Latest Updates
-
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.!
చెవి నొప్పికి త్వరగా ఉపశమనం కలిగించే ఉత్తమ చిట్కాలు
నుంచుంటే నరకం...! కూర్చుంటే నరకం! ఎవరితో మాట్లాడాలన్నా విసుగు! ఏ చిన్న శబ్దం విన్నా చికాకు! చెవిలో బస్సులు, రైళ్ళు పరిగెడుతున్నట్లు, అర్థంకాని పాప్ మ్యూజిక్‌కు లయబద్దంగా ఎవరో డాన్స్ చేస్తున్నట్లు, నాటు బాంబులు పేలుతున్నట్లు... ఏదో తెలియని ప్రళయ ఘోష! వెరసి చూస్తే అది కచ్చితంగా చెవినొప్పి ప్రభావమే! వెలుపలి చెవి, మధ్యచెవి, లోపలి చెవిగా ఉండే చెవి భాగాలలో ఏ భాగం లో చిన్నలోపం ఏర్పడినా వెంటనే మనకు అందే ప్రాథమిక హెచ్చరిక చెవి నొప్పి!
చెవికి వచ్చే వ్యాధులు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది చెవిపోటు. నిజమే! చెవికి సంబంధించి ఏ సమస్య వచ్చినా మనకు తెలిసే మొట్టమొదటి లక్షణం చెవిపోటే! చెవిపోటు అని అనిపించిన వెంటనే మనం చేసే మొదటి పని చెవిలో పుల్లలు పెట్టి తిప్పడం, మరుక్షణమే మనం చెవిలో కొబ్బరినూనె పొయ్యడమో, చెవిలో గోరువెచ్చటి నీరు పోసెయ్యడమో, వెల్లుల్లి రేకలతో కాచిచల్లార్చిన నూనె వెయ్యడమో, తులసి వంటి ఆకు రసాలు వేసెయ్యడమో చేసేస్తుంటాం! చెవిపోటు ఎందువల్ల వచ్చిందో సరిగ్గా తెలుసుకోకుండా అరకొర జ్ఞానంతో చిట్కావైద్యాలు చేసెయ్యడం చాలాసార్లు 'కొంఢ నాలుక్క మందేస్తే ఉన్ననాలుక ఊడింద'న్న సామెతను నిజం చేసే స్తుంది! అందుకే మనం చెవి నొప్పి ఎందుకు వచ్చింది ముందు తెలుసుకోవాలి. నొప్పి ఒక మాదిగా ఉందా లేదా తీవ్రంగా ఉందా, మంటతో కూడిన నొప్పి గుర్తించాలి. నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు తప్పిని సరిగా డాక్టర్ ను సంప్రదించాలి.
చెవినొప్పి సహజంగా వచ్చినట్లైతే కొన్ని హోం రెమెడిసీ ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. డాక్టర్ అందించే సరైన ప్రిస్ర్కిప్షన్స్తో పాటు ఈ హోం రెమెడీస్ కూడా మంచిగా ఫలితాన్ని అందిస్తాయి. అంతే కాకుండా చెవి ఇన్ఫెక్షన్స్ లేదా ఇన్ఫ్లమేషన్ వంటి లక్షణాలు ప్రారంభంలోనే గుర్తించినట్లైతే ఈ హోం రెమెడీస్ ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి..మరి అవేంటో ఒకసారి చూద్దాం....

వెచ్చదనం కలిగించడం(కాపడం):
వేడినీటిలో డిప్ చేసిన టవల్ తో నొప్పి ఉన్న ప్రదేశంలో కాపడం. వార్మ్ కంప్రెసర్ చెవి నొప్పి తగ్గించడానికి సహాయపడుతుంది. వెచ్చదనం వల్ల నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే ఏదైనా వాపు ఉన్న తగ్గుముఖం పడుతుంది. జలుబు వల్ల చెవి నొప్పి ఉంటే కూడా నొప్పి తగ్గిస్తుంది.

ఇంట్లో కొన్న నొప్పి నివారణ మందులు:
చెవినొప్పి అకస్మాత్తుగా వచ్చినప్పుడు, డాక్టర్ వద్దకు వెళ్ళలేని సమయంలో, నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఐ బ్రూఫిన్ టాబ్లెట్స్ ను వేసుకోవచ్చు . అలాగే ఆస్పిరిన్ లేదా అసిటామినోఫిన్ తీసుకోవచ్చు. అయితే, ఇటువంటి మెడిసిన్స్ 18ఏళ్ళలోపున్న పిల్లలకు ఇవ్వకూడదు. 18ఏళ్ళలోపు వారికి ఇటువంటి మెడిసిన్ ఇవ్వడానికి ముందు పీడియాట్రిషన్ ను సంప్రదించాలి.

ఆలివ్ ఆయిల్ :
చెవి నొప్పికి ఆలివ్ ఆయిల్ గ్రేట్ గా సహాయపడుతుంది. కొద్దిగా ఆలివ్ ఆయిల్ ను గోరువెచ్చగా చేయాలి. తర్వాత క్లీన్ గా ఉన్న బాటిల్లో పోసి చెవి నొప్పి ఉన్నప్పుడు గోరువెచ్చగా చెవిలో రెండు మూడు చుక్కలు వదలడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ముక్కును క్లియర్ చేయాలి:
ముక్కు మూసుకుపోవడం దాంతో పాటు చెవినొప్పి ఉన్నట్లైతే , అది జలుబు వల్ల వచ్చిన నొప్పి అని గుర్తించాలి . మొదట ముక్కును క్లియర్ చేసుకుంటే, చెవునొప్పి అదంట అదే తగ్గుతుంది. అందుకు ఆవిరి పట్టడం చేయవచ్చు.

ఉల్లిపాయను ఉపయోగించవచ్చు:
చెవిలో ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు, ఉల్లిపాయను ఉపయోగించవచ్చు. చెవినొప్పితో పాటు, వాపు ఉన్నప్పుడు, ఉల్లిపాయను మెత్తగా పేస్ట్ చేసి, చెవి నొప్పి ఉన్న ప్రదేశంలో బయటవైపుగా దీన్ని అప్లై చేయాలి.

వెల్లుల్లి మరియు ముల్లేయన్ ఫ్లవర్:
మీ వద్ద ఆలివ్ ఆయిల్ లేనప్పుడు ఇలా చేయవచ్చు: వెల్లుల్లి నూనె మరియు ముల్లేనియన్ ఫ్లవర్ ఆయిల్ రెండింటిని మిక్స్ చేయాలి. ఈ రెండింటి కాంబినేషన్ లో మైక్రోబ్స్ ను నివారిస్తుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

ల్యావెండర్ ఆయిల్:
చెవికి బయటవైపున ఇరిటేషన్ గా అనిపిస్తుంటే, ల్యావెండర్ ఆయిల్ ను అప్లై చేయవచ్చు.చెవి నొప్పి ఉన్నప్పుడు ల్యావెండర్ ఆయిల్ ను నొప్పి ఉన్నచోటో అప్లై చేసి సున్నితంగా మర్దన చేయాలి.

విగ్లింగ్:
చెవిని పట్టి లాగడం లేదా ఇటు అటువ చేత్తో కదిలించడం ద్వారా కొంచెం రిలీఫ్ అవుతుంది. పెద్దగా ఆవిలించడం విగ్లింగ్ చేయడం ద్వారా, చెవిరంద్రాల యొక్క ట్యూబ్స్ పెద్దగా తెరచుకుని లోపలికి గాలి చెరి రిలీఫ్ అంధిస్తుంది.

ఆవిరి పట్టడం మరియు యూకలిప్టస్ ఆయిల్:
నాజల్ పాస్ వేలో బ్లాక్ అయిన్ ఫ్లూయిడ్స్ క్లియర్ చేయాలంటే ఆవిరి పద్దతి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అందుకు మరిగే నీటిలో కొద్దిగా యూకలిప్టస్ ఆయిల్ వేసి బాగా మరిగించి తర్వాత ఆవిరి పట్టాలి. ఇది ఒత్తిడిని తగ్గించి శ్వాసనాళాన్ని క్లియర్ చేస్తుంది.

విటమిన్ కె అధికంగా తీసుకోవాలి:
సాధారణంగా చెవినొప్పి జలుబు వల్లే ఎక్కువగా వస్తుంటుంది. కాబట్టి, మీ రెగ్యులర్ డైట్లో జలుబు వ్యాధినిరోధకతను ఎదుర్కొనే విటమిన్ ఎ, సి, ఇ ఆహారాలను తీసుకోవాలి.

గడ్డంతో వ్యాయామం:
చెవి నొప్పి ఉన్నప్పుడు కొన్ని సున్నితమైన, సులభమైన సింపుల్ వ్యాయామాలు చేసినప్పుడు ఇయర్ కెనాల్స్ తెరచుకుంటాయి. అందుకు మీరు గడ్డం వద్ద కదలికలు ఏర్పడేలా చేయాలి. అందుకు నోరు పెద్దగా తెరచి కదిలించాలి. అలాగే నోరూ మూసుకొని, ముందుకు వెనకకు గడ్డం కదిలించాలి.

చెవిలో ఎవంటే అవి పెట్టకుండా నివారించాలి:
చెవి నొప్పి ఉన్నప్పుడు చెవిలో షార్ప్ గా ఉన్నటువంటి ఎటువంటి వస్తువులను వుంచకూడదు. కాటన్ ఇయర్ బడ్స్ ను వేసి తిప్పకూడదు, అందువల్ల చెవిలో మరింత దుమ్ముచేరే అవకాశం ఉంది.



Click it and Unblock the Notifications