Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
డిప్రెషన్ సెక్స్ జీవితాన్ని ఎలా నాశనం చేస్తుంది
మీరు ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నప్పుడు సెక్స్ అనేది మీ మనస్సులో మొదటి విషయంగా ఉండకపోవచ్చు. కానీ సుదీర్ఘ కాలం మీ చుట్టూ ఆరోగ్య సమస్యలు ఉంటే,మీ సెక్స్ జీవితం మీద పడే వాటి ప్రభావాల గురించి తెలుసుకోవాలి. కొన్ని దీర్ఘకాల పరిస్థితులు మీ సెక్స్ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి.
మనిషిలో సెక్స్ కోరికలు అడుగంటితే....ఎంతో చికాకుగాను, ఆందోళనగాను వుండి డిప్రెషన్, శారీరక అస్తవ్యస్తలు వంటి కొన్ని సమస్యలు వస్తాయి. మరి భాగస్వామితో కూడా సమస్యలే. కొన్ని జీవన విధానాలను సరిచేసుకోవడం ద్వారా మీరు ఈ సమస్యలను తేలికగా అధిగమించవచ్చు. అసలు మీ కామ వాంఛ ఎందుకు అడుగంటిందనేది ముందు తెలుసుకోండి. కామవాంఛను చంపేసే కొన్ని మానసిక, శారీరక సమస్యలు చూడండి.

1. అంగస్తంభన లేకపోవటం - అంగస్తంభన సరి లేదనుకోవడం అంటే సరైన అవగాహన లేకపోవడమే. నలభై సంవత్సరాల వయసు పైబడిన వారికి సాధారణంగా ఈ సమస్య వస్తుంది. చాలామంది ఇది మానసిక సమస్యగా భావించి పరిష్కరించేదికాదని వదిలేస్తారు. కాని కొన్ని మందులతోను, వైద్య విధానాలతోను ఈ సమస్యను చక్కగా అధిగమించవచ్చు.

2. మెనోపాజ్ - ఇది మహిళలలో వచ్చే శారీరక మార్పుల కారణంగా వారికి కామ వాంఛ వెనుకబడుతుంది. తగ్గిన హార్మోన్లు యోని పొడిబారి రతి సమయంలో నొప్పిని కలిగిస్తాయి. ఈ కారణంగా భావ ప్రాప్తి పొందటానికి కూడా సమయం పడుతుంది. అయినప్పటికి భాగస్వామి సహకారంతో కొంతమేర అధిగమించవచ్చు.

3. డిప్రెషన్ - తరచుగా యాంటీ డిప్రెషన్ మందులు వేయడం కూడా కామవాంఛ తగ్గిస్తుంది. డిప్రెషన్, దానికి వాడే మందులు కూడా వాంఛ తగ్గించటంతో వీరికి వెంటనే వైద్య సలహాలు సరైన మెడిసిన్ అవసరంగా వుంటుంది.

4. నిద్ర లేకుండుట - నిద్రకు కామ వాంఛకు సంబంధం వుందని పరిశోధకులు తెలుపుతారు. మీరు ప్రతిరోనజూ సరిగా నిద్రించక, మీ నిద్రను వారానికోసారిగా అధికంగా పోతున్నట్లయితే కూడా మీలో కామ వాంఛ తగ్గిపోతుంది. దీనికి కారణం ఒత్తిడినిచ్చే హార్మోన్లు శరీరంలో పెరగటం జరుగుతుంది. కనుక ప్రతిరోజూ తగినంత సమయాన్ని నిద్రకు కేటాయించి. అవసరమైన హార్మోన్ల స్ధాయి మెయిన్టెయిన్ చేయండి.

5. పిల్లల సంరక్షణ - పిల్లల సంరక్షణలో మీ శారీరక, మానసిక ఆరోగ్యాలు దిగజారవచ్చు. కాని అది మీ సెక్స్ లైఫ్ కు అడ్డంకి కారాదు. బేబీ సంరక్షణలో పడి మీ వాంఛలను మరచిపోతారు. భాగస్వామిని అశ్రద్ధ చేస్తారు. పిల్లలకు ఒక ఆయాను పెట్టటం లేదా బేబీ నిద్రించే సమయంలో పది నిమిషాల వర్కవుట్లు కానిచ్చేయటం వంటివి చేయాలి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
