Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
అతి మూత్రం-తరచూ మూత్రవిసర్జన యొక్క లక్షణాలు
సాధారణ మూత్రవిసర్జన కంటే మీరు ఎక్కువ సార్లు వెళ్ళవలసి వొస్తున్నదని ఎలా తెలుసుకుంటున్నారు? మనలో చాలామందికి మూత్రవిసర్జన చేస్తున్నప్పుడు అది సాధారణమా, కాదా అన్న విహితమైన ఆలోచన ఉంటుంది. సహజంగా మనము ఎక్కువగా నీరు లేదా బీరు త్రాగటం వలన ఎక్కువసార్లు బాత్ రూంకు వెళ్ళవలసి ఉంటుంది. కొన్ని మందులు తీసుకోవటం వలన లేదా గర్భవతులలో సాధారణంగా మామూలుకన్నా ఎక్కువసార్లు మూత్రవిసర్జన జరుగుతుంది. మీరు పైన చెప్పిన పరిస్థితులు ఏమీ లేకుండా మూత్రవిసర్జన ఎక్కువగా చేస్తున్నప్పుడు, దానిని అసాధారణ మూత్రాశయ తిత్తి లక్షణాలలో ఒకటిగా అనుమానించవలసి ఉంటుంది.
అతిక్రియాశీల మూత్రాశయ తిత్తి లక్షణం అంతే సాధారణంగా మూత్రవిసర్జన కంటే మీరు ఎక్కువసార్లు చేస్తున్నప్పుడు కలిగే స్థితి. పైగా ఈ అతిమూత్ర వ్యాధి రావటానికి గల కారణాలు మారుతూ ఉంటాయి. ఇది అంటువ్యాధి సోకటం, మధుమేహం లేదా వయస్సు పైబడటం వలన సంభవిస్తుంది. ఎలాగైనా, మీరు సరైన చికిత్స తీసుకుని ఈ అతిమూత్రవ్యాదికి ముగింపు పలకటం అవసరం.

మీరు అతిమూత్రవ్యాధితో బాధపడుతున్నారని నిర్ధారించడానికి కొన్ని లక్షణాలు.
8 కన్నాఎక్కువ సార్లు :మీరు మూత్రవిసర్జనకు 8 కన్నాఎక్కువ సార్లు వేల్లుతున్నట్లయితే, మీరు ఖచ్చితంగా సమస్యతో బాధపడుతున్నారన్న మాట. సాధారణంగా మానవులు ఎనిమిది కన్నా క్కువ సార్లు వెళ్ళకూడదు. ఒకవేళ మీరు రోజులో చాలా నీరు త్రాగితే లేదా మద్యం తాగితే తప్ప, ఎక్కువసార్లు బాత్రూంకు వెళ్ళవలసిన అవసరం ఉండదు.
హఠాత్తుగా వెళ్ళవలసి రావటం: మీకు ఆకస్మికంగా చాలా బలంగా మూత్రవిసర్జన చేయాలనే అనుభూతి కలిగినప్పుడు, అప్పుడు మీలో ఏదో తేడా ఉన్నాడని అర్థం.. మీ మూత్రవిసర్జన ఎక్కువ ఒత్తిడితో, మీ మూత్రాశయ తిత్తి నిండినట్లుగా అనుభూతి కలిగి వేగంగా మూత్రవిసర్జన జరుగుతుంది. మీరు హఠాత్తుగా మరియు చాలా గట్టిగా మూత్రవిసర్జన తపన ఉన్నట్లుగా భావిస్తే, అది ఒక విరుద్దానికి సంకేతంగా భావించవొచ్చు.
లీకేజ్ సమస్య
కొన్నిసార్లు, మూత్రవిసర్జనకు మీరు టాయిలెట్ చేరుకునే వరకు కూడా మీరు నియంత్రించుకోలేరు. తద్వారా కొన్ని చుక్కలు మూత్రం బయటికి రావటం లేదా లీకేజ్ వలన మీ బట్టలు కొద్దిగా తడవటం వంటి సమస్యలు ఏర్పడతాయి. అప్పుడు మూత్రాశయ తిత్తి మీ నియంత్రణలో లేదని అర్థం. వెంటనే చికిత్స చేయించుకుని పరిస్థితి అదుపులో ఉంచుకోవాలి.
నిద్రాభంగం
మీరు చాలా సార్లు మూత్రవిసర్జనకు లేవటం వలన మీకు రాత్రి నిద్రకు భంగం కలుగుతున్నదా? మీరు ఒకసారి లేదా రెండుసార్లు రాత్రి మూత్రవిసర్జనకు లేస్తున్నట్లయితే అప్పుడు మీరు అతిమూత్రవిసర్జనతో బాధపడుతున్నారన్న మాట. ఈ కారణం వలన కాకపోవొచ్చు లేదా, అతిమూత్రవిసర్జన కారణంగా నిద్ర కు భంగం కావొచ్చు. సరిఅయిన చికిత్స జరగాలి కాబట్టి, ముందు అతిమూత్రవిసర్జన కారణాల దర్యాప్తు ముఖ్యం. మీరు పై లక్షణాలు కలిగి ఉంటే వైద్యుడుని సంప్రదించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
