Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
తలనొప్పిని చాలా త్వరగా తగ్గించే ఉత్తమ చిట్కాలు
తలనొప్పి అనేది చాలా సాధరణ ఆరోగ్య సమస్య. వయస్సుతో సంబంధం లేకుండా అన్ని ఏజ్ గ్రూప్ ల వారు అప్పుడప్పుడు లేదా ఏదో ఒక సందర్భంలో తలనొప్పిక గురిఅవుతుంటారు. కొన్ని సందర్భాల్లో తలనొప్పి నివారించలేని విధంగా ఉంటుంది. నొప్పి తోపాటు, వికారం, అదే సమయంలో వాంతి వచ్చినట్లు ఉండటం కూడా అనిపిస్తుంది. ఈ ఆరోగ్య సమస్య ఒత్తిడి, టెన్షన్, విశ్రాంతి లేకపోవడం, సైనస్, మైగ్రేన్, నిద్రలేమి మరియు డీహైడ్రేషన్ మరికొన్ని ఇతర కారణాలు కూడా తలనొప్పికి ప్రధాన కారణం అవుతుంది.
మైగ్రేన్ తలనొప్పికి పరిష్కార మార్గాలు..!క్లిక్ చేయండి
తలనొప్పిని నివారించుకోవడం కోసం మార్కెట్లో మెడికల్ ఫార్మసీలో వివిధ రకాల మందులు కూడా అందుబాటులో ఉంటాయి. అయితే, ఇటువంటి రసాయనిక మందులకు ఎల్లప్పుడూ అలవాటు పడటం కంటే కొన్ని సులభమైన మరియు అతి సులభంగా, తేలికగా మనకు అందుబాటులో ఉండే కొన్ని హోం రెమెడీస్ ను ఉపయోగించి తలనొప్పి నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు. అటువంటి 10 ఉత్తమ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఇస్తున్నాం...
మీకు తలనొప్పి కారణం అయ్యే ఆహారాలు:క్లిక్ చేయండి

నీళ్ళు:
మీ తలనొప్పికి ఒక వేళ డీహైడ్రేషన్ కారణం అయితే, అప్పుడు తలనొప్పి నుండి చాలా సులభంగా ఉపశనమం పొందవచ్చు. తలనొప్పి సమయంలో సరిపడా నీళ్ళు త్రాగి తలనొప్పి నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు. తలనొప్పిని తగ్గించడంలో నీళ్ళు ఎఫెక్టివ్ హోం రెమెడీ. తలనొప్పిగా అనిపించినప్పుడు వెంటనే ఒక గ్లాసు నీళ్ళు త్రాగండి. అలాగే రోజంతా మద్యమద్యలో గ్యాప్ ఇస్తూ కొద్దికొద్దిగా త్రాగుతుండాలి.

ఐస్ ప్యాక్:
ఐస్ క్యూబ్ తీసుకొని నుదిటి మీద పెట్టి మసాజ్ చేయడం వల్ల తలనొప్పి నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు. చల్లగా ఉండే ఐస్ ముక్క అందుబాటులో లేకపోయిన వెంటనే చల్లటి నీటిలో తడివస్త్రం డిప్ చేసి, నుదిటి మీద వేసుకొని, పది నిముషాలు వేసుకోవాలి. తడి వస్త్రం తేమ తగ్గినతర్వాత తిరిగి అదే పద్దతిని మరో సారి ప్రయత్నించాలి.ఇలా మీరు తలనొప్పి నుండి ఉపశమనం పొందే వరకూ చేయవచ్చు.

వేడి నీళ్ళు:
మీ తలనొప్పికి కారణం ఒత్తిడి కారణం అయితే, హాట్ వాటర్ బ్యాగ్స్ (మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి)వీటిలో వేడినీళ్ళు పోసి, మెడ మీద సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. మెడ నరాల మీద వేడి తగలగానే ఒత్తిడికి కారణం అయ్యే కండరాలు విశ్రాంతి చెందుతాయి. దాంతో తలనొప్పి నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు. ఇలా హాట్ వాటర్ బ్యాగ్ తో పాటు, హాట్ వాటర్ షవర్ కూడా వచేయవచ్చు.

నిమ్మరసం:
తలనొప్పిని నివారించడంలో నిమ్మరసం ఒక ఎఫెక్టివ్ మరియు పవర్ ఫుల్ పదార్థం. నిమ్మరసం కలినిపి గోరువెచ్చని నీటిని మీరు త్రాగినప్పుడు, తలనొప్పి తీవ్రతను తగ్గిస్తుంది. కడుపులో గ్యాస్ ఉన్నప్పుడు, దాని కారణంగా వచ్చే తలనొప్పిని నివారించడానికి ఇది ఒక ప్రయోజనకరమైన హోం రెమెడీ. మరో చిట్కా, తలనొప్పి నుండి ఉపశమనం పొందాలంటే సిట్రస్ పండ్ల యొక్క పేస్ట్ ను తల నుదిటి మీద అప్లై చేయడం వల్ల తక్షణ ఉపశమనం పొందవచ్చు.

