Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
శరీరంను శుభ్రపరిచి శరీర ఆరోగ్యాన్ని చర్మ సౌందర్యాన్ని కాపాడే డిటాక్స్ ప్లాన్
డిటాక్సిఫికేషన్ వల్ల కళ్ళు మెరవడం, చర్మం కాంతులీనడమే కాకుండా, అధిక బరువును తగ్గించి జీర్ణశక్తిని మెరుగుపరిచి, శక్తి స్థాయిలను పెంపోదిస్తుంది.
మీరు మీ శరీరానికి ఒక బ్రేక్ ఇచ్చి, మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి అనుకుంటే, సర్టిఫైడ్ హెల్త్ కోచ్, IIN, US, సర్టిఫైడ్ హోలిస్టిక్ నుట్రిషన్ తెరపిస్ట్ SNHS, UKఅయిన సైదా కిరణ్ జాహ్ర హుసైన్ వారి చే చెప్పబడిన ఈ 7 రోజుల డిటాక్స్ ప్రణాళికను అనుసరించండి.
READ MORE: శరీరంలోని వ్యర్థాలు-మలినాలు బయటకు నెట్టివేయలా?
ఏమి చేయాలి?
ఒక డైరీ ని ప్రారంభించి మీరు బైట ఎక్కడా తినకుండా ఉండే ఒక వారం ఎంచుకోండి. నిజానికి ఇది అంత తేలిక కాదు, కానీ భయపడొద్దు. ప్రణాళికకు కట్టుబడి ఉండండి.

తీసుకోకూడని పదార్ధాలు
సిగరెట్లు ఆల్కహాల్ పాల ఉత్పత్తులు (ప్రతిరోజూ అసిడోఫిలస్ తో సాధారణ పెరుగు కేవలం అర కప్పు) కాఫీ పంచదార, తేనె, కృత్రిమ స్వీట్లు, మాపల్ సిరప్ స్పెల్ట్, బార్లీ, ఓట్స్, రాగి, గోధుమ (బేకరీ పదార్ధాలు), బియ్యం డ్రైడ్ ఫ్రూట్స్ వంటి గింజలు

ఎంచుకోవాల్సిన పదార్ధాలు
సన్నని చర్మం తీసిన చికెన్, ఎర్ర మాంసం (వారానికి 2 సార్లు) ఆర్గానిక్ గుడ్లు ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె గింజలు (ఉప్పులేని పచ్చి బాదంపప్పు) గింజలు వైట్ టీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ తాజా కూరలు, పండ్లు చేప (ఆలివ్ ఆయిల్ లేదా నీటిలో ఉన్న తాజా రకం) నీరు

ఉదయం నిమ్మరసం నీరు తాగండి
ఇది మీ వ్యవస్థ ను శుభ్రపరచి, మీ జీర్ణ వ్యవస్థని ఉత్తేజితం చేస్తుంది. ఒక కప్పు వేడి నీటిలో సగం నిమ్మ రసాన్ని కలిపి, ఉదయానే పరగడుపున త్రాగండి.

వ్యాయామం
ప్రతిరోజూ 30-45 పాటు కనీసం వ్యాయామం చేయండి. మీరు నడవడం, యోగా, పరిగెట్టడం లేదా జిమ్ కి వెళ్ళడం వంటి ఎటువంటి వ్యాయామాన్నైనా చేయవచ్చు. మీకు ఇష్టమైన ఇదొక దాన్ని ఎంచుకుని, దానికి వెళ్ళండి.

పచ్చి ఆహారాన్ని తినండి
పచ్చి ఆహరం తినడం చాలా మంచిది, దీనివల్ల సమయం ఆదా అవుతుంది. అంతేకాకుండా, వాటిలో ఎంజైమ్ లు, పోషకాలు అధికంగా ఉంటాయి.

మానసిక ఆరోగ్యం
మీరు శరీరానికి డిటాక్స్ చేస్తుంది, కొద్దిగా మనసుకు కూడా చేయండి. ప్రతిరోజూ 15 నిమిషాలు ధ్యానం చేసి మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. మీకు ధ్యానం చేయడం తెలియకపోతే, నిండుగా శ్వాసను తీసుకోవడం, వదలడం చేయండి.

ఎక్కువ నీరు త్రాగండి
ప్రతిరోజూ 3 లీటర్ల కంటే ఎక్కువ ద్రవాలను త్రాగండి. ఇది కిడ్నీని శుభ్రపరచి, రక్తం కదలడానికి సహాయపడుతుంది. మీరు హెర్బల్ డిటాక్స్ టీ, తాజా కూరగాయల రసం, ఫిల్టర్ చేసిన నీటిని కూడా త్రాగవచ్చు.

మీ శరీరాన్ని రుద్దండి
లూఫా తో లేదా సహజ ఫైబర్ బాడీ బ్రష్ తో మీ చర్మాన్ని బాగా రుద్దే అలవాటు చేసుకోండి, ఇది మీ చర్మాన్ని మురికి నుండి తొలగించి, రక్తప్రసరణ మెరుగుపడడానికి సహాయపడుతుంది. కానీ కళ్ళు అలంటి సున్నితమైన ప్రదేశాలలో అలా చేయకండి. ఒకసారి రుద్ది, చల్లని నీటితో వెంటనే కడిగేయండి, ఇది చర్మంలో రక్తప్రసరణ మెరుగుపడడానికి సహాయపడుతుంది.

బాగా నమలడం
మీరు ఆహారాన్ని మింగే ముందు బాగా నమలండి. ఆహరం బాగా నమిలి తింటే, మీరు తీసుకున్న ఆహరం బాగా జీర్ణమై, ఎక్కువ తీసుకోవడాన్ని అరికడుతుంది.



Click it and Unblock the Notifications
