Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన థైరాయిడ్ లక్షణాలు..!
చాలామంది హైపో థైరాయిడిజమ్ లక్షణాలతో బాధపడుతున్నారు. థైరాయిడ్ గ్లాండ్ మన గొంతు పరిమాణంను బట్టి.. బట్టర్ ఫ్లై ఆకారంలో ఉంటుంది. శరీరంలో హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. ఈ హార్మోన్స్ మెటబాలిజంపై ప్రభావం చూపుతాయి. ఒకవేళ ధైరాయిడ్ గ్లాండ్ సరైన మొత్తంలో హార్మోన్లను ఉత్పత్తి చేయలేకపోతే.. దాన్ని హైపోథైరాయిడిజంగా పరిగణిస్తారు.
థైరాయిడ్ పేషంట్స్ ఏం తినాలి ? ఏం తినకూడదు ?
సాధారణంగా డైట్ లో సరైన మొత్తంలో ఐయోడిన్ లేనప్పుడు హైపోథైరాయిడిజం సమస్య వస్తుంది. దీనికి ఆటో ఇమ్యూన్ డిసీజ్, థైరాయిడ్ గ్లాండ్ తొలగించడం, రేడియేషన్ ట్రీట్మెంట్, పిట్యూటరీ గ్లాండ్ డ్యామేజ్ అయినప్పుడు థైరాయిడ్ సమస్య వస్తుంది. ముఖ్యంగా థైరాయిడ్ సమస్య ఎక్కువగా మిడిల్ ఏజ్ లేదా వయసు పెరిగిన ఆడవాళ్లలో వస్తుంది.
థైరాయిడ్ పేషంట్స్ లో హెయిర్ ఫాల్ తగ్గించే హోం మేడ్ హెయిర్ మాస్క్ లు
థైరాయిడ్ లక్షణాలను, సంకేతాలను తెలుసుకోవడం చాలా అవసరం. ఒకసారి దీన్ని చెక్ చేసుకోకపోతే.. అనేక తీవ్ర అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. గోయిటర్, హార్ట్ ప్రాబ్లమ్స్, న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్, ఇన్ఫెర్టిలిటీ, బర్త్ డిఫెక్ట్స్ కి దారితీయవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ థైరాయిడ్ లక్షణాలపై అవగాహన కల్పించుకోవడం చాలా అవసరం.

అలసట
థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్లలో ముఖ్యంగా అలసట ఎక్కువగా కనిపిస్తుంది. ఏ చిన్న పని చేసినా.. వెంటనే బలహీనంగా, నిస్సత్తువగా మారిపోతారు. నిద్రలేచిన తర్వాత కూడా ఎనర్జీ ఉన్నట్టు ఫీలవరు.

బరువు పెరగడం
హైపోథైరాయిడిజంతో బాధపడేవాళ్లు మెటబాలిజం తగ్గిపోతుంది. దీనివల్ల లో క్యాలరీ ఫుడ్ తీసుకున్నా బరువు పెరుగుతారు. అలాగే బరువు తగ్గడం కూడా వీళ్లకు చాలా కష్టంగా మారుతుంది.

రుతుక్రమ సమస్యలు
హైపోథైరాయిడిజం కారణంగా.. థైరాయిడ్ గ్లాండ్ హార్మోన్లను ఉత్పత్తి చేయలేకపోతుంది. దీనివల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్య వస్తుంది.

హెయిర్ లాస్
జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటుంది. శరీరంలో హార్మోనల్ చేంజెస్ వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. పొడిబారుతుంది.

కండరాల నొప్పులు
థైరాయిడ్ గ్లాండ్ సరైన మొత్తంలో హార్మోన్లను ఉత్పత్తి చేయలేకపోవడం వల్ల కండరాలపై దుష్ర్పభావం చూపుతుంది. దానివల్ల కండరాలు బలహీనమవుతాయి. అలసట, కండరాల నొప్పులు ఎక్కువగా వేధిస్తాయి.

కాన్స్టిపేషన్
హైపోథైరాయిడిజం వల్ల హార్మోన్స్ లో మార్పులు డైజెస్టివ్ ట్రాక్ పైనా దుష్ర్పభావం చూపుతాయి. ఆహారం జీర్ణమవడానికి సమస్యగా మారుతుంది. దీనివల్ల కాన్స్టిపేషన్ సమస్య ఎదురవుతుంది.

డిప్రెషన్
థైరాయిడ్ గ్లాండ్ ఉత్పత్తి చేసే కొన్ని హార్మోన్స్ డిప్రెషన్ పై ప్రభావం చూపుతాయి. తక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేస్తే.. హైపోథైరాయిడిజం సమస్య ఎదురై.. ఆ వ్యక్తి అలసట, డిప్రెషన్ కి గురవుతాడు.

ఇరిటేషన్
హార్మోన్లు ఉత్పత్తి కాకపోవడం వల్ల శరీరం రకరకాల భావోద్వేగాలకు లోనవుతుంది. తరచుగా ఇరిటేషన్ కి లోనవుతూ ఉండటం థైరాయిడ్ ని సూచిస్తుంది.

మెమరీ లాస్
శరీరంలో హార్మోన్స్ తగ్గితే.. అన్నీ స్లోగా మారతాయి. మెమరీ కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది.

డ్రై స్కిన్
హైపోథైరాయిడిజం ఉన్నవాళ్లు.. చెమట పట్టడం తగ్గుతుంది. దీనివల్ల చర్మం డ్రైగా మారుతుంది. రఫ్ గా తయారవుతుంది.
చూశారుగా ఇలాంటి లక్షణాలను గుర్తిస్తే.. వెంటనే డాక్టర్ ని సంప్రదించడం మంచిది.



Click it and Unblock the Notifications
