Latest Updates
-
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా.. ఈ వడను తిన్నారంటే మినప గారెలను మరిచిపోతారు.! -
బుధాదిత్య యోగం.. ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం ఇంటి ముంగిటే.! -
గంటల తరబడి ఫ్రిజ్‌లో పెట్టాల్సిన పనిలేదు.. అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టంట్ ఫిష్ ఫ్రై.! -
రెస్టారెంట్ స్టైల్ తవా చికెన్..వేళ్లు నాకుతూ తినడం గ్యారెంటీ..ఈజీగా చేసుకోండిలా.. -
35 ఏళ్లకే కోరికలు తగ్గిపోయాయా.. దాంపత్య సుఖం కోసం తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన టిప్స్.! -
తెలంగాణలో వైభవోపేతంగా ఆషాఢ బోనాలు.. రంగంలో భవిష్యవాణి చెప్పిన సంగతులివే.! -
హస్తసాముద్రికం: మీ చేతిలో ఈ రేఖ ఉంటే కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ మసాలా దోశ ఇంట్లోనే.. ఈ రెండు సీక్రెట్స్ తెలిస్తే చాలు! -
కొందరు అందంగా లేకపోయినా ఎందుకు అందరినీ ఆకర్షిస్తారో తెలుసా.? -
మందు తాగేటప్పుడు స్టఫ్ గా ఏది తినడం ఆరోగ్యానికి మంచిదో తెలుసా?
గుండె ఆరోగ్యానికి కంపల్సరీ ఫాలో అవ్వాల్సిన రూల్స్..!!
డైలీ డైట్లో కొన్ని ఆహారాలను, కొన్ని అలవాట్లను చేర్చుకుంటే.. గుండె సంబంధిత అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చు. ఈ అలవాట్లన్నీ హార్ట్ హెల్త్ ని కాపాడతాయి.
గుండె సంబంధిత వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే... మంచి ఆహారపు అలవాట్లు అలవరుచుకోవాలి. గుండె జబ్బులు రాకుండా అవగాహన కల్పించడంతోపాటు.. హార్ట్ పేషంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తూ.. నిపుణులు ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూనే ఉన్నారు.

డైలీ డైట్లో కొన్ని ఆహారాలను, కొన్ని అలవాట్లను చేర్చుకుంటే.. గుండె సంబంధిత అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చు. ఈ అలవాట్లన్నీ హార్ట్ హెల్త్ ని కాపాడతాయి. గుండె ఆరోగ్యం పదిలంగా.. పదికాలాలపాటు ఉండాలంటే.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఖచ్చితంగా కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవ్వాలి.
ప్రస్తుత రోజుల్లో ఉండే ఒత్తిడి వల్ల హైపర్ టెన్షన్, ఇమ్యునిటీ తగ్గడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. యువకులే.. ఈ రోజుల్లో.. గుండె వ్యాధులబారిన పడుతున్నారు. కాబట్టి.. ఒత్తిడి తగ్గించుకుని.. హెల్తీగా ఉండటం చాలా అవసరం.
హైకొలెస్ట్రాల్ లెవెల్స్, ఒత్తిడితో కూడిన జీవనశైలి, స్మోకింగ్, వ్యాయామం చేయకపోవడం వంటి.. అలవాట్లు.. మనకు ఎంతో ముఖ్యమైన గుండె ఆరోగ్యంపై దుష్ర్పభావం చూపుతున్నాయి. కాబట్టి.. లైఫ్ స్టైల్లో చిన్న మార్పులు చేసుకోవడం వల్ల.. హెల్తీగా ఉండవచ్చు అంటున్నారు నిపుణులు.

స్మోకింగ్ మానేయడం
స్మోకింగ్ వల్ల మన జీవితకాలం 15 నుంచి 25 ఏళ్లు తగ్గుతాయి. అలాగే ఒకవేళ మీకు స్మోక్ చేసే అలవాటు ఉంటే.. హార్ట్ ఎటాక్ రావడానికి రెండు రెట్లు ఎక్కువ అవకాశాలుంటాయి. కాబట్టి.. హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గించుకోవడానికి ఇప్పుడే.. స్మోకింగ్ నిలిపేయాలి.

ఉప్పు తగ్గించడం
ఎక్కువ మోతాదులో ఉప్పు తీసుకోవడం వల్ల.. హై బ్లడ్ ప్రెజర్ వస్తుంది. ఇది.. కరోనరీ హార్ట్ డిసీజ్ కి కారణమవుతుంది.

డైట్
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. బ్యాలెన్డ్స్ డైట్ ఫాలో అవ్వాలి. తాజా పండ్లు, కూరగాయలు, స్టార్చ్ ఫుడ్స్ అయిన బ్రెడ్, రైస్ తీసుకోవాలి.

ఆల్కహాల్
మరీ ఎక్కువ మొత్తంలో ఆల్కహాల్ తీసుకుంటే.. గుండె కండరాలు డ్యామేజ్ అవుతాయి. బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది. బరువు పెరుగుతారు. కాబట్టి.. రోజుకి రెండు యూనిట్స్ కి మించకూడదు. ఆల్కహాల్ మోతాదుని తగ్గించాలి.

వ్యాయామం
కనీసం రోజుకి 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. ఫిట్ గా ఉంటే.. మీకు మాత్రమే కాదు.. మీ గుండెకు మంచిది. అలాగే మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది.

బీపీ
రెగ్యులర్ గా హెల్త్ చెకప్ కి వెళ్తూ ఉండాలి. బీపీ, బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ లెవెల్స్ ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. అందుకు తగ్గట్టు మెడికల్ హెల్ప్ తీసుకోవాలి.

నడుము
కొలెస్ట్రాల్ బ్లడ్ వెజెల్స్ లో పేరుకుపోవడం వల్ల.. ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి.. ఎక్ట్రా వెయిట్ ఆరోగ్యంపై దుష్ర్పభావం చూపుతుంది. డైట్ లో చిన్న మార్పులు చేసుకోవడం వల్ల హెల్తీగా ఉండవచ్చు.

ఒత్తిడి
పనిలో ఒత్తిడికి గురవుతున్నారంటే.. ఆహారం సరిగా తీసుకోవడంలో కూడా ఫెయిల్ అవుతారు. స్మోకింగ్, డ్రింకింగ్ వంటి అలవాట్లు ఎక్కువ అవుతాయి. ఇలాంటివి హార్ట్ ఎటాక్ రిస్క్ ని పెంచుతాయి. కాబట్టి ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం చేయాలి.

ఫ్యామిలీ హిస్టరీ
మీ ఫ్యామిలీ హిస్టరీ ఒకసారి చెక్ చేయండి. కుటుంబంలో ఎవరికైనా.. హార్ట్ డిసీజ్ ఉందేమో చూడండి. కరోనరీ హార్ట్ డిసీజ్ స్మోకింగ్, హైబీపీ, హై కొలెస్ట్రాల్, శారీరక శ్రమ లేకపోవడం, ఒబేసిటీ, డయాబెటిస్ వంటి వాటి వల్ల కూడా రావచ్చు.

నవ్వడం
ఎప్పుడైనా నవ్వడం మీకు చాలా ప్రయోజనాలు తీసుకొస్తుంది. ఒత్తిడి తగ్గించి, భారం దింపుకోవడానికి నవ్వు చక్కటి పరిష్కారం.



Click it and Unblock the Notifications