Latest Updates
-
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.! -
అసలు రోజుకు ఎంత ప్రోటీన్ తినాలి? మన శరీరానికి ఎంత అవసరం? -
ఆవకాయ, నిమ్మకాయ బోర్ కొట్టిందా? అయితే ఈ వెరైటీ బంగాళదుంప ఊరగాయ ట్రై చేయండి! -
మైదా లేకుండా సమోసాలను మించిన రుచితో ఉల్లి కచోరీ.. ఇలా చేస్తే ఎన్ని తిన్నా బోర్ కొట్టదు.! -
సాయంత్రం వేళ ఇంట్లో ఎన్ని దీపాలు వెలిగించాలి?అష్టైశ్వర్యాలు తెచ్చే అద్భుతమైన మార్గం.. -
చేతి గోళ్లు ఇలా ఉంటే కిడ్నీల ఆరోగ్యానికి వార్నింగ్.. మీకూ ఇలా ఉందా.? -
ఈ పద్ధతిలో అల్లం చట్నీ చేస్తే.. ఎవరైనా సరే నాలుగు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి సొరకాయ దోశ..అప్పటికప్పుడు ఈజీగా చేసుకోండిలా.. -
మంచి భర్త కోసం ఉపవాసం చేస్తున్నారా.. కానీ శివారాధనలో అమ్మాయిలు చేసే పొరపాట్లు ఇవే.!
ఒత్తిడికి కారణం అయ్యే హార్మోనులు తగ్గించే సులభ మార్గాలు
మనల్ని సంతోషంగా ఉంచడానికి మన మెదడులో కొన్ని రసాయనాలు బాధ్యత వహిస్తాయి. కొన్ని పరిస్థితుల్లో అంటే డిప్రెషన్ వంటి పరిస్థితుల్లో ఈ రసాయనాల స్థాయి తగ్గుతుంది . స్ట్రెస్ హార్మోనైన కార్టిసోల్ అనే ఒత్తిడి హార్మోన్లు కూడా ఒత్తిడి మరియు ఆందోళనపైన ఒక పాత్రను పోషిస్తాయి. ఇలాంటి స్ట్రెస్ హార్మోనులు తగ్గించుకోవడానికి కొన్ని అద్భుతమైన మార్గాలున్నాయి. వాటిని ఈ రోజు మీతో పంచుకుంటున్నాము.
ఒత్తిడి తగ్గించుకోవడానికి మరియు మనల్ని సంతోషంగా ఉంచే సెరోటోనిన్ అనే హార్మోన్సును మెదడులో పెంచడానికి మన శరీరం శిక్షన కలిగి ఉండాలి. అదే సమయంలో కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ స్థాయిలను తగ్గించుకోవడానికి కొన్ని మార్గాలున్నాయి . ఈ స్ట్రెస్ హార్మోన్స్ శరీరానికి చాలా హాని కలిగిస్తాయి.
READ MORE: సంతోషానికి-ఈ ఆహారాలకు మద్య ఉన్న సంబంధమేమి..?
స్ట్రెస్ హార్మోన్స్ నేచురల్ గా తగ్గించుకోవడం ఎలా? కొన్ని ఎఫెక్టివ్ మార్గాలను మీకోసం ఈక్రింది విధంగా తెలుపుతున్నాము. వీటిని పరిశీలించి ఒత్తిడికి కారణం అయ్యే కార్టిసోల్ స్తాయిని తగ్గించుకొని సంతోషకరమైన జీవితాన్ని పొందండి...

డార్క్ చాక్లెట్:
మీకు నీరసంగా అనిపిస్తే, మీరు చాక్లెట్ తీసుకోండి. దీనిలోని చక్కెర ఎండార్ఫిన్ లెవెల్స్ ను ఉత్తేజపరిచి, మీ మెదడుయొక్క సహజ హార్మోన్స్ ను పెంచి మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది.

ఓమేగా ఫ్యాటీ యాసిడ్స్:
ఫ్యాటీ ఫిష్ సాల్మన్, తున మరియు సార్డిన్స్ మరియు హెరింగ్ వంటి చేపలను రెగ్యులర్ గా తినాలి . వీటలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి . ఇవి మెదడులో సంతోషం కలిగించే డోపమైన్ అనే హార్మోనులు పెంచుతాయి మరియు కార్టిసోల్ హార్మోన్ డ్యామేజ్ కాకుండా తగ్గిస్తాయి.

సిట్రస్ ఫ్రూట్స్ :
ఒత్తిడి తగ్గించడంలో ఒక ఉత్తమ రెమెడీ విటమిన్ సి . దీన్ని ఆరెంజ్, లెమన్, స్ట్రాబెర్రీస్ మరియు పైనాపిల్ వంటి వాటిలో ఎక్కువగా కనుగొనడం జరిగింది . స్ట్రెస్ హార్మోన్స్ ను తగ్గించుకోవడానికి సిట్రస్ పండ్లను ఎక్కువగా తీసుకోవాలి.

మెడిటేషన్:
మనస్సును మరియు ఆత్మను ప్రశాంతంగా ఉంచుకోవడం వల్ల ఒత్తిడి తగ్గించుకోవచ్చు. ఇది స్ట్రెస్ హార్మోనుల యొక్క ప్రభావాన్ని తగ్గిస్తుంది . మెడిటేషన్ చేయడం వల్ల ఒత్తిడి స్థాయిలు తగ్గించుకోవచ్చు . స్ట్రెస్ హార్మోన్స్ తగ్గించుకోవడానికి ఇది ఒక ఉత్తమ మార్గం.

శ్వాస డీప్ గా తీసుకోవాలి:
లోతుగా ఉశ్చ్వాస నిశ్చ్వాసలు తీసుకోవడం వల్ల ఒత్తిడికి కారణం అయ్యే కార్టిసోల్ లెవల్స్ ను తగ్గిస్తాయి . దాంతో మీలో ఒత్తిడి మరియు ఆందోళను తగ్గిస్తాయి . డీప్ బ్రీత్ వల్ల మీలో బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది .

నవ్వడం:
ఒంటరిగా ఉన్నా చాలు నవ్వుతుంటే మెదడకు చాలా ఉపశమనంగా మరియు విశ్రాంతిగా ఉంటుంది . దాంతో మెదడులో హ్యాపి కెమికల్స్ విడుదత అవుతుంది దాంతో స్ట్రెస్ హార్మోనులను తగ్గించుకోవచ్చు . ఒత్తిడి వల్ల ఆందోళన అసటకు కారణం అవుతుంది . కాబట్టి, నవ్వడం ఒక ఉత్తమ మార్గం.

టీ త్రాగాలి:
మెదడు విశ్రాంతి పొందడానికి మరియు హ్యాపిగా ఉండటానికి మెదడులో కెమికల్స్ ను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది . కార్టిసోల్ స్థాయి తగ్గించుకోవడానికి ఇది ఒక నేచురల్ మార్గం.

వ్యాయామం:
చిన్న పాటి వ్యాయామాలు చేయడం వల్ల మెదడులో ఎండోర్ఫిన్ విడుదలయ్యి, మిమ్మల్ని హ్యాపిగా ఉంచుతుంది . ఇది ఒత్తిడికి కారణం అయ్యే హార్మోనల్ ఎఫెక్ట్స్ ను తగ్గిస్తుంది.



Click it and Unblock the Notifications