Latest Updates
-
ప్రెగ్నెన్సీ సమయంలో యోగా, స్ట్రెచింగ్ చేయవచ్చా.?.. గర్భిణీలు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే.! -
రెస్టారెంట్ రుచితో కరకరలాడే షెజ్వాన్ చికెన్ లాలీపాప్.. మీ ఇంట్లోనే చేసేయండిలా.. -
పరగడుపున నానబెట్టిన మెంతులు తింటే.. ఈ 5 అద్భుత ప్రయోజనాలు మీ సొంతం! -
గుడ్డిగా నమ్మి మోసపోకండి.. రిలేషన్ షిప్స్ పై చాణక్యుడి 6 హెచ్చరికలు -
హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు.. ఉద్యోగులు ఏ నగరాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారో తెలుసా.! -
చికెన్, మటన్ కూడా దీని ముందు బలాదూర్.. స్పైసీ మష్రూమ్ చుక్కా రుచి చూశారా? -
ముఖం, జుట్టు జిడ్డుగా మారి ఇబ్బంది పెడుతుందా.. భారీ వర్షాల్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
ప్రైవేట్ పార్ట్స్ లో హెయిర్ తీయడానికి ఏ పద్ధతి బెస్ట్? -
అలా అయితేనే పెళ్లి చేసుకోండి.. రిలేషన్‌షిప్‌పై అమ్మాయిలకి సమంత పవర్ఫుల్ అడ్వైజ్.! -
వెనిజులాలో భారీ భూకంపాల బీభత్సం.. పేకమేడల్లా కూలిన భవనాలు,వేలల్లో మరణాలు!..వీడియోలు చూడండి
పాదాల నొప్పులుకు త్వరగా ఉపశమనం కలిగించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్
పాదము అనేది మనుష్యులు మరియు జంతువులలో కాలి చివరన ఉండి నడవడానికి ఉపయోగపడే నిర్మాణం. దీనిలో చీలమండ, ప్రపాదం, కాలివేళ్ళు ఉంటాయి. కాళ్ళు నడవడానికి ఉపయోగపడే అవయవాలు. పాదాలు మన శరీరం మొత్తాన్ని, జీవితాంతమూ మోస్తుంటాయి. జీవిత కాలంలో కొన్ని వందల వేల మైళ్లు పాదాలతో నడుస్తాము కనుక సహజంగానే మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు పాదాల్లో నొప్పి వచ్చే అవకాశం ఉంది. అలాగే స్థూలకాయం నుంచి కీళ్ల వ్యాధుల వరకూ అనేక సమస్యలు పాదాల నొప్పికి దారితీయవచ్చు. పాదాల్లో నొప్పి వస్తున్నప్పుడు వీటన్నిటినీ అన్ని కోణాల నుంచి ఆలోచించి సరైన చికిత్సను తీసుకోవడం అవసరం.
మన శరీరాన్నంతా మోసే పాదాలంటే చాలా మందికి నిర్లక్షం. చూడగానే కనిపించే ముఖం ముఖ్యమనుకుంటారు గానీ, పాదాలు ఏం కనిపిస్తాయిలే అని అపోహ పడుతుంటారు. అయితే పాదాల అందాన్నీ గమనించే వారుంటారు. వీటి పోషణే కాదు ఆరోగ్యమూ ముఖ్యమే. కొన్ని సందర్భాల్లో పాదాలు తీవ్ర నొప్పికి దారి తీస్తాయి. అందుకు ముఖ్యకారణం లింబ్స్ మీద ఎక్కువ పనిచేయడమే. ఎక్కువ సమయం నిలబడటం,నడక, కాళ్ళు ఎక్కువ సమయం మడవకపోవడం , చాలా టైట్ గా ఉండే షూలను ధరించడం , కాలికి గాలి చొరవకుండా ఉండటం వల్ల కాళ్లలో బొబ్బలు ఏర్పడటం వల్ల పాదాల్లో నొప్పి వస్తుంది . ఇలాంటి సమస్యలకు ఇంట్లో ఉండే కొన్ని హోం రెమెడీస్ తో నివారించుకోవచ్చు. ఈ హోం రెమెడీస్ ఉపయోగించడం వల్ల పాదాల నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు .
మరి పాదాల నొప్పిని నివారించే క్విక్ రెమెడీస్ ఏంటో చూద్దాం...
త్వరగా పాదాల నొప్పిని తగ్గించే టాప్ 10 హోం రెమెడీస్

