Latest Updates
-
నేడు వ్యతీపాత యోగం: ఈ తప్పులు చేస్తే భారీ నష్టాలు తప్పవు.. జాగ్రత్త! -
లలితా సహస్రనామం స్త్రీలు ఎందుకు ఈ పారాయణం చేయాలి? శుక్రవారం మహత్యం -
చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి క్రమశిక్షణతో పాటు అదృష్టం, సంపద రెట్టింపు! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 21 నుండి 27 జూన్ 2026 వరకు -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. భారీ లాభాలు! - ఆదివారం, 21 జూన్ 2026 -
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు! -
Chanakya niti: స్త్రీకి ఈ 4 గుణాలు ఉంటే ఇల్లు స్వర్గమే! -
మీ నాన్న ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఈ 3 రకాల గింజలు ఇవ్వండి -
ఓంకారం జపిస్తే ఏమవుతుంది? శాస్త్రాలు చెప్పిన ఆశ్చరికకర విషయాలు -
Father's day 2026: ఈ ఫాదర్స్ డే నాడు పిల్లల నుండి తండ్రులు నేర్చుకోవాల్సిన విషయాలు..
పెదాల ఇన్ఫెక్షన్ నివారించే 14 ఉత్తమ హోం రెమెడీలు
పెదాల ఇన్ఫెక్షన్ అంటే పెదాల పగుళ్ళు, పెదాల మీద గాయాలు, పుళ్ళు, బొబ్బలు, వాపు,పెదాల పూత వంటి లక్షణాలు మరియు పెదాల బయట లక్షణాలు ఉన్నాయి . ఇలాంటి లక్షణాలతో పెదాల ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు పెదాలు నొప్పిగాను మరియు కొన్ని సందర్భాల్లో రక్తస్రావం జరగుతుంది. అందుకు కారణం ఒత్తిడి లేదా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం కారణం కావచ్చు.
అదృష్టవశాత్తూ, ఇలాంటి పెదాల ఇన్ఫెక్షన్ నివారించుకోవడానికి కొన్ని ఉత్తమ హోం రెమెడీలు ఉన్నాయి,. వాటిని ఈ రోజు మీకోసం బోల్డ్ స్కై పరిచయం చేస్తున్నది...
పెదాల ఇన్ఫెక్షన్ కు మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. వైరల్ ఇన్ఫెక్షన్, విటమిన్ బి12, ఐరన్, జింక్, ఫోలిక్ యాసిడ్, ఆహారాలు లేదా ఎదైనా కెమికల్ అలర్జీ మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్ వంటివి కూడా కారణం కావచ్చు.
పెదాల ఇన్ఫెక్షన్ వల్ల పెదాలు సలపడం లేదా ఎక్కువగా నొప్పి అంటిపెట్టుకొని ఉండటం జరుగుతుంది . పెదాల నొప్పి చాలా బాధా కరంగా ఉంటుంది. దాని వల్ల మాట్లాడటానికి మరియు ఏదైనా తినడానికి చాలా కష్టంగా భావించాల్సి వస్తుంది.
మరి పెద3ాల ఇన్ఫెక్షన్ ను ఎలా తగ్గించుకోవాలి? ఈరోజు బోల్డ్ స్కై మీకోసం కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ను పరిచయం చేస్తున్నది. ఈ హోం రెమెడీ నొప్పినిన నివారిస్తుంది. ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. మరి ఆ నేచురల్ హోం రెమెడీస్ ఏంటో ఒక సారి చూద్దాం...

పెరుగు:
పెరుగులో మంచి బ్యాక్టీరియా(ప్రోబయోటిక్స్)ఎక్కువగా ఉంటాయి. ఇవి లిప్ ఇన్ఫెక్షన్ ను నివారిస్తాయి. ఇందులో యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉండి ఇన్ఫెక్షన్ ను నివారిస్తాయి . ఇది పెదాల సలుపు మరయు పెదాల అల్సర్ ను నివారిస్తాయి . ఇన్ఫెక్షన్ అయిన పెదాల మీద పెరుగును అప్లై చేస్తే నయం అవుతుంది.

సాల్ట్ వాటర్ గార్గిలింగ్ చేయడం
సాల్ట్ వాటర్ యాంటీ సెప్టిక్ గా పనిచేసి, పెదాల ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది. కొద్దిగా ఉప్పును గోరువెచ్చని నీటిలో వేసి బాగా మిక్స్ చేసి, నోట్లో పోసుకొని పుక్కలించుకోవాలి. ఇది నొప్పిని నివారిస్తుంది మరియు ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. ఈస్ట్ ఇన్ఫెక్షన్ ను అరికడుతుంది.

వెల్లుల్లి మరియు ఉల్లిపాయలు:
పెదాల యొక్క ఫంగల్ ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది. వీటిని అంతర్గతంగాను మరియు బహిర్గతంగాను ఉపయోగించుకోవచ్చు . ఉల్లి మరియు వెల్లల్లిని పేస్ట్ లా చేసి పెదాలకు అప్లై చేయాలి. అలాగే వీటిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

ఆముదం
లిప్ ఇన్ఫెక్షన్ నివారించే మరో నేచురల్ ఎఫెక్టివ్ హోం రెమడి ఆముదం. ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఒకటి లేదా రెండు చెంచాలా ఆముదంను వేడి పాలలో మిక్స్ చేసి త్రాగడంవల్ల ఉపశమనం కలుగుతుంది. అలాగే ఇది నొప్పినుండి ఉపశనం కలిగిస్తుంది మరియు ఇన్ఫెక్షన్ తగ్గించడంలో చికిత్సలా పనిచేస్తుంది . ఇది చాలా ఎఫెక్టివ్ లిప్ సోర్స్ ట్రీట్మెంట్ .

పాలు:
పగిలిన పెదాల మీద పాలు లేదా పాల మీగడను అప్లై చేయడం వల్ల ఇన్ఫెక్షన్ మరియు గాయాలను మాన్పుతుంది. నొప్పి కూడా తగ్గిస్తుంది మరియు ఇన్ఫ్లమేషన్ గా పనిచేస్తుంది.

గోల్డెన్ సీల్
గోల్డెన్ సీల్ మూలికను పేస్ట్ లా చేసి పెదాల మీద అప్లై చేయాలి. ఇది ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది మరియు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది . ఇందులో ఉండే బెర్బిరీన్ అనే అంశం యాంటీ ఫంగర్ లక్షణాలు పెదాల ఇన్ఫెక్షన్ మరియు ఫంగస్ ను నివారిస్తుంది.

పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయడం
ఇది చాలా ముఖ్యం, మీరు వ్యక్తిగత పరిశుబ్రత పాటించకపోతే, ఫంగల్ ఇన్ఫెక్షన్ మీ పెదాలను తిరిగా నాశనం చేస్తుంది. మీకు మంచి బ్యాలెన్స్ డైట్ చాలా అవసరం అవుతుంది. మంచి న్యూట్రీషియన్ ఫుడ్ ను తీసుకోవడం చాలా అవసరం

ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలి
ఫంగల్ లిప్ ఇన్ఫెక్షన్ నివారించడంలో ఐరన్ గ్రేట్ గా పనిచేస్తుంది. ఐరన్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, నువ్వులు, డైరీ ప్రొడక్ట్స్, ఆర్గాన్ మీట్ మరియు బెల్లం వంటివి ఎక్కువగా తీసుకోవాలి

ద్రవాలను ఎక్కువగా తీసుకోవాలి
ద్రవాలు ఎక్కువగా త్రాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ ను భయటకు నెట్టివేస్తుంది. ఇది ఇన్ఫెక్షన్ నివారిస్తుంది. మరియు ఇది పెదాలను తేమగా ఉంచుతుంది మరియు నొప్పి తగ్గిస్తుంది.

విటమిన్ సి
విటమిన్ సి చాలా త్వరగా ఎఫెక్టివ్ గా పెదాల పగుళ్ళు మరియు గాయాలను మాన్పుతుంది. ఇంకా ఇది పెదాల యొక్క ఇన్ఫెక్షన్ మరియు దంతక్షయాన్ని నయం చేస్తుంది. అన్ని రకాల సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉదా: నిమ్మరసం, స్ట్రాబెర్రీ, ఆరెంజ్, మరియు పైనాపిల్

పెదాలను కొరకడం మానేయాలి:
పెదాల కొరకడం తగ్గిస్తే పెదాల ఇన్ఫెక్షన్ మరియు పగుళ్ళు తగ్గుతాయి. పెదాల మీద పగుళ్ళు వల్ల ఇన్ఫెక్షన్ సోకుతుంది .

పసుపు పేస్ట్ :
బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి పసుపు పేస్ట్ చాలా గ్రేట్ గా సహాయపడుతుంది . ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. పెదాల మీద మరియు ముఖానికి పసుపు పేస్ట్ ను అప్లై చేయడం వల్ల పెదా నొప్పి మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

టీ ట్రీ ఆయిల్
టీట్రీ ఆయిల్లో యాంటీ సెప్టిక్ మరియు యాంటీ ఆన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది పెదాల పగుళ్ళు మరియు చర్మం పగుళ్ళను నివారిస్తుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. పెదాలకు తగినంత తేమను అందిస్తుంది. పెదాల మీద బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది.

కొబ్బరి నూనె
పెదాల మీద కొబ్బరి నూనె అప్లై చేయడం ద్వారా పెదాల ఇన్ఫెక్షన్ , వాపు, నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. ఇందులో క్యాప్రిలిక్ యాసిడ్ పెదాల మీద ఫంగస్ ను నాశనం చేస్తుంది.



Click it and Unblock the Notifications