For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్యాస్ర్టిక్ ట్రబుల్ కి కారణమయ్యే ఫుడ్ కాంబినేషన్స్

By Nutheti
|

మనం నిత్యం ఏదో ఒకటి తింటూ ఉంటాం. కొంతమంది హోం మేడ్ ఫుడ్ కి ప్రిఫరెన్స్ ఇస్తే.. కొందరు బయట రకరకాల ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేయాలని ఉవ్విళ్లూరుతుంటారు. అయితే ఏది తిన్నా.. మన ఆరోగ్యంపై దుష్ర్పభావం చూపంకుండా ఉన్నవాటినే ఎంచుకోవాలి. లేదంటే.. అనారోగ్య సమస్యలు మనమే కోరి తెచ్చుకున్నట్టు అవుతుంది.

బ్రేక్ ఫాస్ట్, లంచ్, స్నాక్స్ ఇలా.. ప్రతి సారీ.. ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. మనం ఏం తింటున్నాం..దీనివల్ల పొందే లాభాలేంటి ? నష్టాలేంటి అన్న విషయం ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే.. కొన్ని సందర్భాల్లో మనం తీసుకునే కొన్ని కాంబినేషన్ ఫుడ్స్ జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. కొన్ని కాంబినేషన్స్ వల్ల ఎలాంటి హాని జరగదని.. మంచి ప్రయోజనాలు కలుగుతాయని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఇది అన్ని సందర్భాల్లో కరెక్ట్ కాదు.

READ MORE: ఇబ్బంది కలిగించే గ్యాస్ర్టిక్ ట్రబుల్ తగ్గించే న్యాచురల్ హోం రెమిడీస్

మనం తీసుకునే ఆహారం మనకు ఎనర్జీనిస్తుంది. అలాగే కొన్ని రోగాలను నయం చేస్తుంది. దాంతో పాటు రోగనిరోధకతను పెంచుతాయి. అయితే సరైన కాంబినేషన్ లో ఆహారం తీసుకోవడం చాలా అవసరం. మనకు హానికలిగించే ఫుడ్ కాంబినేషన్స్ ఏంటో తెలుసుకుందాం.. వాటికి దూరంగా ఉందాం...

మీట్, చీజ్

మీట్, చీజ్

ఈ రెండింటిలో ప్రొటీన్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే ఒకేసారి మాత్రం ఈ రెండింటిని తీసుకోకూడదు. రెండింటిని కాంబినేషన్ గా తీసుకోవడం వల్ల ప్రొటీన్స్ శరీరంలో పెరిగిపోయి.. కాలేయంపై ఒత్తిడి పెరుగుతుంది.

ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్స్

ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్స్

వెన్న, కోడిగుడ్లు ఒకేసారి తీసుకోకూడదు. ఇవి.. హానికరం. ఒకేసారి రెండింటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు సమస్యగా మారి.. పొట్టలో సమస్యలు మొదలవుతాయి.

భోజనం సమయంలో, తర్వాత నీళ్లు

భోజనం సమయంలో, తర్వాత నీళ్లు

భోజనం చేస్తున్న సమయంలోనూ, భోజనం అయిన వెంటనే నీళ్లు, కానీ జ్యూస్ కానీ తీసుకోకూడదు. ఇది డైజెషన్ కి ఇబ్బంది కలుగజేస్తుంది. అలాగే గ్యాస్ర్టిక్ సమస్య వచ్చే అవకాశముంది. భోజనానికి 10 నిమిషాల ముందు, భోజనం చేసిన తర్వాత అరగంటకు నీళ్లు తాగాలి.

భోజనం తర్వాత కాఫీ, టీ

భోజనం తర్వాత కాఫీ, టీ

భోజనం తర్వాత కాఫీ, టీ తీసుకోవడం మానేయాలి. ఆహారం ద్వారా పొందే ప్రొటీన్స్ శరీరానికి అందకుండా కాఫీ, టీలలో ఉండే ఎసిడిక్స్ అడ్డుకుంటాయి. దీనివల్ల జీర్ణక్రియకు కూడా ఆటంకం ఏర్పడుతుంది.

ఎసిడిక్ ఫుడ్స్, కార్బోహైడ్రేట్స్

ఎసిడిక్ ఫుడ్స్, కార్బోహైడ్రేట్స్

ఎసిడిక్ ఫుడ్స్ అయిన టమోటా, నిమ్మ వంటి వాటిని పిండి పదార్థాలతో కలిపి తీసుకోకూడదు. ఈ కాంబినేషన్ లో ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థలో సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి ఫుడ్స్ జీర్ణమవడానికి కష్టమవుతుంది.

భోజనం చేసిన వెంటనే పండ్లు

భోజనం చేసిన వెంటనే పండ్లు

భోజనం చేసిన వెంటనే పండ్లు తీసుకోవడం మానేయాలి. మీరు తీసుకున్న భోజనం సరిగ్గా జీర్ణమవడానికి టైం కేటాయించి ఆ తర్వాత ఫ్రూట్స్ తీసుకోవాలి. అంటే కనీసం రెండు గంటల గ్యాప్ ఉండాలి. ఒకేసారి ఆహారం, పండ్లు తీసుకోవడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి.

రెడ్ మీట్, పిండి పదార్థాలు

రెడ్ మీట్, పిండి పదార్థాలు

రెడ్ మీట్ తోపాటు రైస్, బంగాళ దుంప తీసుకోకూడదు. ఇవి జీర్ణమవడం చాలా కష్టమవుతుంది. రెడ్ మీట్, చికెన, వైట్ మీట్ కి కాంబినేసన్ గా ధాన్యాలు తీసుకోవడం మంచిది.

English summary

Bad Food Combinations That Make You Sick

It is very important to have a check on the kinds of foods that you eat together. Sometimes, the foods that we eat in combination can have a drastic effect on our digestive system and health.
Story first published:Tuesday, December 15, 2015, 17:02 [IST]
Desktop Bottom Promotion