Latest Updates
-
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే! -
స్వాతంత్ర్య దినోత్సవం రోజున నోరూరించే ట్రై కలర్ స్వీట్.. వీటిని కలిపారంటే టేస్ట్ ఎవర్ గ్రీన్.! -
పంద్రాగ్రస్ట్ స్పెషల్.. బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ పాత్రలో చాలా ఈజీగా తిరంగా కేక్.! -
ప్రాణాల మీదకు తెచ్చిన మొబైల్ పిచ్చి.. షకీలాకు మెడ సర్జరీ, కారణం తెలిస్తే షాక్! -
80వ స్వాతంత్ర్య దినోత్సవం.. వాట్సప్ స్టేటస్, కోట్స్.. మన భారతీయులకు ఇలా విషెస్ తెలియజేయండి! -
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన ఆవ నూనె తయారీ.. మిక్సీ ఉంటే చాలు! -
ఆగస్టు 15 స్పెషల్..పక్కా స్వీట్ షాప్ స్టైల్ మోతీచూర్ లడ్డూ.. మీ ఇంట్లోనే ఇలా సింపుల్ గా చేసేయండి -
రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా.. మీ ఫ్యామిలీలో ఈ సమస్యలు రావడం పక్కా.! -
మన ఇంట్లో పెరిగే ఈ చెట్టు పండ్లే కాదు.. ఆకులు సైతం రోగాలతో పోరాడతాయని తెలుసా.!
స్త్రీలలో ఒత్తిడికి కారణాలు, దాని ప్రభావాలు ఏమిటి ?
డి అనేది అన్ని వయసులు, లింగాల వారికి ఒకేలా వుండే అనుభూతి కాదు. తమ ప్రాజెక్ట్ చేతికి వచ్చాక తమ బాసులను, సీనియర్లను సంతోష పరచడానికి ఈ మధ్య జనం చాలా ఒత్తిడికి గురౌతున్నారు. లక్ష్యాలు సాధించలేనప్పుడు ఒత్తిడికి గురౌతారు. నిస్పృహకు గురయ్యే వారు చాలా రకాలుగా అవుతారు, లక్షణాలు కూడా వేరుగా వుంటాయి. అలాగే స్త్రీలలో ఒత్తిడి ఒకలాగానూ, పురుషులలో ఒకలాగానూ ఒత్తిడి వుంటుంది. స్త్రీలలో విలక్షణమైన ఒత్తిడి లక్షణాలు ఉండడానికి చాలా అంశాలు కారణమౌతాయి. వాటిలో ప్రధానమైనది ప్రజనన హార్మోన్. స్త్రీల మీద ఉండే సామాజికపరమైన ఒత్తిడి కూడా స్త్రీలలో నిరాశకు దారి తీసేంత ఒత్తిడి కలిగిస్తుంది. ఈ ఒత్తిడుల గురించి మీరు సమాచారం సేకరించ గలిగితే పరిష్కారం సాధించడం కూడా సాధ్యమే.
స్త్రీలలో నిరాశకు కారణాలు :
జన్యువులు, మనస్తత్వం కూడా మగవారిలో కన్నా స్త్రీలలో భిన్నంగా వుంటాయి. ఒకటే కారణానికి అందరు స్త్రీలు నిరాశకు గురి కారు. ప్రతి స్త్రీని ఒత్తిడికి, నిరాశకు గురి చేసే చాలా అంశాలు వున్నాయి. వాటిలో కొన్ని ఇవి :

వంధ్యత్వం, గర్భధారణ – వంధ్యత్వానికి గురైన ప్రతి స్త్రీలోను హార్మోన్ల వల్ల మార్పులు కలుగుతాయి. గర్భధారణ సమయంలో కూడా స్త్రీలలో హార్మోన్ల వల్ల చాలా మార్పులు కలుగుతాయి. గర్భధారణ లో సమయం గడిచే కొద్దీ కూడా స్త్రీలలో గర్భ విచ్చిత్తి అయ్యే ప్రమాదం కూడా ఎక్కువే వుంటుంది. ఇది స్త్రీలలో ఒత్తిడికి ప్రధానమైన కారణాలలో ఒకటి.
ఆరోగ్య సమస్యలు : చాలా మంది స్త్రీలకు రకరకాల ఆరోగ్య సమస్యలుంటాయి. వాటిలో కొన్ని మానసిక అనారోగ్యాలు, డైటింగ్ వల్ల వచ్చే ప్రభావం, నిస్సత్తువ, ధూమపానం మానివేయడం లాంటివి. ఆవిడ శారీరిక ఆరోగ్యం బాగుండదు కనుక మానసిక అనారోగ్యం రావచ్చు, దాని వల్ల నిరాశకు గురి కావచ్చు.
రుతువిరతి : రుతువిరతి లేదా మెనోపాజ్ కాలంలో ప్రతి స్త్రీ ఒక విలక్షణమైన మానసిక స్థితిని అనుభవిస్తుంది. స్త్రీలలో ఋతు చక్రం ఆగిపోయేది ఇప్పుడే. ఆమె సంతానోత్పత్తి సామర్ధ్యం ఆగిపోతుంది. జననాంగం కూడా రుతువిరతి కాలంలో చాలా మార్పులకు గురౌతుంది. స్త్రీలలో ఇంతకు పూర్వమే నిరాశ చరిత్ర వుంటే, అది ఈ సమయంలో తిరిగి వచ్చే అవకాశం వుంది.
మహిళల శరీర పటిష్టతకు కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలు:క్లిక్ చేయండి
శరీరాకృతి సమస్య : యుక్త వయసుకు వచ్చిన స్త్రీ లింగ భేదం గమనించి వత్తిడికి గురి కావచ్చు. యవ్వనంలోకి వచ్చేటప్పుడు లింగ భేదం కూడా ఒత్తిడికి దారితీయ వచ్చు. శరీరాకృతి గురించిన అసంతృప్తి కూడా ఒత్తిడి పెరగడానికి కారణం కావచ్చు. యుక్త వయసులో శరీరంలో వచ్చే మార్పుల వల్ల కూడా స్త్రీలలో ఒత్తిడి కలగవచ్చు.
అధిక ఒత్తిడి : తన సామర్ధ్యాన్ని మించి పని చేసే వారుకూడా ఒత్తిడికి గురయ్యే అవకాశం వుంది. మగవారితో పోలిస్తే, కార్యాలయాలు లేదా ఇళ్ళలో కూడా స్త్రీలు త్వరగా ఒత్తిడికి లోనౌతారు, నిరాశకు గురి అవుతారు. పరిశోధకుల ప్రకారం, స్త్రీలలో ఉత్పత్తి అయ్యే ఒత్తిడి హార్మోన్లు పురుషులలో కన్నా ఎక్కువ.
మహిళల బరువును అతి సాధారణంగా తగ్గించే ఆహారాలు..:క్లిక్ చేయండి
ఏదో ఒక కారణం చేత వత్తిడికి గురయ్యే స్త్రీలు నెగటివ్ గా ఆలోచిస్తారు. పాసిటివ్ ఆలోచనలు వారి మనసును ఖాళీ చేసినట్లు అనిపిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications