుకు తగినంత పోషణ అందాలంటే, ఈ ప్రోటీన్స్ అధికంగా ఉండే బీన్స్ అండ్ లెగ్యుమ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

గుడ్లు:
జుట్టుకు అత్యంత అవసరం అయ్యే విటమిన్స్ లో ముఖ్యమైనది బి12 గుడ్డలలో పుష్కలంగా ఉంది. ఈ విటమిన్ తక్కువైతే క్రమంగా జుట్టు తెల్లబడుతుంది. విటమిన్ బి12 రక్తప్రసరణను మెరుగుపరిచి, ప్రీరాడికల్స్ నుండి జుట్టును రక్షిస్తుంది , దాంతో జుట్టు తెల్లబడటం నివారించబడుతుంది.

కరివేపాకు:
దక్షిణభారతదేశపు మహిళలకు జుట్టు నల్లగా ఉండటానికి ప్రధాన కారణం కరివేపాకును వంటల్లో చేర్చడం. ఎక్కువ కరివేపాకు తినడం వల్ల , దీర్ఘకాలం పాటు తెల్ల జుట్టు రాకుండా సహాయపడుతుంది.

షెల్ ఫిష్:
సీఫుడ్స్ లో జింక్ అధికంగా ఉండే షెల్ ఫిష్ మీ జుట్టును స్ట్రాంగ్ గా ఉంచడం మాత్రమే కాదు, ఇది జుట్టు నల్లగా పెరగడానికి సహాయపడుతుంది. జింక్ లోపంతో హార్మోనుల్లో అసమతుల్యత ఏర్పడుతుంది, దాంతో జుట్టు తెల్లబడుటకు కారణం అవుతుంది. అందుకే మీ రెగ్యులర్ డైట్ లో షెల్ ఫిస్ ను చేర్చుకోవాలి.

మీట్ లీవర్:
ఐరన్ డిఫిసియన్స్ లేదా అనీమియా వల్ల మీ జుట్టు తెల్లబడుతుంది. అందువల్ల, మీ రెగ్యులర్ డైట్ లో మాంసాహారాల్లో లివర్ మరియు మాంసం తినడం వల్ల మీ శరీరంల ఐరన్ లెవల్స్ ఆరోగ్యంగా ఉంటుంది.

బెర్రీస్:
బెర్రీస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది మీ తలలో రక్తప్రసరణ జరిగేందుకు సహాయపడుతుంది. అంటే తలకు ఎప్పుడూ తాజాగా బ్లడ్ సర్కులేషన్ అయ్యేలా బెర్రీస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. జుట్టు తెల్లబడకుండా ఉండుటకు విటమిన్ సి చాలా అవసరం.

క్యారెట్ :
క్యారెట్స్ లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంది. ఇది చర్మం మరియు జుట్టుకు తప్పనిసరిగా అవసరం అవుతుంది. అందువల్ల క్యారెట్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల జుట్టు తెల్లబడుటను నివారిస్తుంది .



Click it and Unblock the Notifications