Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
సమ్మర్లో కామన్ కోల్డ్ నివారించే ఎఫెక్టివ్ అండ్ ఇన్ ఎక్స్ పాన్సివ్ హోం రెమెడీస్
కొన్ని సందర్భాల్లో జలుబు చాలా ఇబ్బంది పెడుతుంటుంది. ముఖ్యంగా వింటర్లో కంటే సమ్మర్లో వచ్చే జలుబు మరింత ఇబ్బంది కలిగిస్తుంది. అలాంటప్పుడు వేసవి ఉపశమనం కోసం మీరు తీసుకొనే ఐస్ క్రీమ్ లకు మరియు సాఫ్ట్ డ్రింక్స్ కు దాదాపు దూరంగా డండాల్సి వస్తుంది .
డీహైడ్రేషన్ తగ్గించటానికి 10 ఆరోగ్యకరమైన వేసవి పానీయాలు
మరి వేసవిలో సాధారణ జలుబు చేస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? వేసవిలో వచ్చే జలుబును ఎలా నివారించుకోవాలి ? డాక్టర్ ను కలిసి డబ్బు వ్రుదా చేసుకోవడమేనా...?
ఎండవేడిమి, వడదెబ్బ తట్టకోవడానికి టాప్ 12 సమ్మర్ డ్రింక్స్
ఖచ్చితంగా నో అనే చెప్పవచ్చు. సమ్మర్లో వచ్చే సాధారణ జలుబు నివారించుకోవడానికి ఇంగ్లీష్ మెడీసిన్స్ కు బెటర్ ఆల్టర్ నేటివ్ కొన్ని అమేజింగ్ హోం రెమెడీస్ ఉన్నాయి. ఇవి చౌకైనవి మరియు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. మరి సమ్మర్ కోల్ట్ ను నివారించే హోం రెమెడీస్ ఏంటో ఒక సారి తెలుసుకుందాం....

వెల్లుల్లి:
వెల్లుల్లి యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఇమ్యూన్ సిస్టమ్ ను మెరుగుపరుస్తుంది మరియు శరీరంలోని టాక్సిన్ ను నివారిస్తుంది. వెల్లుల్లిని వివిధ రకాలుగా ఉపయోగించి సమ్మర్ కోల్డ్ ను నివారించుకోవచ్చు.
అందుకు మీరు చేయాల్సింది ఒక వెల్లుల్లి రెబ్బ, 2చెంచాలా నిమ్మరసం, ఒక చెంచా తేనె మరియు 1/2చెంచా కారం తీసుకోవాలి. వీటన్నింటిని నీటిలో మిక్స్ చేసి ఈ లిక్విండ్ ను రోజూ త్రాగాలి. కామన్ కోల్ట్ తగ్గే వరకూ తాగవచ్చు . నీటిని బాగా వేడి చేసిన అందులో ఒక టీస్పూన్ తేనె వేసి ఈ జ్యూస్ ను రోజులో రెండు మూడు సార్లు త్రాగాలి.

తేనె:
సాధారణ జలుబుకు కారణం అయ్యే యాంటీబ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు తేనెలో పుష్కలంగా ఉన్నాయి. మరి తేనెను ఏవిధంగా తీసుకోవాలో చూద్దాం..
1. 2చెంచాల తేనె , 1 చెంచా నిమ్మరం మిక్స్ చేసి రోజులో రెండు లేదా మూడుసార్లు త్రాగాలి.
2. మార్నింగ్, ఈవెనింగ్ స్పూన్ ఫుల్ తేనె కూడా తినొచ్చు.

స్పైస్ టీ :
సమ్మర్ కోల్డ్ నివారించడానికి స్పైస్ టీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
స్పైస్ టీ తయారికి కావల్సినవి: 1/4కప్పు ధనియాలు, 1/4కప్పుటీస్పూన్, 1/2టీస్పూన్ జీలకర్ర, 1/2టీస్పూన్ సోంపు తీసుకొని వీటన్నింటిని లైట్ గా ఫ్రై చేసి పెట్టుకోవాలి.
2. తర్వాత ఒక కప్పు నీటిని పాన్ లో వేసి బాయిల్ చేయాలి. అందులో వేయించుకొన్న వాటిని కొద్దిగా వేసి, రాక్ క్యాండీన 2 టీస్పేన్స్ వేసి మొత్తం మిశ్రమం 5నిముషాలు వేడి చేయాలి . ఈ డ్రింక్ బాగా బాయిల్ అయిన తర్వాత ఫిల్టర్లో స్టెయినర్ ను వేయాలి. దీన్ని రోజులో అప్పుడప్పుడు త్రాగుతుంటే కామన్ కోల్డ్ తగ్గిపోతుంది.

