Latest Updates
-
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి -
JEE మెయిన్ రిజల్ట్ టెన్షన్ ఉందా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే విజయం మీదే -
జంక్ ఫుడ్ వద్దు.. కుర్ కురేకి బదులు ఇంట్లోనే క్రిస్పీ బెండకాయ పకోడీ చేసుకోండిలా! -
పదే పదే నీళ్లు తాగుతున్నారా? సద్గురు చెబుతున్న ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి! -
బరువు తగ్గాలా? జిమ్ తర్వాత ప్రొటీన్ కావాలా? అయితే ఈ నల్ల శెనగల సలాడ్ మీ కోసమే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరుచుకోండి!
శరీర సమస్యలతో కలిగే ఇబ్బందులను నివారించడం ఎలా
మీరు ఏదైనా సమావేశంలో ఉన్నపుడు ఆపానవాయువు(పిత్తు) వచ్చినపుడు ఎలా అనుచుకుంటారు? లేదా చాలా ముఖ్యమైన సమావేశంలో ఉన్నపుడు మధ్యలో ఎక్కిళ్ళు వస్తే ఏమి చేస్తారు?
చర్మం దురద నుండి చెమటవాసన వరకూ, జీర్ణ సమస్యలు ఇలా అన్ని మన శరీరంలో ఆశ్చర్యం కలిగించే సమస్యలు ఏర్పడుతుంటాయి. సాధ్యమైన వంత వరకూ ఇలాంటి సమస్యలు మనం పబ్లిక్ లో రాకుడదని కోరుకుంటాం. అలాంటి వాటికి వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకోనట్లైతే దాలి ఫలితం: విపరీతమైన చిరాకు. అందువల్ల, అందరిలో ఈ చికాకును నివారించాలంటే, శరీర సమస్యలను నివారించే కొన్ని చిట్కాలను అనుసరించాలి, అయినా ఆ సమస్య తగ్గకపోతే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

1. హిర్సుటిసం (శరీరంపై జుట్టు)
శరీరంపై జుట్టు ఉండడం చాలా సహజం. కానీ ముఖంపై లేదా గుండెల మీద ఎక్కువ జుట్టు ఉంటె ఒక వేల మీరు స్త్రీ అయుంటే (చాలా అరుదుగా, మీరు పురుషుడైతే!) మీకేదో సమస్య ఉన్నట్లు. ఈస్ట్రోజేన్ అనే పురుష హార్మోన్లు అధికంగా ఉండడమే దీనికి కారణం.
ఏమి చేయాలి: వైద్య సదుపాయం పొందండి, ఈ విషయంలో స్వయం సేవ ప్రమాదం కావచ్చు. మీ వైద్యుడు కొన్ని మందులను లేదా చికిత్సలను సూచించవచ్చు, లేదా కొన్ని ఔషధ లేదా జుట్టును తొలగించే పద్ధతులను చేయవచ్చు.

2. ఎక్కిళ్ళు:
ఈ ఆకస్మిక ‘హిక్' శబ్దం ప్రతివారిలో ఉండే అత్యంత సహజమైన సమస్య. మనకు తెలియకుండా ప్రక్కటెముకలు సంకోచిస్తే ఎక్కిళ్ళు వస్తాయి.
ఏమి చేయాలి: ఒక గ్లాసు నీటిని త్రాగండి లేదా కొన్ని సెకండ్లు మీ శ్వాసను పట్టి ఉంచి, నిదానంగా శ్వాసను తీసుకుంటే మీ పక్కటెముకలు సద్దుమనుగుతాయి.

3. నోరు ఎండిపోవడం
నోటిలో ఉమ్మి తక్కువగా ఉండడం వల్ల నోరు ఎండిపోతుంది, దీనివల్ల మీరు ఎవరితోనైనా మాట్లాడుతూ ఉంటె చాలా ఇబ్బందిగా ఉంటుంది.
ఏమి చేయాలి: నీరు ఎక్కువగా తాగాలి, చక్కర లేని కాన్దీలను, గమ్ లను నమలాలి, మీరు పోగాత్రాగేవరైతే దానిని అదుపు చేయండి, కాఫిన్ ని తీసుకోవడం తగ్గించండి. పై ఏ చిట్కా మీకు పనిచేయక పోతే వైద్యుడి సలహా తీసుకోండి.

