For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఊబకాయం మరియు అధికబరువుకు డీహైడ్రేషనే కారణమా...?

|

డీహైడ్రేషన్ గురించి మీరు వినే ఉంటారు. డీహైడ్రేషన్ ను మీరు అంత తేలికగా తీసుకోరాదని, నిజానికి అదే పెద్ద సమస్య అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. డీహైడ్రేషన్ వల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. నోటిదుర్వాసన, చర్మం పొడిబారటం, మలబద్దకం వంటి సమస్యలే కాకుండా అలాంటి పరిస్థితిలో ప్రయాణం చేసినట్లైతే ప్రమాధాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు..

ఈ డీహైడ్రేషన్ సమస్య ఉన్నప్పుడు వ్యాయామం చేయడం వల్ల శరీరంలో త్వరగా అలసట ముంచుకొస్తుంది. శరీరంలో కేవలం రెండు శాతం నీరు లోపిస్తే , శారీరక శ్రమతో కూడిన పనుల్లో పదిశాతం మేరకు పనితీరు తగ్గుతుందని, కండరాల్లో నీరు తగ్గిపోవడం వల్ల కాస్త శ్రమని కూడా శరీరం తట్టుకోలేని స్థితి ఏర్పడుతుంది. అంతే కాదు శరీరానికి సరిపడా నీరు అందక పోతే బరువు లేద లావు అవ్వడం కూడా జరగుతుంది.

అందుకే నిద్రలేవగానే ఒక బాటిల్ వాటర్ ను పరగడుపున త్రాగడం అలవాటు చేసుకోవాలి. అలాగే మీరు రెగ్యులర్ గా తీసుకొనే సోడా కంటెంట్ తగ్గించడం వల్ల శరీరంలో నీరు కోల్పోకుండా ఉంటారు. సోడాతో పాటు కాఫీ మరియు కేఫినేటెడ్ డ్రింక్స్ కూడా శరీరంలో నీటిని కోల్పోయేలా చేస్తాయి.

మరి డీహైడ్రేషన్ మన శరీరం మీద ఎలా ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం...

ఒబేసిటి:

ఒబేసిటి:

డీహైడ్రేషన్ వల్ల వీక్ గా మారీ, ఎక్కువగా తినాలనిపిస్తుంది. దాంతో జంక్ ఫుడ్ మీద ఎక్కువ కోరికలు పెరుగుతాయి. ఎనర్జీ లెవల్స్ పెంచుకోవడానికి ఎక్కువగా తినడం వల్ల శరీరంలోకి ఒక్కసారి అదనపు క్యాలరీలు వచ్చి చేరుతాయి. కాబట్టి, ఆకలిగా ఉన్నప్పుడు తినడానికి ముందు నీరు బాగా త్రాగాలి. లేదా దప్పిక కలిగినప్పుడు నీరు త్రాగాలి.

మలబద్దకం:

మలబద్దకం:

శరీరంలో నీరు తగ్గినప్పుడు ప్రేగుల్లో చేరిన వ్యర్థలు ముందుకు జరగవు, జీర్ణవ్యవస్థ ఆలస్యం అవుతుంది. ఆ కారణంగా మలబద్దకానికి గురికావల్సి వస్తుంది.

కొలెస్ట్రాల్:

కొలెస్ట్రాల్:

డీహైడ్రేషన్ ఉన్నప్పుడు శరీరంలో అధిక కొలెస్ట్రాల్ ఉత్పత్తి అవుతుందన్న విషయం మీకు తెలుసా? కాబట్టి, కొలెస్ట్రాల్ అరికట్టాలంటే, శరీరానికి సరిపడా నీరు త్రాగాలి.

అలర్జీలు:

అలర్జీలు:

డీహైడ్రేషన్ శ్వాససంబంధిత సమస్యలకు కూడా కారణం అవుతుంది . ఒంట్లో సరిపడా నీరు లేకపోతే బ్రీతింగ్ సమస్యలు లేదా అలర్జీలకు కారణం అవుతుంది.

అలసట:

అలసట:

మన శరీరంలో అన్ని అవయవాలు, చురుకుగా పనిచేయాలంటే ఇందనం కావాలి. అదే వాటర్ రూపంలో మనం మన శరీరానికి అందించే ఇందనం. ఈ ఇందనం శరీరంలో తగ్గింతే, ఎనర్జీలెవల్స్ తగ్గుతాయి. మెటబాలిక్ రేట్ తగ్గి దినచర్యలను ఆలస్యం చేస్తాయి. దాంతో మీరు అలసటకు గురి అవుతారు. కాబట్టి, నీరు కూడా శక్తినందించే ఆహారపానియంగా గుర్తించాలి.

బిపి:

బిపి:

డీహైడ్రేషన్ కు గురి అయినప్పుడు, మన శరీరంలో ఒక్కో సందర్భంలో బ్లడ్ ప్రెజర్ ఎక్కువుతుంటుందన్న విషయం మీకు తెలుసా?శరీరంలో నీరు తక్కువైనప్పుడు రక్తం కొద్దిగా చిక్కబడుతుంది. అది రక్తప్రసరణ మీద ప్రభావం చూపుతుంది. ఆ కారణంగా రక్తప్రసరణ పెరుగుతుంది.

చర్మ సమస్యలు :

చర్మ సమస్యలు :

శరీరంలో నీరు తగ్గినప్పుడు , శరీరంలోని టాక్సిన్స్ బయటకు నెట్టడం మీద ప్రభావం చూపుతుంది. అది చర్మం మీద ప్రభావం చూపుతుంది. దాంతో చర్మానికి సంబంధించిన డెర్మటైటిస్ మరియు చిన్నవయస్సులోనే ముడుతలు మరియు ఇతర సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది.

కిడ్నీ మీద ప్రభావం:

కిడ్నీ మీద ప్రభావం:

డీహైడ్రేషన్ వల్ల కిడ్నీలో వ్యర్థాలు నిలిచిపోయినప్పుడు, అది కిడ్నీఇన్ఫెక్షన్ కు కారణం అవుతుంది. కాబట్టి, శరీరంలోని వ్యర్థాలను కిడ్నీ నుండి బయటకు నెట్టివేయడానికి శరీరానికి సరిపడా నీరు అవసరం అవుతుంది.

జాయింట్ పెయిన్:

జాయింట్ పెయిన్:

శరీరంలో అన్ని అవయవాలతో పాటు, ఎముకలు కూడా స్ట్రాంగ్ ఉండాలన్నా, స్ట్రాంగ్ గా పనిచేయాలన్నా నీరు చాలా అవసరం అవుతుంది . వాటర్ సరిపడా శరీరానికి అందకపోతే జాయింట్ వీక్ అవుతాయి.

జీర్ణవ్యవస్థ:

జీర్ణవ్యవస్థ:

శరీరంలో కొన్ని మినిరల్స్ తో పాటు నీరు తగ్గినట్లైతే యాసిడ్ రిఫ్లెక్షన్ మరియు అల్సర్ సమస్యను ఎదుర్కోవల్సి వస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుచుకోవడానికి వాటర్ చాలా ముఖ్యం...

English summary

Does Dehydration Make You Fat?: Health Tips in Telugu

Does Dehydration Make You Fat?: Health Tips in Telugu, Is dehydration dangerous? Yes, very dangerous. We all know that we can't live without water. There is more to know. Dehydration causes several other problems. It can cause headaches and fatigue; it can affect your kidneys, skin and digestion too.
Story first published: Monday, October 12, 2015, 19:02 [IST]