Latest Updates
-
కూరలో నూనె ఎక్కువైందా? రుచి మారకుండా ఇలా ఈజీగా తీసేయండి! -
ఒక్క ముద్దలో లెక్కలేనన్ని ప్రయోజనాలు.. వయసు మళ్లినవారు తప్పనిసరిగా తినాల్సిన హెల్తీ కుర్మా.! -
చర్మ అలెర్జీలకు గుడ్ బై!.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని బెస్ట్ న్యాచురల్ రెమెడీస్ ఇవే! -
పైసా లేదని పెళ్లిళ్లు చేసుకోరు, కానీ పిల్లల్ని కంటారు.. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా.? -
తమిళుల ఆరోగ్య రహస్యం.. ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే తంజావూర్ అడై.. ఒక్కటి తిన్నా చాలు.! -
లాభ దృష్టి యోగం: సెప్టెంబర్ 15 తర్వాత ఈ నాలుగు రాశుల ఇళ్లలో ధనలక్ష్మి తిష్ట! -
కొవిడ్ ఇచ్చిన కిక్.. డిగ్రీ పట్టా లేదు, వ్యాపారం కాదు.. కానీ 20 ఏళ్లకే నెలకు రూ. లక్షల్లో ఆదాయం.! -
పచ్చిమిర్చి ఊరగాయ ఇలా చేస్తే..ఒక్క ముద్ద తినేవాళ్లు నాలుగు ముద్దలు లాగించేస్తారు! -
కౌమార దశలో బాలికలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏంటో తెలుసా.? -
చికెన్ బిర్యానీ తిన్నా షుగర్, బరువు పెరగకుండా ఉండాలంటే ఇలా చేయండి!
ప్రకృతితో స్నేహం.. మెరుగైన ఆరోగ్యానికి మార్గం
చల్లటి వాతావరణం.. ఆహ్లాదకరమైన ప్రకృతి.. సేద తీర్చే వెచ్చని గాలి.. ఇలాంటి క్లైమెట్ నేటి జనరేషన్ కి కరువైంది. ఎక్కడ చూసినా.. పెద్ద పెద్ద బిల్డింగులు, కాంక్రీట్ జంగిల్సే. భూతద్దం పెట్టి వెతికినా.. పచ్చని చెట్లు కనిపించని పరిస్థితి.
మారుతున్న కాలం ప్రకృతికి మానవునికి దూరాన్ని పెంచేస్తోంది. చుట్టూ చెట్లు ఉంటే.. ఉత్సాహంతోపాటు ఆరోగ్యమూ మెరుగుపడుతుంది. నిజమే చెట్ల మధ్యలో నివసిస్తే.. ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందంటున్నారు శాస్త్రవేత్తలు. శారీరక, మానసిక ఆరోగ్యం బావుంటుందని సూచిస్తున్నారు. చెట్ల మధ్యలో కానీ... అడవికి దగ్గరలో కానీ నివసిస్తే.. ఆ వాతావరణం చక్కటి మెడిసిన్ లా పనిచేస్తుందంటున్నారు. ఇంతకీ చెట్టూ చేమల మధ్య నివసిస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఓ సారి చూద్దాం..

స్వచ్ఛమైన గాలి
పచ్చని చెట్ల మధ్య నివసిస్తే... ఆహ్లాదకరమైన గాలి పీల్చుకోవచ్చు. కాలుష్యం లేని స్వచ్ఛమైన శ్వాస శరీరానికి అందుతుంది. చెట్ల ఆకులు గాలి కాలుష్యాన్ని గ్రహించడం వల్ల మనుషులకు శ్వాసకోస వ్యాధులుకు అవకాశముంటుంది. కాబట్టి ఎక్కువ చెట్లు ఉన్న ప్రాంతాలకు మకాం మార్చండి. లేదా మీ ఇంటి దగ్గర చెట్లు పెంచుకోండి.

జీవితకాలం పెరుగుతుంది
చెట్ల మధ్యలో నివసించడం వల్ల మనుషుల జీవితకాలం పెరుగుతుంది. చక్కటి వాతావరణంలో జీవిస్తే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. శరీరానికి కావాల్సిన శక్తి సహజసిద్ధంగా అందినప్పుడు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

త్వరగా కోలుకునే శక్తి
చెట్లకు దగ్గరలో నివసిస్తే.. ఎన్నో ప్రయోజనాలున్నాయి. వాటిలో ఇది ముఖ్యమైనది. చెట్ల మధ్య జీవించేవాళ్లు జబ్బుపడినా వెంటనే కోలుకుంటారు. ఏదైనా శస్త్రచికిత్స జరిగిన వాళ్లు లేదా అనారోగ్యంతో బాధపడేవాళ్లను చెట్లకు దగ్గరగా ఉండేలా జాగ్రత్తపడండి. కనీసం గదిలో నుంచి వ్యూ పాయింట్ చెట్లు చూసేలా ఉన్నా చాలు మంచి ఫలితం ఉంటుంది.

ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్
పచ్చని ప్రకృతి ఒడిలో జీవించే వాళ్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. కాంక్రీట్ బిల్డింగ్ ల మధ్య నివసించే వాళ్ల కంటే.. చెట్ల మధ్య నివసించే వాళ్ల ఆరోగ్యం చాలా బాగుంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. చెట్లకు దగ్గరగా గడిపే వాళ్లు.. ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్ వంటి వాటికి దూరంగా ఉన్నట్లు తేలింది.

ఒబేసిడీ, డయాబెటిస్ నివారణకు
పెద్ద పెద్ద భవనాలు, బిల్డింగ్ ల్లో నివసించే వాళ్లలో ఎక్కువగా స్థూలకాయం, డయాబెటిస్ బారిన పడుతున్నారు. అదే ఇంటి చుట్టూ చెట్లున్న వాళ్లకు ఈ సమస్యలు చాలా తక్కువ. ఎందుకంటే.. పచ్చని, ఆహ్లాదకర వాతావరణం.. వ్యాయాన్ని ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఇలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు.

చక్కటి నిద్రకు
చెట్లకు దగ్గరగా జీవిస్తుంటే.. మీకు నిద్రలేమి సమస్యలుండవు. హాయిగా నిద్రపోవచ్చు. నిద్రలేమి కారణంగా స్థూలకాయం, అనారోగ్య సమస్యలు, విడాకుల సమస్యలు వస్తాయట. గ్రీనరీ మధ్య జీవితం గడిపేవాళ్లకు చక్కటి నిద్ర ఉంటుంది. ముఖ్యంగా 65 ఏళ్ల వయసు దాటిన వారికి ఈ వాతావరణం చాలా మంచిది.

చెట్లు నాటండి
ఇంకే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న చెట్లను నిర్లక్ష్యం చేయకండి. మీ ఇంటి ముందో, కాంపౌండ్ లోనో, లేదా.. మీకున్న స్థలంలోనూ చెట్లు నాటండి.. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి. చెట్ల వల్ల కలిగే ప్రయోజనాలు లెక్కలేనన్ని ఉన్నాయి. గాలి కాలుష్యం తగ్గిపోతుంది. కరెంట్ బిల్లులు తగ్గిపోతాయి. అన్నిటికంటే ముఖ్యంగా.. స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించవచ్చు.



Click it and Unblock the Notifications