4. అహ్హ-ఛూ!
ఆపకుండా తుమ్ములు రావడం ఎక్కు విసుగు కలిగించే సమస్య. అది ఎలార్జీనా లేదా వైరల్ ఇంఫెక్షనా కారణం ఏదైనా కావచ్చు.
ఏమి చేయాలి: మీ తుమ్ములకు కారణం అలర్జీ, ఎందుకు అలర్జీ వచ్చిందో తెలుసుకోండి లేదా వైద్య సహాయం పొందండి.

5. చుండ్రు
తలపై తెల్లని పొట్టు రావడం చాలా సాధారణ, ఇది చాలా నిరాశపరిచే సమస్య. మీరు మీకు ఇష్టమైన నల్లని డ్రస్సు వేసుకుని బైటికి వెళ్ళినపుడు కొంతమంది మీ చుండ్రును గ్రహించడం మిమ్మల్ని విసుగుకు గురిచేస్తుంది.
ఏమి చేయాలి: మీరు తలస్నానం చేసే ముందు నిమ్మ రసాన్ని లేదా కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనెను అప్లై చేయండి, ప్రతిరోజూ మంచి చుండ్రును నివారించే షాంపూతో తలస్నానం చేయండి. అయితే, ప్రమాదకర చుండ్రుకు వైద్య సదుపాయం అవసరం, అందువల్ల మీరు చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించండి.

6. ఎక్కువ చమటలు
శరీరంలోని టాగ్జిన్లను తొలగించే సహజ మార్గం చమట, ఇది వివిధ చమట గ్రంధులను చల్లపరచి యునిసన్ పై పని చేస్తుంది. కానీ, ఈ చమట గ్రంధులు ఎక్కువగా పనిచేస్తే, దాని ఫలితమే అధిక చమట, ప్రత్యేకంగా మీరు ఏదైనా ఇంటర్వ్యూ లేదా మీటింగ్ లో ఉన్నపుడు దీనివల్ల కొద్దిగా విసుగువస్తుంది.
ఏమి చేయాలి: అధిక చమటను అధిగమించడానికి, గంజి మిశ్రమాన్ని లేదా బేకింగ్ సోడా కలిపిన నీటిలో చమట పట్టే ప్రాంతాన్ని ఉంచండి లేదా వైద్య సహాయం తీసుకోండి.

7. దుర్గంధం
సంభాషణ సమయంలో చెడు వాసన అనేది ఒక పెద్ద "టర్న్ ఆఫ్". ఇది మీ సామజిక జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. దీనికి చెడు నోటి పరిశుభ్రత లేదా జంక్ ఫుడ్ తీసుకోవడం; దారుణం, కారణం ఏదైనా వైద్య౦ చేయించుకోవడం అవసరం.
ఏమి చేయాలి: మంచి నోటి శుభ్రతను పాటించాలి; రోజూ కనీసం రెండుసార్లు పళ్ళు తోమాలి, మింట్ లు లేదా గమ్స్ లాంటివి ఏవైనా తిన్నవెంటనే మౌత్ వాష్ ను ఉపయోగించాలి. దీనితో మీ సమస్య తీరకపోతే పంటి వైద్యుడిని సంప్రదించండి.

8. వాసనతో కూడిన పాదాలు
ఎక్కువసేపు సాక్షులను ధరించే వారు చాలామంది ఈ సమస్యను ఎదుర్కుంటారు. ఇది షూ వేసుకున్నపుడు, చెమట సాక్సులలో నిలిచిపోవడం వల్ల వాసన వస్తుంది. మీరు ఒక సామజిక ప్రదేశం వద్ద మీ సాక్షులను వదలినపుడు ఆ దుర్గంధం మీకు చికాకును కలిగిస్తుంది. కొన్నిసార్లు, అది ఎంత చేదుగా ఉంటుందంటే, ఆ వాసనను భరించే వ్యక్తీ కూడా షూ వేసుకుని ఉంటె వారు ఈ దుర్గంధాన్ని పొందుతారు.
ఏమి చేయాలి: సింథటిక్ సాక్షులను ధరించరాదు. బదులుగా, చెమటను పీల్చే సాక్సులు ఉపయోగించండి, మీ పాదాలను ప్రతిరోజూ శుభ్రం చేసుకోండి, సాక్సులు ధరించే ముందు ఫుట్ స్ప్రే లేదా కొన్ని దుర్గంధం నిరోధించే స్ప్రేలను ఎంచుకోండి, లేదా సాక్సులకు బదులుగా చెప్పులు లేదా ఫ్లోతర్స్ ను ధరించండి.

