Latest Updates
-
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.? -
పూజ గదిలో దీపం ప్రతిసారీ ఆరిపోతుందా.. మీ ఇంట్లో ఈ కష్టాలు తప్పవు.! -
రోజూ అవే చపాతీలు, రోటీలు తిని బోర్ కొట్టిందా? మట్కా రోటీ ఇలా చేస్తే పిచ్చెక్కించే టేస్ట్! -
స్వీట్, హాట్ తినాలనే కోరికలు విపరీతంగా ఉన్నాయా.. మీ బాడీలో ఈ లోపాలే కారణం.! -
శని దేవుని అభయహస్తం: జూన్ 2027 వరకు ఈ 3 రాశులకు రాజయోగం.. మీరున్నారా ఇందులో? -
కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలం..రోజకి ఇది 1 తింటే చాలు కొండలను ఢీకొట్టే శక్తి!
కిడ్నీ ఇన్ఫెక్షన్ లక్షణాలు: నివారణ మార్గాలు
మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలు మూత్రపిండాలు. ఎందుకంటే ఆహారం జీర్ణమయ్యే క్రమంలో ఏర్పడే మలినాలు కావచ్చు... శరీరంలో జరిగే ఏ జీవక్రియలోనైనా ఏర్పడే వ్యర్థపదార్థాలు కావచ్చు.. ఏవైనా సరే వాటిని ఎప్పటికప్పుడు తొలగించి రక్తాన్నే కాదు.. శరీరం మొత్తాన్నీ శుచిగా, శుద్ధిగా ఉంచే సహజసిద్ధ యంత్రాలు కిడ్నీలు. అవి ఒక్కసారి పనిచేయమని మొరాయిస్తే.. ఆరోగ్యం అస్తవ్యస్తం అయిపోతుంది. అంతటి ప్రాముఖ్యం ఉన్న కిడ్నీలను కాపాడుకోవాలంటే ముందు జీవనశైలి ఆరోగ్యంగా ఉండాలి.
మూత్ర వ్యవస్థ అంటే మూత్రపిండాలు, మూత్రా శయం, మూత్రనాళాలకు సంబంధించిన వ్యాధులు బ్యాక్టీరియా వలన సోకే ఇన్‌ఫెక్షన్ కారణంగా వస్తాయి. మూత్రపిండాలకు ఇన్‌ఫెక్షన్ రావడానికి అనేక కారణాలున్నాయి. శరీరంలో ఇతరభాగంలో ఇన్ ఫెక్షన్ సోకడం, చీముగడ్డలు, టిబి, టాన్సిల్స్, గ్రంథులకు సోకే ఇన్‌ఫెక్షన్లు మొదలైనవి రక్తం ద్వారా మూత్రపిండాలకు చేరడం మొదలైన కార ణాల వలన వీటికి ఇన్‌ఫెక్షన్లు సోకుతాయి.

అలాగే గర్భాశయంనుంచి మూత్రపిండాలకు ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి చెందడం వలన కూడా అవి దెబ్బతింటాయి. ఇతర కారణాలలో మూత్రం వెలుపలికి వెళ్లవలసిన దారిలో రాళ్ల వలన కానీ, ఇతరత్రా కాని అడ్డంకులు ఏర్పడటం వలన వచ్చే ఇన్‌ఫెక్షన్, ఊపిరితిత్తులకు టిబి సోకడం వలన మూత్ర పిండాలకు ఇన్‌ఫెక్షన్ సోకే అవకాశాలున్నాయి. ఇవేకాక పుట్టుకతో వచ్చే ఇన్ఫెక్షన్ల వలన కూడా మూత్రపిండాలకు వ్యాధులు సోకడానికి కారణమవుతున్నాయి. మూత్రవ్యవస్థలో ఇన్‌ఫెక్షన్ సోకడం మహిళలలో, చిన్న పిల్లల్లో సర్వసాధారణంగా కనిపి స్తుంది. చిన్న పిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాల వలన మూత్రవ్యవస్థకు ఇన్‌ఫెక్షన్ సోకుతుంది. మహిళల్లో రజస్వల సమయంలోనూ, ప్రసూతి సమయంలోనూ ఇన్‌ఫెక్షన్ సోకే అవకాశం ఉంది.
లక్షణాలు : మూత్ర వ్యవస్థకు ఇన్‌ఫెక్షన్స్ సోకడం వలన తొలిదశలో రోగి తలనొప్పితో బాధపడటం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలతో బాధపడుతుంటాడు. దీనితోపాటు కడుపులో నొప్పి ఉంటుంది. ఈ నొప్పి చాలా తీవ్రంగా ఉండి కడుపు మధ్యభాగంనుండి కిందికి తొడ వరకూ పాకుతుంది. దీనితోపాటు జ్వరం ఉంటుంది. ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయటం, మూత్రంలో మంట ఉంటాయి. స్త్రీలలో నాలుగు నుంచి ఆరు నెలల గర్భిణీ దశలో ఇన్‌ఫెక్షన్ వలన చీము సోకుతుంది. అటువంటి సందర్భాలలో ఒక్కొక్కసారి అబార్షన్ జరుగవచ్చు.
చిన్నపిల్లల్లో పుట్టు కతో వచ్చే ఇన్ఫెక్షన్ల వలన మూత్రపిండాలు పూర్తిగా పాడయి పోవచ్చు. పిల్లల్లో ఆకలి లేకపోవడం, సరిగ్గా ఎదుగుదల లేకపోవడం, జ్వరం రావడం వంటి లక్షణాలు ఉంటాయి. అలాగే మూత్ర విసర్జన సమయంలో నొప్పి వలన ఏడవడం, కడుపు నొప్పి మొదలైన లక్ష ణాలు కనిపిస్తాయి. రోగి చెప్పే లక్షణాలతోపాటు మూత్రపరీక్ష, రక్తపరీక్షల ద్వారా ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించవచ్చు. అవసరానుగుణంగా ఐవిపి, స్కానింగ్ వంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది.
నివారణ:
1. మూత్రవ్యవస్థకు ఇన్‌ఫెక్షన్ సోకినప్పుడు రోగి ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి.
2. ఎక్కువగా నీరు, తదితర ద్రవ పదార్థాలను తీసుకోవాలి. క్రాన్ బెర్రీ జ్యూస్ బాగా పనిచేస్తుంది
3. ఇన్‌ఫెక్షన్ తగ్గడానికి రోగికి యాంటిబయాటిక్ మందులను తీసుకోవాలి.
4. బహు మూలలను శుభ్రంగా ఉంచుకోవాలి, ఎప్పటికప్పుడు మూత్ర విసర్జనకు వెళ్ళాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications