Latest Updates
-
ఎండలకు నోటికి ఏదీ రుచించడంలేదా? అయితే కమ్మటి మునక్కాడ రసం'ట్రై చేయండి -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణీలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమేనా? -
వైవాహిక అత్యాచారం: పెళ్లి తర్వాత కూడా 'నో' చెప్పే హక్కు లేదా? చట్టాల్లో మార్పులు తప్పనిసరా? -
వాట్సాప్లో పెళ్లి పత్రికలు వస్తున్నాయా? ఈ ఒక్క తప్పు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ! -
చపాతీ, రైస్ దేనిలోకైనా పర్ఫెక్ట్ మ్యాచ్..అదిరిపోయే టమాటో చికెన్ గ్రేవీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వడదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు ఈ 'దేశీ' చిట్కాలు పాటించండి.. ఎండల నుంచి ఉపశమనం ఎలా? -
మండే ఎండలకు చెక్.. ఇంట్లో ఉండే పండ్లతోనే చల్లటి, క్రీమీ ఐస్ క్రీమ్ తయారీ! -
మీ చుట్టూ ఉన్న తేనె పూసిన కత్తులను ఎలా గుర్తించాలి? -
నీట్ యూజీ 2026 అడ్మిట్ కార్డులు వచ్చేస్తున్నాయి.. డౌన్లోడ్ చేసుకోవడం ఎలా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
జిమ్ వద్దు, కఠిన డైట్ వద్దు..3 నెలల్లో 12 కిలోలు తగ్గిన డాక్టర్ సీక్రెట్ ఇదే!
ఆరోగ్యానికి హాని కలిగించే హ్యాండ్ బ్యాగ్ లో ఉండే హానికర వస్తువులు
ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో ఫ్యాషన్ చాలా ఎక్కువగా ప్రాచుర్యం పొందినది. ముఖ్యంగా ఫ్యాషన్ అనేది ఒక ట్రెండీ దుస్తులతోపానే కాదు, జువెలరీస్, హ్యాండ్ బ్యాగ్స్ ...ఇలా రకరకాలుగా ఉన్నాయి. మహిళలు ఇలాంటి స్టైలిష్ యాక్సెసరీస్ తేకుండా ఎప్పడూ బయటకు వెళ్ళరు . ముక్యంగా క్యాండీ బ్యాగ్స్ వారి చేతులో ఖచ్చితంగాఉండాల్సిందే. మహిళలు తప్పనిసరిగా వినయోగించే వస్తువుల్లో హ్యాండ్ బ్యాగ్ ఒకటి.
ముఖ్యంగా కాలేజ్ గర్ల్స్ నుండి ఆఫీస్ వెళ్ళు మహిళలు, చివరకు హౌస్ వైఫ్స్ కూడా ఈ మద్యకాలంలో హ్యాండ్ బ్యాగ్స్ ను ఎక్కువగా వినియోగస్తున్నారు. మహిళల చేతిలో ఒక అందమైన పర్స్ లేకుండా అడుగు బయటపెట్టలేరు. ఎటువంటి సందేహం లేకుండా మీ వద్ద కూడా ఒక బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్ కలిగి ఉంటుంది. కలర్ ఫుల్ గా , చిన్నగా , పెద్దగా ...ప్రతి ఒక్కరి దగ్గరా ఉంటాయి. వాటిలో వారికి సంబంధించిన మేకప్ వస్తువులు, కార్డ్స్, డబ్బులు, కీస్, ఇంకా...వారికి ఏమేం అవసరం అవుతాయో అవన్నీ కూడా అందులో నింపేసి ఉంటారు. మీకు నచ్చిన..అవసరం అయిన వస్తువలన్నీకూడా అందులో నింపేయడానికి హ్యాండ్ బ్యాగ్స్ను తప్పని సరిగా వినియోగిస్తుంటారు.
అయితే, ఈ హ్యాండ్ బ్యాగ్ ల పించి మన ఆరోగ్యానికి కూడా కొంత హాని కలిగిస్తుందని చాలా మంది తెలియదు, మరియు గ్రహించలేరు. ఎందుకంటే హ్యాండ్ బ్యాగ్ లో మీకు తెలియకుండా ఆరోగ్యానికి హాని కలిగించే, మిమ్మల్ని అనారోగ్యానికి గురిచేసే కొన్ని వస్తువులను మీరు మోసుకెళుతుంటారన్న విషయం మీరు తెలుసుకుంటే ఆశ్చర్యం కలగకమానదు . ఈ విషయాలనుఅప్పుడప్పుడు, అక్కడక్కడా వినేఉంటారు . అయినా కూడా ట్రెండ్ మాత్రం అది మర్చిపోయి, వారి నచ్చిన హ్యాండ్ బ్యాగ్స్ ను సెలక్ట్ చేసేసుకుంటూ తీసుకెళుతుంటారు. చాలా ప్రదేశాలకు తీసుకెళ్ళడమే కాకుండా ఎక్కడ పడితే అక్కడ వాటిని క్రింద విడిచిపెట్టడం వల్ల క్రిములు చాలా సులభంగా గ్రహించేస్తుంది. షాకింగ్ విషయం ఏంటంటే, బ్యాగ్ యొక్క బయట వైపు, క్రింది భాగంలో అనేక క్రిములు చేరుతుంటాయి. మనకు కళ్ళకు కనిపించిన మైక్రో జెమ్స్ కూడా చెప్పలేనన్ని అంటిపెట్టుకొని ఉంటాయి. అదే విధంగా అవి మెల్లగా మీరు బ్యాగ్ లోపలకు, బ్యాగ్ లో ఉండే మీ వస్తువుల మీద చేరుతాయి. దాంతో మనకు తెలియకుండానే మనం అనారోగ్యానికి గురి అవుతుంటాము. ఇలా మన అనారోగ్యానికి గురిచేసే కొన్ని హ్యాండ్ బ్యాగ్ లో దాగిఉన్న వస్తువుల గురించి తెలుసుకుందాం:

వాటర్ బాటిల్స్
ఎటువంటి సందేహం లేదు, రోజూ ఎంత ఎక్కువగా నీరు త్రాగితే ఆరోగ్యానికి అంత మంచిదని మనకు తెలిసిన విషయం. కానీ, ఒకే బాటిల్ ను ఎక్కువ రోజులు ఉపయోగించడం, లేదా బాటిల్లో ఎక్కువ రోజుల నుండి నిల్వ ఉండే నీటిని త్రాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు . ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ నేప్తలీన్ అనే కెమికల్ ను ప్లాస్టిక్ మెటీరియల్స్ లో ఉంటుందని, ఇవి ఆరోగ్యానికి హానికలిగించే కెమికల్స్అని కొన్ని పరిశోధనలు నిరూపించాయి. ఈ ముఖ్యంగా ఈ కెమికల్స్ ఫెర్టిలిటి సమస్యలు మరియు హార్మోనుల అసమతుల్యతలకు కారణం అవుతుంది. ప్లాస్టిక్ బాటిల్లో నీటిని నిల్వ చేయడం వల్ల, నీటిలో కెమికల్స్ పెరుగుతాయి.
ఈ సమస్యలను నివారించుకోవడానికి ‘గ్లాస్ బాటిల్స్ 'ను ఉపయోగించుకోవచ్చు. గ్లాస్ బాటిల్స్ పగిలిపోతాయనుకుంటే, మెటల్ బాటిల్స్(అల్యూమినియం లేదా స్టెయిన్ లెస్ స్టీల్)వంటివి ఎంపిక చేసుకోవచ్చు. స్వచ్చమైన నీరు ఎక్కువగా త్రాగి సురక్షితంగా, హైడ్రేట్ గా ఉండాలి!

మనం ఉపయోగించే హ్యాండ్ కర్ఛీఫ్/ టిష్యుపేపర్స్
చాలా మంది మహిళలు, ముఖం మీద చెమటలు తుడుచుకోవడానికి, ముక్కు తుడుచుకోవడానికి, హ్యాండ్ కర్చీఫ్ లేదా టిష్యులను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.ఇలా ఉపయోగించిన అదే హ్యాండ్ కర్చీఫ్ కానీ, లేదా టిష్యులను కానీ తిరిగి బ్యాగ్ లో ఉంచుకుంటుంటారు. జలుబు మరియు ఫ్లూ వంటివి వైరస్ లో మిగిలిన టిఫ్యూ లేదా కర్ఛిఫ్ మొత్తం త్వరగా వ్యాప్తి చెందుతాయి. ఫలితంగా, మీరు బ్యాగ్ లో చేయి పెట్టిన ప్రతి సారి మీ చేతికి కళ్ళకు కనిపించిన మైక్రోబ్స్ లేదా సూక్ష్మ క్రిములు చేతికి అంటుకుంటాయి. అవి మీరు టచ్ చేసే లేదా పట్టుకొనే స్టెయిర్స్, రైల్స్ మరియు డోర్ హ్యాండిల్స్ మీద తిష్ట వేసి, ఇతరులకు చాలా సులభంగా వ్యాపింపచేస్తాయి.

కాస్మోటిక్స్
మీ లవ్లీ హ్యాండ్ బ్యాగ్ లో మీకు అవసరం అయ్యే అనేక మేకప్ స్టఫ్ ను నింపి ఉంచుతారు. సాధారణంగా మనం ప్రతి రోజూ పాడైన ఆహారాన్ని ఎలా పారేస్తుంటామో, అదే విధంగా ఎక్స్ పైర్ అయిన మేకప్ స్టఫ్ ను హ్యాండ్ బ్యాగ్ నుండి తొలగించాలి. డేట్స్ చూసి పాతవాటిని తొలగించి కొత్త వాటిని బ్యాగ్ లో పెట్టుకోవాల్సి ఉంటుంది , కనీసం 18 నెలకొకసారి మేకప్ వస్తువులను మార్చుతుండాలి . ఇలా చేయడం వల్ల మస్కరా ట్యూబ్స్ వంటి వాటి బ్యాక్టీరియా పెరగకుండా ఉంటుంది.

మొబైల్ ఫోన్స్:
మీరు హ్యాండ్ బ్యాగ్ లో తీసుకెళ్ళే మొబైల్ ఫోన్స్ వివిధ రకాల మానసిక మరియు శారీరక ఆరోగ్య సమస్యలు బ్రెయిన్ ట్యూమర్ మరియు ఇన్ ఫెర్టిలిటి వంటి ప్రమాధకర సమస్యలకు దారితీస్తుంది . ఇవే కాకుండా, మరికొన్ని ఇతర ఆరోగ్యాలకు కూడా ప్రమాధకరమైనవి. రెగ్యులర్ గా సెల్ ఫోన్ వినియోగించే వారు చాలా సాధరణంగా కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.

భారీ వస్తువులు
బయట వెళ్ళాలంటే, మహిళలు వారికి అవసరం అయ్యే వస్తువులను , భారీగా బ్యాగ్ లో నింపడం వల్ల ఉదా: చదువుకునే వస్తువులు, కాస్మోటిక్స్, ఎక్కువగా ఎలక్ట్రానిక్ వస్తువులు మరియు జిమ్ షూ వంటివి హ్యాండ్ బ్యాగ్ లో వేయడం వల్ల చాలా రకాల ప్రమాధకర ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఇది మీకు వెంటనే ప్రభావం చూపకపోయినా, నిధానంగా మెడనొప్పి, బ్యాక్ పెయిన్ మరియు కూర్చునే భంగిమ వంటి సమస్యలు తీవ్రతరం చేస్తుంది.



Click it and Unblock the Notifications