For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఓరల్ త్రష్ కొరకు ఉత్తమ హోం రెమెడీస్

ఓరల్ త్రష్ కొరకు ఉత్తమ హోం రెమెడీస్

By Lekhaka
|

నోటి వ్యాధి,కాండిడా అల్బిచన్స్ అనే ఈస్ట్ ఫంగస్ పెరుగుదల వలన నోటి లోపల వైపు తెలుపు రంగు పాచ్ ఏర్పడుతుంది. ఇది నోటి లోపల ఏ వైపునైనా సంభవించవచ్చు. దీని ఫలితంగా నాలుక మరియు గొంతులో ఎర్ర మచ్చలు ఏర్పడతాయి. ఇది పిల్లల్లో సాధారణంగా వస్తుంది. కానీ పెద్దలలో కూడా వచ్చే అవకాశం ఉంది. పెద్దవారు మితిమీరి యాంటీబయాటిక్స్ తీసుకోవటం వలన మంచి బాక్టీరియా మీద ఎక్కువ ప్రభావం చూపి చనిపోయే అవకాశం ఉంది.

మీకు తరచుగా ఈ సమస్య సంభవిస్తే చాలా కష్టం మరియు మీరు మీ వైద్యుడుని సంప్రదించవలసిన అవసరం ఉంది. ఈ వ్యాధి ఉధృతిని తగ్గించటానికి క్రీమ్స్ రాయవచ్చు. అలాగే క్రింద చెప్పిన ఇంటి నివారణలను పాటించవచ్చు.

homemade-remedies-treat-oral-thrus

నోటి వ్యాధి చికిత్సకు ఇంట్లో పరిష్కారాలు
1. ఆపిల్ సైడర్ వెనిగర్
ఒక కప్పు వేడి నీటిని తీసుకోని దానిలో ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి,దానిని ఒక రోజులో మూడు నుండి నాలుగు సార్లు నోటిలో పోసుకొని పుక్కిలించాలి. ఈ విధంగా చేయుట వలన ఫంగస్ ఏర్పాటు మరియు సమస్య తగ్గుతుంది.

homemade-remedies-treat-oral-thrus

2. బోరిక్ యాసిడ్
నోటి రష్ చికిత్సకు బోరిక్ యాసిడ్ ఉపయోగించటం పెద్దలకు మంచి ఆలోచన. కానీ పిల్లలకు మాత్రం మంచిది కాదు. ఒక కప్పు నీటిలో పావు స్పూన్ బోరిక్ యాసిడ్ తీసుకోని బాగా కలిపి మౌత్ వాష్ గా ఉపయోగించండి. ఈ ద్రావణంను ఒక రోజు లో రెండు మూడు సార్లు పుక్కిలించాలి. మీరు బోరిక్ యాసిడ్ ఉపయోగించినప్పుడు దానిని మ్రింగకుండా శ్రద్ధ వహించాలి. ఒకవేళ మ్రింగితే కడుపు అప్సెట్ వంటి సమస్యలకు దారితీస్తుంది.

homemade-remedies-treat-oral-thrus

3. వెల్లుల్లి
వెల్లుల్లిలో యాంటీ ఫంగల్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉండుట వలన ఫంగస్ మీద పోరాడటానికి సహాయపడుతుంది. ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకోని,వాటిని గుజ్జులా చేసి నేరుగా మ్రింగవచ్చు. లేకపోతె కొన్ని నిమిషాలు సోకిన ప్రాంతంపై పెట్టవచ్చు. వెల్లుల్లి సంక్రమణను తగ్గిస్తుంది.
homemade-remedies-treat-oral-thrus

4. పెరుగు
వాపు తగ్గించే ప్రత్యక్ష అసిడోఫైలస్ కల్చర్ కలిగిన పెరుగును రెండు టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. పెరుగులో కల్చర్ ఉన్న దానిని కొనుగోలు చేయాలనీ గుర్తుంచుకోండి. ఎందుకంటే వేడి సుక్ష్మక్రిమిరహిత పెరుగులో ఈస్ట్ శిలీంధ్రాలు నియంత్రించడానికి అవసరమైన లాక్టోబాసిల్లస్ బాక్టీరియా సరైన మొత్తం లో కలిగి ఉండదు. మీరు ప్రత్యామ్నాయంగా అసిడోఫైలస్ మాత్రలను కూడా తీసుకోవచ్చు. ఇవి బాక్టీరియా మీద పోరాడతాయి. రెండు అసిడోఫైలస్ మాత్రలను తీసుకోని పొడి చేసి,దానిని ఒక టేబుల్ స్పూన్ ఆరెంజ్ జ్యూస్ లో కలిపి తీసుకోవచ్చు.

homemade-remedies-treat-oral-thrus

5. నూనెలు
లావెండర్ నూనె,లవంగం నూనె మరియు టీ ట్రీ ఆయిల్ వంటి కొన్ని నూనెలు నోటి వ్యాధి చికిత్సకు అవసరం అయిన వ్యతిరేక సంక్రమణ లక్షణాలను కలిగి ఉంటాయి. పచారీ దుకాణాల నుంచి లవంగం నూనె మరియు లవెందర్ నూనెను సులభంగా పొందవచ్చు. మీ టూత్ పేస్ట్ లో కొన్ని చుక్కల నూనెను వేసి ఒక సాధారణ పద్ధతిలో బ్రష్ చేయండి. ఒక నిమిషం లేదా రెండు నిముషాలు నోటిలో టూత్ పేస్ట్ మరియు నూనె మిశ్రమం పుక్కిలించి ఉమ్మివేసి,ఆపై సాదా నీటితో శుభ్రం చేయండి.
homemade-remedies-treat-oral-thrus

ప్రత్యామ్నాయంగా మీరు పై నూనెలను ఉపయోగించి నోటిని వాష్ చేయవచ్చు. ఒక కప్పు నీటిలో పైన చెప్పిన ఏ నూనె అయిన కొన్ని చుక్కలు వేసి ద్రావణం తయారుచేయండి. ఈ ద్రావణంను ఒక రోజులో రెండు మూడు సార్లు పుక్కిలించి ఉమ్మివేయండి.

English summary

homemade-remedies-treat-oral-thrus

Oral thrush is a white colored patch formed inside the mouth due to the overgrowth of the yeast fungus named Candida Albicans.
Desktop Bottom Promotion