1. సలూన్ లో చేసే విధంగా మీ పాదాలను సోక్(నానబెట్టాలి)చేయాలి:
రిఫ్రెషింగ్ మసాజ్ వల్ల పాదాల నొప్పి నివారించబడుతుంది మరియు పాదాల్లో అసౌకర్యం తొలగిసోతుంది. షూబిట్స్ మరియు బ్లిస్టర్ వల్ల పాదాలు నొప్పి మరింత విపరీతంగా ఉంటుంది. ఒక టబ్ లో చల్లటి నీరు నింపాలి, మరో టబ్ లో గోరువెచ్చని నీటిని నింపాలి . ఇప్పుడు మొదట చల్లటి నీటిలో 5 నిముషాలు పాదాలను డిప్ చేయాలి. తర్వాత 5 నిముషాలు గోరువెచ్చని నీటిలో డిప్ చేయాలి. ఇలా చేయడం వల్ల పాదాల్లో రక్తనాళాల్లో రక్తం ప్రసరించి కండరాలు వదులై, పాదాల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయి.

2. నువ్వుల నూనెతో మసాజ్ :
కొద్దిగా లవంగం నూనె మరియు నువ్వుల నూనె రెండూ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమంతో పాదాలకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి . పాదాల నొప్పి నివారించడానికి ఇది ఒక పాపులర్ హోం రెమెడీ . ఇలా రోజులో మూడు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

3. ఐస్ ప్యాక్:
పాదాల నొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగించడంలో ఐస్ ప్యాక్ గ్రేట్ గా పనిచేస్తుంది . పదాలనొప్పి తగ్గించుకోవడానికి ఇది ఒక మంచి హోం రెమెడీ . కొన్ని ఐస్ ముక్కలను ప్లాస్టిక్ కవర్ లేదా ప్లాస్టిక్ బ్యాగ్ లో వేసి నొప్పి ఉన్న ప్రదేశంలో మసాజ్ చేయాలి. ఇలా చల్లదనాన్ని అందివ్వడం వల్ల కాళ్ల వాపులు తగ్గడం తో పాటు, పాదాల నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది . ఐతే ఐస్ మసాజ్ 5 నిముషాల కంటే ఎక్కువ సమయం చేయకూడదు . స్కిన్ లేదా నరాలను డ్యామేజ్ చేస్తుంది.

4. ఆవాలు:
ఆవాలు ఒక ఉత్తమ ఫూట్ పెయిన్ రెమెడీ . ఇది బ్లడ్ సర్క్యులేషన్ ను మెరుగుపరుస్తుంది , వాపును నివారిస్తుంది. శరీరంలో టాక్సిక్ వాటర్ ను తొలగిస్తుంది. మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. గుప్పెడు ఆవాలను మెత్తగా పేస్ట్ చేసి దీన్ని అరబకెట్ గోరువెచ్చని నీటిలో వేసి మిక్స్ చేయాలి. ఆ నీటిలో పాదాలను డిప్ చేయాలి. 15 నిముషాల తర్వాత పాదాలు బయటకు తీసి పొడి బట్టతో తుడవాలి . పాదాల నుండి వెంటనే నొప్పి తగ్గిస్తుంది.

