For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మన శరీరంలో ఆరోగ్యానికి హాని కలిగించే 8 అత్యంత అపరిశుభ్ర అంగాలు

By Super
|

ఆపాన ప్రదేశమే మన శరీరం లో అత్యంత అపరిశుభ్రమైన ప్రదేశం అనుకుంటున్నాకదూ??దిగువ పేర్కొన్న శరీర భాగాల కంటే ఆపాన ప్రదేశమేమీ అపరిశుభ్రమైనది కాదని ఒక అధ్యయనం లో రుజువయ్యింది.మలం ని కలిగి ఉండటం వల్ల ఆపాన ప్రదేశమే అపరిశుభ్రమైనది అని చాలా మంది భావిస్తూ ఉంటారు.

హార్వార్డ్ దంత వైద్యశాల శాస్త్రవేత్తలు దాదాపు 615 రకాల బాక్టీరియా మన నోరు, నాలుక, గొంతు భాగం లో ఉంటాయని అందువల్ల అవి మన శరీరం లో అత్యంత అపరిశుభ్రమైన అంగాలుగా గుర్తించారు. అలాగే కంటితో చూడలేని బాక్టీరియా మన గోళ్ళలో ఉంటుందని కూడా కనుగొన్నారు.

READ MORE: సంభోగం ముందు & తర్వాత పాటించవలసిన 12 ఆరోగ్య నియమాలు

నోరు, నాలుక, ఆపాన ప్రదేశమే కాకుండా మన కంటిలో కూడా అనేక హానికారక బాక్టీరియా ఉండటం వల్ల కళ్ళు కూడా అపరిశుభ్రమైన అంగాలే.

READ MORE: నోరు శుభ్రంగా ఉంచుకోక పోతే ఈ జబ్బులకు గురికాకతప్పదు

దిగువ పేర్కొన్న 8 శరీర భాగాలు అత్యంత అపరిశుభ్రమైన ప్రదేశాలు. అందువల్ల వాటిని పదే పదే తాకకండి.కొన్ని పరిశుభ్రత కి సంబంధించిన చిట్కాలు పాటించి వాటిని శుభ్రం గా ఉంచుకోవచ్చు.మరి చూడండిక,ఆ 8 అంగాలు ఎందుకు అపరిశుభ్రమైనవి అన్నామో.

ముఖం:

ముఖం:

అద్దంలో చూసుకొన్నప్పుడు మన ముఖం పరిశుభ్రంగా ఉన్నట్లే అనిపిస్తుంది. కానీ నిపుణులేమంటారంటే, ముఖమే మన శరీరంలో అత్యంత అపరిశుభ్ర అంగం.మీ స్మార్టు ఫోనుల్లోనుండి సూక్ష్మ జీవులు మీముఖానికి చేరతాయని తెలుసా??ఒక వేళ మీ ముఖం మీద ఏదైనా గాయం ఉంటే ఈ సూక్ష్మజీవులు మరింత హాని కలిగిస్తాయి.

చెవులు:

చెవులు:

మన చెవిలో ఉండే వ్యాక్స్(గులిమి) మన వినికిడికి సహాయ పడుతుంది.మనంతట మనం ఆ గులిమి ని శుభ్రం చేసుకునే క్రమం లో చెవిని గాయపరచుకునే అవకాశం ఉంది. చెవులు తమని తాము శుభ్రపరచుకునే సామర్ధ్యం కలిగి ఉండటం వల్ల మనము చెవిని శుభ్రపరచుకోవడాన్ని మానెస్తే మేలు.

కళ్ళు:

కళ్ళు:

మన కంటి చివరల్లో బాక్టీరియా ఉంటుంది.మన కనురెప్పలు మన కళ్ళు ఇంఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతూ ఉంటాయి.ఆ క్రమం లో కనురెప్పల మీద మురికి పేరుకుపోవడం వల్ల కనురెప్పలు మన శరీరం లో అత్యంత అపరిశుభ్రమైన భాగాలవుతాయి.ఒకవేళ మీ కంటికి ఇంఫెక్షన్ సోకితే పొరపాటున కూడా చేతో తాకకండి. ఆ ఇంఫెక్షన్ మీ శరీరానికి హాని కలిగిచే అవకాశం ఉంది.

నోరు:

నోరు:

హార్వార్డ్ దంత వైద్యశాల శాస్త్రవేత్తలు దాదాపు 615 రకాల బాక్టీరియా మన నోటిలో ఉంటుందని కనుగొన్నారు.పుక్కిలించడం, రోజూ రెండు సార్లు బ్రష్ చేసుకోవడం ద్వారా నోటిలో హానికారక బాక్టీరియా ని తగ్గించవచ్చు.

ముక్కు:

ముక్కు:

ఒకోసారి ముక్కు లోపలి భాగం దురదగా అనిపించవచ్చు. అలాంటప్పుడు అస్సలు గోకరాదు..మన ముక్కులో అనేక రకాల బాక్టీరియ ఉంటుంది.అందువల్ల ఎప్పుడైనా ముక్కు లోపలి పొర కనుక చీరుకుపోతే అనేక ఇంఫెక్షన్లకి దారి తీయవచ్చు

గోళ్ళు:

గోళ్ళు:

మన గోళ్ళలో ఎంత బాక్టీరియ ఉంటుందో తెలిస్తే మీ గుండె ఆగిపోయినంత పనవుతుంది.బాక్టీరియా కి మన గోటి కింద ఉండే చర్మం అనుకూలంగా ఉండటం వల్ల అనేక రకాల ఇంఫెక్షన్లకి కారకమయ్యే బాక్టీరియా అక్కడ పెరిగుతుంటుంది.

ఆపాన ప్రదేశం :

ఆపాన ప్రదేశం :

దాదాపు వెయ్యి రకాలకి పైగా హానికారక బాక్టీరియ మన ఆహారనాళంలో ఉంటాయి. అవి మలం ద్వార ఆపాన ప్రదేశంలోకి ప్రవేశించడం వల్ల ఆపాన ప్రదేశం అత్యంత అపరిశుభ్రమైన అంగమవుతుంది.

నాభి:

నాభి:

మన నాభి కూడా అత్యంత అపరిశుభ్రమైన ప్రదేశమని తెలుసా మీకు?? కంటికి కనపడని అనేక రకాల బాక్టీరియ అక్కడ ఉంటాయి.

English summary

Eight Dirtiest Parts Of Your Body : Health Tips in Telugu

8 Dirtiest Parts Of Your Body, Do you think that the anus is the most dirtiest place on the body? According to research the anus is not as dirty as the rest of the body parts we introduce to you today. A lot of people feel the anus is the dirtiest since its in contact with fecal matter.
Desktop Bottom Promotion