For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెన్ను నొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగించే సింపుల్ టిప్స్

|

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. అందుకు ముఖ్య కారణం జీవనశైలి మరియు పనిచేసే సమయంలో కూర్చినే భంగిమ సరిగా లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితిని ఎందుర్కోవల్సి వస్తుంది. అంతే కాదు మనం ప్రతి దినం తీసుకొనే ఆహారంలో పోషకాలు లోపించడం మరియు క్యాల్షియం మరియు న్యూట్రీషియన్స్ శరీరానికి సరిగా అందకపోవడం వల్ల వల్ల కండరాలు మరియు ఎముకల్లో శక్తి లోపించి నొప్పులకు దారితీస్తాయి.

ఆఫీసుల్లో పనిచేసే వారు ఎక్కువ సమయం పాటు కూర్చొని ఉండటం వల్ల , మరియు శరీరం మీద ప్రమేయం లేకుండా ఎటుపడితే అటు కూర్చోవడం వల్ల నొప్పి మొదటి చిన్నగా ప్రారంభమై, తీవ్రస్థితికి దారితీస్తుంది . అది కూడా న్యూట్రీషియన్స్, మరియు క్యాల్షియం ఎముకల్లో తగ్గడం వల్లే అని చెప్పవచ్చు . అంతే కాదు, అధిక బరువు ఉండటం, ఆర్థరైటిస్, మోనోపాజ్(మహిళల్లో)మరియు కొన్ని రకాల సర్జరీల వల్ల కూడా వెన్నులో నొప్పిక కారణం అవుతుంది. వెన్నునొప్పి భాదిస్తోందా? ఇవిగో ఉపమశమన మార్గాలు

ఈ బ్యాక్ పెయిన్ ను వెంటనే తగ్గించుకోవడానికి మీ చెవులకు ఇంపైన్ ఒక శుభవార్త ఉంది. ఎలాంటి మెడిసిన్స్ ఉపయోగించకుండానే ఈ సింపుల్ టిప్స్ ను ఫాలో అయితే బ్యాక్ పెయిన్ అనే మాటే మీ నోటి వెంట రాదు. మరి బ్యాక్ పెయిన్ నుండి తక్షణ ఉపశమనం కలిగించే ఆ చిట్కాలు ఏంటో ఒకసారి చూద్దాం..బాడీపెయిన్స్ ను తగ్గించే మంచి ఆహారాలు...

బెడ్ రెస్ట్ పరిమితం చేయాలి:

బెడ్ రెస్ట్ పరిమితం చేయాలి:

లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు ఎక్కువగా విశ్రాంతి తీసుకోకూడదు . మూడు రోజుల కంటే ఎక్కువగా బెడ్ రెస్ట్ తీసుకోవడం వల్ల బ్యాక్ పెయిన్ కు దారితీస్తుందని కొందరి పరిశోధనల ద్వారా నిర్ధారణ అయినది.

గోధుమ గడ్డి జ్యూస్:

గోధుమ గడ్డి జ్యూస్:

గోధుమ గడ్డి జ్యూస్ త్రాగడం వల్ల కండరాలు బలోపేతం అవుతాయి. మరియు నరాలు రిలాక్స్ చేస్తుంది మరియు స్పైనల్ కార్డ్ ఫ్లెక్సిబుల్ గా మార్చతుంది. గోధుమ గడ్డిలో న్యూట్రీషియన్స్ అధికంగా ఉండటం వల్ల వెన్ను నొప్పి నుంది తక్షణం ఉపశనం కలిగిస్తుంది.

కూర్చొనే భంగిమ సరిగా ఉండాలి:

కూర్చొనే భంగిమ సరిగా ఉండాలి:

లోయర్ బ్యాక్ మరియు చేయిర్ కు మద్య పిల్లో(కుషన్)ను అమర్చుకోవడం మంచిది. షోల్డర్ ను రిలాక్స్ గా ఉంచి నిటారుగా కూర్చోవడం వల్ల చెయిర్ మీ బ్యాక్ కు సపోర్ట్ గా ఉంటుంది. ఎక్కువ సమయంలో వెనుకకు బెండ్ అవ్వకుండా నిటారుగా కూర్చోవాలి.