తమలపాకులు:
తమలపాకలు బాధనివారణి అదే విధంగా కూలింగ్ ఎఫెక్ట్ ను ఇచ్చే లక్షణాలు కలిగిన తమలపాకులు ఉపయోగించి కొన్ని క్షణాల్లో తలనొప్పి నివారించుకోవచ్చు. అందుకు మీరు చేయాల్సింది..రెండు లేదా మూడు తాజాగా ఉండే తమలపాకులను తీసుకొని మెత్తగా పేస్ట్ చేసి, ఈ పేస్ట్ ను తల నుదిబాగంలో బాగా అప్లై చేయాలి. చేసిన తర్వాత అరగంట పాటు అలాగే ఉండటం వల్ల తలనొప్పి నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది.

అల్లం:
అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరి లక్షణాలు తలనొప్పి నివారించడంలో అద్భుతంగా సహాయపడుతాయి. అదే సమయంలో అల్లం, తలలోని రక్త సిరలు విశ్రాంతి చెంది, తలలో వాపును తగ్గించి మరియు చురుకుగా పనిచేసి, టెన్షన్ తో వచ్చే తలనొప్పిని నివారిస్తుంది. మీకు తలనొప్పి ఉన్నప్పుడు అల్లం టీని రోజులో మూడు నాలుగు సార్లు త్రాగడం వల్ల శరీరంలో నుండి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

ఆపిల్స్:
మీరు ఉదయమే తలనొప్పితో నిద్రలేచినప్పుడు, నొప్పితో బాధపడుతుంటే, ఒక ఆపిల్ ముక్కకు కొద్దిగా ఉప్పు రాసి తినాలి, తర్వాత గోరువెచ్చని నీటిని త్రాగాలి. ఇలా చేయడం వల్ల నిద్రలేవగానే అంటిపెట్టుకొని వచ్చే తలనొప్పిని నివారించుకోవచ్చు. అలాగే ఆపిల్ తో పాటు ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా తలనొప్పి నివారణకు సహాపడుతుంది. ఒక గిన్నెలో కొద్దిగా ఒక మగ్గు నీళ్ళు తీసుకొని వేడిచేసి, అందులో ఆపిల్ సైడ్ వెనిగర్ వేసి ఆవిరి పట్టాలి.

పుదీన:
పుదానీలు చల్లదనం మరియు బాధనివారించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. హెర్బల్ టీలో కొద్దిగా ఎండిన పుదీనా ఆకు వేసి వేడిగా టీ తయారుచేసి, అందులో కొద్దిగా తేనె మిక్స్ చేసి వేడి వేడి టీ త్రాగడం వల్ల తలనొప్పి నుంది తక్షణ ఉపశమనం ఉంటుంది . అలాగే కొద్దిగా పుదీనా ఆయిల్ ను మీనుదిటి బాగంలో మసాజ్ చేయాలి.

యూకలిప్టస్ ఆయిల్:
నీలగిరి తైలంలో నిప్పి నివారించే లక్షణాలు, అదే విధంగా యాంటీఇన్ఫ్ల మేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నందున, ఈ నీలగిరి తైలం నుండి తల యొక్క నుదిభాగంలో మరియు కణత వద్ద నిధానంగా మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ నూనె నొప్పినుండి ఓదార్పు ప్రభావాన్ని కలిగించి, నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. అదే సమయంలో మీరు తల చుట్టూ ఉన్న కండరాలు విశ్రాంతి పొందేలా సహాయపడుతుంది.

దాల్చి చెక్క:
తలనొప్పిని నివారించడంలో మరో అద్భుతమైనటువంటి నొప్పి నివారిణి దాల్చిన చెక్క. కొద్దిగా దాల్చిన చెక్క తీసుకొని దాన్ని మెత్తగా పౌడర్ చేయాలి . ఇప్పుడు అందులో కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ లా కలుపుకోవాలి . ఈపేస్ట్ ను ఇప్పుడు తలనుదిభాగం మరియు కణతల్లో అప్లై చేసి అరగంట అలాగే ఉండనివ్వాలి . తలనొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగినప్పుడు కొద్ది సమయం తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దాంతో తలనొప్పి నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది.



Click it and Unblock the Notifications