అల్లం:
అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి, మీరు పచ్చి అల్లంను తీసుకోవచ్చు లేదా రోజులో అల్లం టీని 2 లేదా 3 సార్లు తీసుకోవడం మంచిది . అల్లం, ఉప్పు, లవంగాలను మెత్తగా పేస్ట్ చేయాలి ఈ పేస్ట్ ను రోజులో రెండు సార్లు త్రాగితే మంచి ఫలితం ఉంటుంది.

చికెన్ సూప్ :
చికెన్ సూప్ లో పోషకాలు మరియు విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది కామన్ కోల్డ్ ను నివారిస్తుంది. దీన్ని యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేసి హీలింగ్ ప్రొసెస్ ను కలిగి ఉంటుంది.

రెడ్ ఆనియన్:
ఎర్రని ఉల్లిపాయలతో సిరఫ్ తయారుచేసుకొని తీసుకోవడం వల్ల కామన్ కోల్డ్ నివారించబడుతుంది. అందుకు రెండు మూడు ఎర్రని ఉల్లిపాయలు తీసుకొని వాటిని సన్నగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్లైడ్ రెడ్ ఆనియన్ పెట్టాలి. దానికి మీద తేనె వేయాలి. ఇలా తిరిగి రిపీట్ చేయాలి . తర్వాత బౌల్ మూత పెట్టాలి. 12గంటల పాటు తేనెలో ఉల్లిపాయ బాగా నాననివ్వాలి. 12 గంటల తర్వాత ఈ చిక్కటి రెడ్ ఆనియన్ సిరఫ్ త్రాగాలి.

పెప్పర్:
పెప్పర్ లో క్యాప్ససిన్ అనే కంటెంట్ ఉంటుంది. ఇది ముక్కుదిబ్బడ నుండి ఉపశమనం కలిగిస్తుంది . కేవలం పెప్పర్ స్మెల్ చూడటం వల్ల కూడా కామన్ కోల్డ్ నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే మిరియాల పొడిని మీరు తీసుకొనే ఆహారాల మీద స్ప్రింకిల్ చేయాలి.

ముల్లెయిన్ టీ:
ముల్లియన్ టీలో ఎక్సపక్టరెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది ముక్కుదిబ్బడ నుండి ఉపశమనం కలిగిస్తాయి.
అందుకు మీరు చేయాల్సిందల్లా ముల్లియన్ టీ ఆకులను స్టెయినర్లో తీసుకోవాలి . ఈ స్ట్రెయినర్లో ఒక కప్పు హాట్ వాటర్ వేసి ఉంచాలి. 10-15నిముషాలు ఉండనిచ్చి , దీనికి తేనెను మిక్స్ చేసి, రోజులో రెండు లేదా మూడు సార్లు త్రాగవచ్చు.

పాలు:
పాలు, పసుపు, మరియు అల్లం కాంబినేషన్లో తీసుకొనే డ్రింక్ కామన్ కోల్డ్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . కామన్ కోల్డ్ తో పాటు తలనొప్పి , వాటరీ ఐస్ ను కూడా నివారిస్తుంది.

దాల్చిన చెక్క:
కామన్ కోల్డ్ ను నివారించుకోవడానికి దాల్చిన చెక్కను ఉపయోగించుకోవచ్చు. అందుకు మీరు చేయాల్సింది 1 బేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ తీసుకొని , దానికి 2 లవంగాలుచేర్చి ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి తర్వాత5-10నిముషాలు చల్లార్చి వడగట్టి ఈ సిరఫ్ ను రోజులో రెండు మూడు సార్లు త్రాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.



Click it and Unblock the Notifications