 గాఢ నిద్ర:

గాఢ నిద్ర:

బ్యాక్ పెయిన్ నివారించడానికి మంచి నిద్ర అవసరం. మజిల్స్ రిలాక్స్ అవ్వడానికి మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవడానికి నిద్ర చాలా అవసరం అవుతుంది . బ్యాక్ పెయిన్ నివారించడానికి ఇది ఒక సింపుల్ చిట్కా.

 వ్యాయామం:

వ్యాయామం:

సరైన విశ్రాంతి తీసుకోవడం, వ్యాయామం చేయడం వల్ల బ్యాక్ పెయిన్ ను నివారించుకోవచ్చు . అలాగే కూర్చొనే స్ట్రెచ్చింగ్ మరియు నిధానంగా నడవడం వంటి చిన్న చిన్న వ్యాయామాలు రెగ్యులర్ గా చేస్తుండాలి . ఇలాంటి చిన్న చిన్న వ్యాయామాలే మీ కండరాలను బలోపేతం చేస్తుంది మరియు బ్యాక్ పెయిన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది.

యోగ:

యోగ:

బ్యాక్ పెయిన్ కు యోగ ఒక బెస్ట్ నేచురల్ హోం రెమెడీ. ఇది కొద్ది రోజుల్లోనే తక్షణ ఉపశమనం కలిగిస్తుంది . యోగ వల్ల శ్వాస మెరుగవుతుంది మరియు ఎఫెక్టివ్ బ్రీతింగ్ వల్ల మజిల్ టెన్షన్ తగ్గి బ్యాక్ పెయిన్ నుండి ఉపశమనం కలుగుతుంది.

 కాంఫ్రె హెర్బ్:

కాంఫ్రె హెర్బ్:

కాంఫ్రే మూలికం యొక్క రసాన్ని బ్యాక్ పెయిన్ ఉన్నచోట అప్లై చేస్తే కొన్ని గంటల్లోనే ఉపశమనం కలుగుతుంది . ఇందులో ప్రోటీన్స్, విటమిన్స్, మరియు మినిరల్స్ అధికంగా ఉండటం వల్ల బ్యాక్ పెయిన్ ను నివారిస్తుంది

 క్యాల్షియం అండ్ మెగ్నీషియం:

క్యాల్షియం అండ్ మెగ్నీషియం:

మీరు తీసుకొనే ఆహారంలో క్యాల్షియం మరియు మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల బ్యాక్ పెయిన్ నుండి ఉపశమనం కలుగుతుంది . గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, గుడ్డు, పాలు, అరటిపండ్లు, నట్స్, ఆపిల్స్, ఫిగ్స్, మొదలగునవి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

హీట్ ట్రీట్మెంట్:

హీట్ ట్రీట్మెంట్:

బ్యాక్ పెయిన్ నుండి తక్షణ ఉపశమనం పొందడానికి హాట్ వాటర్ బ్యాగ్ తో కాపడం పెట్టుకోవాలి. ఇది బ్లడ్ సర్కులేషన్ పెంచుతుంది. నొప్పి నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది.

షులు:

షులు:

మీకు సౌకర్యవతంగా మరియు ఫ్లాట్ గా ఉన్న షులను ధరించడం వల్ల వెన్ను నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు . మీ షుల మీకు సౌకర్యవంతంగా లేకపోతే కూడా వెన్ను నొప్పికి దారితీస్తుంది.

English summary

Simple Tips To Relieve Backache in Telugu

Simple Tips To Relieve Backache in Telugu. The good news is that you can relive your back pain without the help of medicines. Follow these simple tips to relieve your back pain. Have a look at some simple tips to relieve back pain.
Story first published: Tuesday, June 9, 2015, 18:22 [IST]
Desktop Bottom Promotion