Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
తల నొప్పి తగ్గడానికి 10 ఉత్తమ చిట్కాలు
ప్రస్తుత కాలంటో పని ఒత్తిడి, టెన్షన్, నిద్రలేమి, జన్యుపరమైన సమస్యలు ఇలా పలు కారణాలతో తలనొప్పి మనల్ని బాధిస్తుంది. తలనొప్పికి కారణాలేవైనా వాటి నివారణకు సత్వర చికిత్స చేయించుకోవాలి. లేకుంటే కొన్ని రకాల తలనొప్పులు రోగికి ప్రాణాంతకంగా కూడా పరిణమించే ప్రమాదముంది. తలనొప్పికి కారణాలేవైనా కావచ్చు, దాని ఎఫెక్ట్ మాత్రం మామూలుగా ఉండదు. అందుకే మనలో చాలామంది తలనొప్పి లక్షణాలు కనబడగానే తొందరపడి ఇష్టం వచ్చిన టాబ్లెట్ లు వేసుకుంటుంటారు, అవి తాత్కాలింగా ఉపశమనం కలిగించినా ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్ లు కూడా కలిగిస్తాయి. తరచూ తలనొప్పి వస్తుంటే డాక్టర్ ని సంప్రదించడం అన్నిరకాలుగా శ్రేయస్కరం. దానికన్నా ముందు టాబ్లెట్ లకు బదులు తలనొప్పి తగ్గడానికి కొన్ని అనువైన చిట్కాలు.
తల నొప్పి తగ్గడానికి 10 చిట్కాలు:

నీళ్ళు ఎక్కువగా త్రాగాలి:
ఒక్కోసారి విపరీతమైన తలనొప్పికి డీ హైడ్రేషన్ కూడా కారణమవ్వచ్చు. అందుకని ఒక గ్లాసు నిండా చల్లటి నీళ్ళు తాగండి. అంతే తలనొప్పి తగ్గుముఖం పట్టడం మీరు గమనిస్తారు.

రిలాక్స్ అవ్వడం:
తలనొప్పి చిరాకు తెప్పిస్తుందనుకుంటే కాసేపు అన్ని పనులను పక్కన పెట్టేసి రిలాక్స్ అవ్వడం మేలు. దీనివల్ల అలసట తగ్గి తలనొప్పి హుష్కాకి అయిపోతుంది.

డైట్:
ఒక్కోసారి మనం తీసుకునే ఆహారం కూడా మన తలనొప్పికి కారణమవ్వచ్చు. కాబట్టి మీ ఆహార పద్ధతులను మార్చేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది.

కాల్షియం సప్లిమెంట్:
కాల్షియం సప్లిమెంట్ వల్ల రక్తప్రసరణ జరిగి మీ మజిల్స్ రిలాక్స్ అవుతాయి. ఒక గ్లాసు నిండా పాలు లేదా ఆరెంజ్ జ్యూస్ తాగడం లేదా మెగ్నీషియం, కాల్షియం ఉండే సప్లిమెంట్ తీసుకున్నా తలనొప్పి నుండి రిలీఫ్ ని ఇస్తుంది.

ప్రెజర్ పాయింట్స్ ని నొక్కి ఉంచడం:
మన అరచేతిలో ముఖ్యంగా మన చూపుడు వేలుకు, బొటన వేలుకు మధ్య ఉండే ప్రదేశంలో కరెక్టుగా ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి. వాటిని 2, 3 నిమిషాల పాటు నొక్కి ఉంచినట్లయితే తలనొప్పి తగ్గిపోతుంది.

ఎక్సర్ సైజు:
సాధారణ తలనొప్పి ఉన్నవాళ్ళకు ఇది మంచి చిట్కా, అనువైన ఎక్సర్ సైజు ను ఎంచుకుని చేయడం మంచిది. తద్వారా శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడి తలనొప్పి తగ్గే అవకాశాలు ఉన్నాయి.

తల మసాజ్:
మీకు మసాజ్ గురించి తెలిసే ఉంటుంది. రాకరకాల స్ట్రెస్ నుండి రిలీఫ్ పొందాలన్నా, టెన్షన్ నుండి రిలాక్స్ అవ్వాలన్నా మసాజ్ చక్కటి పధ్ధతి. తలనొప్పికి పని ఒత్తిడి కూడా కారణం. కాబట్టి తల , మెడ మసాజ్ చేస్తే తలనొప్పి ఇట్టే తగ్గిపోతుంది.

వేడి నీళ్ళతో తల స్నానం:
తల నొప్పి ఎక్కువగా ఉంటే గోరువెచ్చటి నీటితో తల స్నానం చేసేయండి. తలనొప్పిని చేతితో తీసిపడేసినట్టుగా, రిలాక్స్ గా ఫీలవుతారు.

ఐస్ ప్యాక్:
తలనొప్పి తగ్గడానికి ఐస్ ప్యాక్ కూడా ఉపకరిస్తుంది. ఒక శుభ్రమైన టవల్ లో చల్లగా ఉండే ఏదైనా వస్తువును చుట్టి మీకు ఎక్కడైతే నొప్పిగా ఉందో అక్కడ కాసేపు పెట్టుకుంటే సరి. నొప్పి మాయమవుతుంది.

ఆరోమా థెరపీ:
ఆరోమా థెరపి అన్ని రకాల శ్రేయస్కరం. చందనం, మిరియాలు, యూకలిప్టస్, లావెండర్ మరియు రకరకాల ఔషధాలతో తయారైనది. తలనొప్పి దూరం చేయడానికి ఇది చక్కటి ఔషధంగా పనిచేస్తుంది.



Click it and Unblock the Notifications