5. ఎప్సమ్ సాల్ట్ :
అరబకెట్ గోరువెచ్చని నీటిలో ఎస్సమ్ సాల్ట్ వేసి పాదాలను 20 నిముషాలు ఆ నీటిలో నానబెట్టాలి. 20నిముషాల తర్వాత బయటకు తీసి, పొడి వస్త్రంతో తడిలేకుండా తుడిచి మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి . బేబీ ఆయిల్ అప్లై చేస్తే మంచి పోషణ అందుతుంది . ఎప్సమ్ సాల్ట్ థెరఫిటిక్ ఎఫెక్ట్ ను అందిస్తుంది.

6. వెనిగర్:
పాదాల నొప్పి నివారించుకోవడానికి మోస్ట్ పాపులర్ రెమెడీ వెనిగి. షూ బిట్స్, పాదాల నొప్పి, టెండినైటిస్, కండరాల నొప్పులను నివారించడంలో వెనిగర్ గ్రేట్ . కోల్డ్ మరియు హాట్ వెనిగర్ వ్రాప్స్ ను ఉపయోగించి నొప్పి తగ్గించుకోవాలి . వెనిగర్ మరియు అదే మోతాదలో నీరు తీసుకొని రెండూ మిక్స్ చేయాలి . ఇందులో టవల్ డిప్ చేసి నొప్పి ఉన్న ప్రదేశంలో చుట్టాలి . 10 నిముషాలు అలాగే ఉండనిచ్చి తర్వాత తీసి, తిరిగి రిపీట్ చేయాలి. ఇలా రోజులో రెండు మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

7. ఎసెన్షియల్ ఆయిల్ :
యూకలిప్టస్, రోజ్ మెర్రీ, మరియు పెప్పర్ మింట్ ఆయిల్ పాదాల నొప్పిని , సలుపును మరియు వాపును తగ్గిస్తాయి . ఈ నూనెలను ఒక్కో చుక్క హాట్ వాటర్ లో వేసి బాగా మిక్స్ చేసి పాదాలను 10 నిముషాలు ఆ నీటిలో డిప్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఎలాంటి నొప్పైన క్షణంలో మాయం అవుతుంది.

8. కేయాన్ పెప్పర్:
కేయాన్ పెప్పర్ లో క్యాప్ససిన్ అధికంగా ఉంటుంది. ఇది కండరాల నొప్పులను మరియు కండరాల సలుపులను, ఆర్ధరైటిస్ మరియు లోయర్ బ్యాక్ పెయిన్ , బాధించే పాదాల నొప్పి నివారిస్తుంది. అరబకెట్ హాట్ వాటర్ లో కేయాన్ పెప్పర్ అరటీస్పూన్ మిక్స్ చేసి ఆ నీటిలో పాదాలను డిప్ చేయాలి. ఈ రెమెడీ పాద3ాల నొప్పిని తగ్గిస్తుంది.

9.లిన్ సీడ్ ఆయిల్:
హాట్ లిన్ సీడ్ ఆయిల్ ప్యాక్ తో పాదాల నొప్పి నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు. వేడినీటిలో లిన్ సీడ్ ఆయిల్ వేసి, అందులో కాటన్ టవల్ డిప్ చేసి , నీరు పిండేసి, నొప్పి ఉన్న ప్రదేశంలో వేయాలి . ఇది పాదాల నొప్పిని తగ్గిస్తుంది మరియు బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది.

10. స్ట్రెచ్చింగ్:
చెయిర్ లో కూర్చినొ, సౌకర్యవంతంగా కూర్చొని, కాళ్ళను స్టిఫ్ గా ఉంచి పాదాలను ముందుకు వెనకకుస్ట్రెచ్ చేయాలి . పాదం అడుగు బాగం స్ట్రెచ్ అయ్యేలా చూసుకోవాలి. అలా స్ట్రెచ్ చేసిన అలాగే ఒక నిముషం ఉండి తర్వాత రిలాక్స్ అవ్వాలి. తిరిగి ఇలా రోజులో 5 సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.



Click it and Unblock the Notifications