Latest Updates
-
రోజూ అవే చపాతీలు, రోటీలు తిని బోర్ కొట్టిందా? మట్కా రోటీ ఇలా చేస్తే పిచ్చెక్కించే టేస్ట్! -
స్వీట్, హాట్ తినాలనే కోరికలు విపరీతంగా ఉన్నాయా.. మీ బాడీలో ఈ లోపాలే కారణం.! -
శని దేవుని అభయహస్తం: జూన్ 2027 వరకు ఈ 3 రాశులకు రాజయోగం.. మీరున్నారా ఇందులో? -
కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలం..రోజకి ఇది 1 తింటే చాలు కొండలను ఢీకొట్టే శక్తి! -
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు!
కంప్యూటర్ ముందు ఎక్కువ సమయం: కంటి సంరక్షణ
కళ్ళు అద్దంలా భావిస్తారు. ఎందుకంటే, భయటప్రపంచాన్ని చూపించగలిగే శక్తి కళ్ళకు మాత్రమే ఉంది. కళ్ళు మనిషి యొక్క అందాన్ని మాత్రమే చూపించడం కాదు, అది మీ ఆరోగ్యాన్ని కూడా తెలుపుతుంది. మన జీవనశైలే మన శరీర ఆరోగ్యం, కళ్ళ ఆరోగ్యాన్ని తెలుపుతుంది. ప్రస్తుత రజుల్లో చాలా మంది కంప్యూటర్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు చిన్న పిల్లల నుండి పెద్ద వరకూ అందరికీ కంప్యూటర్ ఒక నిత్యవసర వస్తువుగా మారింది . అయితే కంప్యూటర్ ముందు పనిచేసే వారు , కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా ఎక్కువ పనిగంటలు కంప్యూటర్ ముందు కూర్చొనే వారు.
కంప్యూటర్ ముందు ఎక్కువగా పనిచేసేవారు, రోజంత పనిచేసిన తర్వాత కళ్ళకు ఎక్కువ స్ట్రెయిన్ కు గురి అవుతాయి. అందుకు వివిధ రకాల కారణాలు ఉన్నాయి. ఒకటి కంప్యూటర్ కు చాలా దగ్గర పనిచేయడం, కంప్యూటర్ లోని అక్షరాలు బ్లర్ గా కనబడటు, అసౌకర్యమైన ఐ లేవల్స్ లేదా ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు అలాగే కూర్చొని ఉండటం వల్ల కళ్ళు స్ట్రెయిన్ కు గురిఅవుతాయి.
కాబట్టి, కళ్ళ ఆరోగ్యం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అందుకు ఇక్కడ కొన్ని సులభమైన ఐకేర్ టిప్స్ ఉన్నాయి. కంప్యూటర్ స్ట్రెయిన్ తగ్గించుకోవడం కోసం కొన్ని సులభ చిట్కాలు క్రింది విధంగా ఉన్నాయి.

విరామం తీసుకోవాలి: కంప్యూటర్ ముందు కూర్చొని కళ్ళు ఆర్పకుండా ఎక్కువ సమయం పనిచేయడం వల్ల కళ్ళు డ్రై అవుతాయి. కాబట్టి, కంప్యూటర్ ముందు పనిచేసేటప్పుడు, మద్యమద్యలో విరామం తీసుకోవాలి.
కళ్ళను సున్నితంగా వత్తుకోవాలి: రెండు చేతులను వామ్ అప్ చేసి కళ్ళమీద పెట్టి సున్నితంగా ఒత్తుకోవడం వల్ల మీరు విశ్రాంతి ఫీలవుతారు. మీ చేతులను కళ్ళ మీద 60 సెకండ్లు పెట్టాలి. ఇది మీ అలసట చెందిన కళ్ళకు విశ్రాంతి పరుస్తుంది. ఇలా రెండు మూడు సార్లు చేస్తుండాలి.
ఐలెవల్ కు కంప్యూటర్ ను అడ్జెస్ట్ చేసుకోవాలి: టెలివిజన్ అయినా, కంప్యూటర్ అయినా కంటిలెవల్ కు స్క్రీన్ ను అడ్జెస్ట్ చేసుకోవాలి . ఇది కంప్యూటర్ ముందు పనిచేసేవారికి ఇది ఒక ముఖ్యమైన ఐకేర్ టిప్.
20-20-20-నియమానని అనుసరించాలి: ఎక్కువ పనిగంటలు కంప్యూటర్ ముందు పనిచేసే వారికి ఈ వ్యాయామం మీ కళ్ళు విశ్రాంతి పొందడానికి సహాయపడుతుంది . ప్రతి 20 నిముషాలకొకసారి మీ కంప్యూటర్ స్ర్కీన్ నుండి దూరంగా చూస్తుండాలి. అలాగే 20ఫీట్ దూరం ఉండాలి. 20 సెంకడ్లు చూడాలి.
కాంట్రాస్ట్ ను పెట్టుకోవాలి: డార్క్ లెటర్స్ ను ఉపయోగించాలి లెటర్స్ బ్యాక్ గ్రౌండ్ లో లైటప్ చేయాలి . కంప్యూటర్ ముందు పనిచేసే వారికి ఇది ఒక ముఖ్యమైన ప్రాక్టికల్ ఐ కేర్ టిప్ .
గ్లార్ నివారించాలి: మీరు కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసేటప్పుడు సరైన వాతావరణంలో పనిచేస్తున్నారా లేదా తెలుసుకోవాలి . మీరు కంప్యూటర్ స్ట్రెయిన్ ను ఎలా నివారించాలని చూస్తున్నప్పుడు, కంప్యూటర్ గ్లార్ విండోకు దగ్గరగా లేదా సీలింగ్ కు దగ్గరగా ఉంచాలి.
బ్రైట్ నెస్ ను తగ్గించాలి: కంప్యూటర్ బ్రైట్ నెస్ లెవల్ ను సౌకర్యవంతంగా అమర్చుకొని తర్వాత పనిచేసుకోవాలి .బ్రైట్ నెస్ ఎక్కువగా ఉండం వల్ల కళ్ళ స్ట్రెయిన్ మరింత పెరుగుతుంది.
గ్రీన్ కలర్: గ్రీన్ కలర్ మీ కళ్ళను రిలాక్స్ గా ఉంచడంలో ఒక ఉత్తమ కలర్. పనిచేసేటప్పుడు మద్యమద్యలో విండో సైడ్ చూడాలి. పనిచేసే చోట గోడలవైపు చూడాలి. లేదా కంప్యూటర్ వాల్స్ వద్ద గ్రీన్ కలర్ వాల్ పేపర్స్ నుపేస్ట్ చేయాలి.
ఫ్రీక్వెంట్ గా కళ్ళను బ్లింక్ చేయాలి. కంప్యూటర్ ముందు పనిచేసేటప్పుడు,అత్యంత ప్రభావవంతమైన చిట్కాఅప్పుడప్పుడు కళ్ళు బ్లింక్ చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల కళ్ళకు మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది . కళ్ళ డ్రైనెస్ ను నివారిస్తుంది.
కంప్యూటర్ గ్లాసులను ఉపయోగించాలి: కంప్యూటర్ ముందు పనిచేసే వారికోసమనే గ్లాస్ ను తయారుచేసుంటారు. వాటిని ఎంపిక చేసుకోవాలి. ఇది కంప్యూటర్ ఐ స్ట్రెయిన్ నివారిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications