Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
కీరదోసకాయ వాటర్ లోని అద్భుతమై ఆరోగ్య ప్రయోజనాలు
ఆరోగ్యంగా మరియు త్వరగా మీరు బరువు తగ్గాలని కోరుకుంటున్నారా? మీ సమాధానం అవును అనేట్లైతే, మీరు రెగ్యులర్ గా ఒక కప్పు కీరదోసకాయ జ్యూస్ లేదా వాటర్ ను ప్రతి రోజూ ఉదయం పరగడపును తీసుకోవాలి . కీరదోసకాయ వాటర్ తో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అంతే కాదు నిమ్మరసంతో పోల్చితే కీరదోసకాయ చాలా ఉత్తమమైనదని పరిశోధనల ద్వారా నిర్ధారణ అయినది.
అయితే బరువు తగ్గాలనుకొనే వారు, కీరదోసకాయ వాటర్ త్రాగాలని కోరుకొనే వారు, కీరదోసకాయ వాటర్ లో తేనె లేదా ఉప్పు చేర్చి తీసుకోవాలి . ఇంకా మీరు కీరదోసకాయ ఇష్టపడేట్లైతే, కీరదోసకాయ జ్యూస్ లో తేనె లేదా ఉప్పు ఏమి జోడించకుండా నేరుగా అలాగే త్రాగడం వల్ల మరింత ఎక్కువగా పౌండ్ల బరువును తగ్గిస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గించడం కంటే, ఆరోగ్య పరకంగా కీరదోసకాయ యొక్క ప్రయోజనాలు ఎక్కువ. క్లియర్ స్కిన్ మరియు జీర్ణ సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.
కాబట్టి, మీరు హెల్తీగా మరియు ఫిట్ గా జీవించాలని కోరుకుంటున్నట్లైతే, కీరదోసకాయ వాటర్ త్రాగడం వల్ల పొందే అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలుసుకోవాల్సిందే.
కీరదోసకాయ రిసిపి: ముందుగా కీరదోసకాయ పొట్టు తీసి, ముక్కలుగా కట్ చేసి, మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద బౌల్లో కీరదోసకాయ గుజ్జు వేసి అందులో అరగ్లాసు నీళ్లు పోసి బాగా మిక్స్ చేయాలి. అవసరం అయితే రుచికోసం చిటికెడు ఉప్పు మిక్స్ చేయాలి. ఇంకా ఉప్పు కు బదులుగా తేనె మిక్స్ చేసి ఉదయం పరగడపున తీసుకోవాలి.

1. శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుతుంది:
కీరదోసకాయలో 90శాతం నీరు ఉంటుంది. రోజంతా మీకు అవసరం అయ్యే ఎనర్జీని ఈ జ్యూస్ అందిస్తుంది. కీరదోసకాయ శరీరాన్ని రిహైడ్రేట్ చేస్తుంది తగినంత నీటిని మీరు తీసుకోలేనప్పుడు , 90 పర్సెంట్ నీరు ఉన్న ఒక చల్లటి కీరదోసకాయ తినండి.

2. ఎక్కువ విటమిన్స్ అందిస్తుంది:
శరీరానికి అవసరం అయ్యే విటమిన్స్ ను అంధిస్తుంది. కీరదోసకాయ కావలసిన రోజువారీ విటమిన్లను తిరిగి నింపుతుంది కుకుంబర్ లో రోజులో శరీరానికి కావలసిన చాలా విటమిన్లు ఉన్నాయి. మీ వ్యాధినిరోధక వ్యవస్థను చురుగ్గా ఉంచేందుకు మరియు మీకు శక్తిని పెంచడానికి తోడ్పడే విటమిన్లు ఏ,బి మరియు సి,దీనిలో పుష్కలంగా ఉన్నాయి. దోసకాయ రసంతో పాలకూర మరియు క్యారట్ కలిపితే చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. శరీరానికి కావలసిన 12 శాతం విటమిన్ సి లో ఎక్కువ శాతం సి విటమిన్ ఇందులో ఉండటంవలన దీనిని శరీరం మీద ఉంచటం మర్చిపోవొద్దు.

3. మినిరల్స్ ను జోడిస్తుంది:
కీరదోసకాయ జ్యూస్ లో అత్యధికంగా మినిరల్స్ ఉన్నాయి. ఈ మినిరల్స్ మీ శరీరం ఫిట్ గా ఉంచడానికి సహాయపడుతుంది మరియు చర్మం ఆరోగ్యంగా మరియు హ్యాపిగా ఉండటానికి సహాయపడుతుంది. కీరదోసకాయ చర్మానికి పొటాషియం, మెగ్నీషియం మరియు సిలికాన్ ఎక్కువగా ఉన్నాయి. ఈ కారణంగా స్పాలలో ఎక్కువగా దీనిని ఆధారం చేసుకుని చికిత్సలు జరుగుతాయి.

4. హైబిపి తగ్గిస్తుంది:
మీరు హైబీపి లేదా లోబీపితో బాధపడుతున్నట్లైతే మీరు కీరదోసకాయ జ్యూస్ రెగ్యులర్ గా త్రాగడం వల్ల ఈ సమస్యను నివారించుకోవచ్చు. శరీరాన్ని సాధ్యమైనంత వరకూ హైడ్రేషన్ లో ఉంచుకోవడం ద్వారా హైబిపిని కంట్రోల్ చేసుకోవచ్చు.

5. ఆకలిని కంట్రోల్ చేస్తుంది:
కీరదోసకాయ వాటర్ త్రాగడం వల్ల ఆకలిని కంట్రోల్ చేస్తుంది. కీరదోసకాయలో మీ టమ్మీని ఫుల్ చేసే గుణాలు పుష్కలంగా ఉన్నాయి.

6. శరీరాన్ని చల్లబరుస్తుంది:
కీరదోసకాయ నీళ్ళు శరీరంను చల్లబరిచే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ నీటిని వల్ల వేసవి తాపం తగ్గించుకోవచ్చు. వేసవిలో శరీరంను చల్లబరుచుకోవచ్చు

7. కండరాలను బలోపేతం చేస్తుంది:
కీరదోసకాయలో ఉండే సిలికా మజిల్ టిష్యులను హెల్తీగా ఉంచడానికి సహాయపడుతుంది.

8. లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి :
కొన్ని రకాల వ్యాధులను నివారించడానికి అవసరం అయ్యే లక్షణాలు కీరదోసకాయ వాటర్ లో పుష్కలంగా ఉన్నాయి. ఇంకా ఇందులో యాంటీ యాక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది శరీరంను డిటాక్సిఫై చేస్తుంది.

9. క్యాన్సర్ ను నివారిస్తుంది:
కీరదోసకాయ నీళ్ళలో విటమిన్స్, మినిరల్స్, మరియు న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉండటం వల్ల కొన్ని ప్రాణాంతక వ్యాధులను నివారిస్తుంది.

10. మలబద్దక సమస్యను నివారిస్తుంది:
మీరు మలబద్దక సమస్యతో బాధపడుతున్నట్లైతే , ఉదయం అల్పాహారానికి ముందు కీరదోసకాయ రసాన్ని తరచూ తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.



Click it and Unblock the Notifications