9. మొటిమలు
పెద్దవాళ్ళు, పిల్లలు ఎక్కువగా ఎదుర్కునే సమస్య ఈ మొటిమలు, ఇవి హార్మోన్ల మార్పువల్ల, నూనె పదార్ధాలు ఎక్కువ తినడం వల్ల వస్తాయి.
ఏమి చేయాలి: ముఖంపై శ్రద్ధ పెట్టండి, ప్రతిరోజూ శుభ్రం చేయండి, మృత చర్మాన్ని అరికట్టడానికి మీ ముఖాన్ని మర్దనా చేయండి, మొటిమలు తగ్గకపోతే, నూనెతో కూడిన జంక్ ఫుడ్ ని మానేయండి. చర్మ సంబంధ నిపునుడిని సంప్రదించండి, కానీ మీ సమస్యకు పరిష్కారం దొరకకపోతే, మీకేదైనా హార్మోన్ల అసమానత ఉందా అని గుర్తించే నిపుణుడిని సంప్రదించండి.

10. చెమట వాసన
ఎండలో చాలాసేపు నడిచిన తరువాత లేదా సహజంగా చెమట పడుతుంది, కానీ చెమట ఎక్కువగా ఉన్నపుడు ఆలస్యం చేస్తే, చికాకుతో కూడిన పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది.
ఏమి చేయాలి: ఎక్కువ నీరు తాగాలి, యాంటీ పెర్స్పిరెంట్ స్ప్రేయ్, బాడీ పౌడర్ ని వాడాలి లేదా చెమట వాసనను తొలగించడానికి సహాయపడే కాటన్ దుస్తులను వాడాలి.

11 పగిలిన పెదాలు
పగిలిన పెదాలు మీ ముఖాన్ని పాడుచేస్తాయి. ఇది సాధారణంగా వేడి గాలి, ఎండలో ఉండడం వల్ల లేదా చాలా చల్లని వాతావరణం వల్ల ఏర్పడతాయి.
ఏమి చేయాలి: పెదాలు నాకడం వల్ల పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది; మంచి లిప్ బామ్ అప్లై చేయడం వల్ల పగిలిన పెదాలు ఉపశమనాన్ని పొందుతాయి.

12.పంటి గార
తెల్లని పళ్ళతో కూడిన మంచి దరహాసం మీ వ్యక్తిత్వానికి మెరుపునిస్తుంది. కానీ జంక్ ఫుడ్, పానీయాలను ఎక్కువ తీసుకోవడం వల్ల, మీ మెరిసే తెల్లని పళ్ళు గారపడతాయి.
ఏమి చేయాలి: బేకింగ్ సోడా లేదా స్ట్రాబెర్రీ తో కూడిన శుభ్రపరిచే టూత్ పేస్ట్ ని వాడండి. తిన్న ప్రతిసారీ మౌత్ వాష్ ను వాడండి లేదా మీ పళ్ళు మెరవడానికి పళ్ళ డాక్టరు సహాయం తీసుకోండి.

13. పిత్తులు!
మీరు గాస్ ను లోపల పట్టి ఉంచకపోతే, వాసనతో కూడిన పిత్తులు గాలిలో వదులుతారు, ఇవి ఆరోగ్యకర జీవనశైలిని పాటించకపోతే సంభవిస్తాయి.
ఏమి చేయాలి: తినే ఆహారాన్ని బాగా నమలండి, (ఎక్కువగా) బ్రోకోలి, కాలిఫ్లవర్, బీన్స్ వంటి ఆహారాన్ని మానండి, సరైన సమయంలో సరైన ఆహారాన్ని తినండి.



Click it and Unblock the Notifications











