Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
అలర్ట్: ప్రతి మహిళ చేయించుకోవాల్సిన ముఖ్యమైన టెస్ట్ లు..!!
కెరీర్, ఫ్యామిలీ అంటూ.. రెస్ట్ లేకుండా బిజీగా గడిపే మహిళా మీరు ? మీ గురించి కేర్ తీసుకోవడానికి సమయం లేకుండా గడుపుతున్నారా ? అయితే.. మీరు ఖచ్చితంగా మీ కోసం కొన్ని మార్పులు చేసుకోవాలి. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం మంచి పద్ధతి కాదు, మంచి అలవాటు కూడా కాదు.

చాలా సందర్భాల్లో మహిళలు మల్టీ టాస్కింగ్ చేస్తుంటారు. వాళ్ల కుటుంబ బాధ్యతలు, కెరీర్ కోసం పనిచేయడం, ఇంటి పనులు చేసుకోవడం, వంట వంటి రకరకాల పనులతో బిజీ బిజీగా గడుపుతారు. ఇలా అన్ని పనుల్లో బిజీగా ఉండటం వల్ల వాళ్ల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. కానీ దీనివల్ల.. భవిష్యత్ లో రకరకాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.
అంతేకాదు.. కొన్ని రకాల అనారోగ్య సమస్యలు భార్యా భర్తలు ఇద్దరిపైనా పడతాయి. అయితే కొన్ని మాత్రం కేవలం మహిళలకే వచ్చే అవకాశాలుంటాయి. కాబట్టి ఇలాంటి అనారోగ్య సమస్యలపై మహిళలకు అవగాహన ఉండటం చాలా అవసరం. చాలా సందర్భాల్లో మహిళలు సడెన్ గా అనారోగ్యానికి గురవుతుంటారు.
అయితే కొన్ని సందర్భాల్లో వాళ్లలో కనిపించే లక్షణాలను చాలా నిర్లక్ష్యం చేస్తారు. దీనివల్ల సమస్య మరింత పెద్దగా మారుతుంది. కాట్టి.. మహిళల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. టైం టు టైం పరీక్షలు చేయించుకోవాలి. మహిళలు ఖచ్చితంగా చేయించుకోవాల్సిన కొన్ని మెడికల్ టెస్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

సర్వైకల్ క్యాన్సర్ టెస్ట్
21 నుంచి 65 ఏళ్ల లోపు మహిళలు ఖచ్చితంగా సర్వైకల్ క్యాన్సర్ టెస్ట్ చేయించుకోవాలి. కనీసం 3 నుంచి 5 ఏళ్లకు ఒకసారైనా.. ఈ పరీక్ష చేయించుకోవాలి. ఎందుకంటే.. ఇది ఎక్కువగా మహిళల్లో కనిపిస్తుంది. కాబట్టి అలర్ట్ గా ఉండాలి.

బ్రెస్ట్ క్యాన్సర్
35 నుంచి 75 ఏళ్ల వయసు లోపు మహిళలు ఖచ్చితంగా రెగ్యులర్ గా బ్రెస్ట్ క్యాన్సర్ టెస్ట్ చేయించుకోవాలి. దీనివల్ల ఈ ప్రాణాంతక వ్యాధి రాకుండా జాగ్రత్త పడవచ్చు.

బోన్ మినరల్ టెస్ట్
40 ఏళ్లు దాటిన మహిళలకు బోన్ మినరల్ డెంన్సిటీ టెస్ట్ చేస్తారు. ఓస్టియోపోరోసిస్ రిస్క్ ఏమైనా ఉందా అని ఈ పరీక్ష చేస్తారు. మహిళల్లో సాధారణంగా కనిపించే ఎముకల సమస్య ఇది.

కోలన్ స్కోపీ
కోలన్ క్యాన్సర్ రిస్క్ ఉందేమో ఒక్కసారి చెక్ చేయించుకుంటే.. మొదటి దశలోనే గుర్తించవచ్చు. ఈ టెస్ట్ 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు మహిళల్లో కంపల్సరీ నిర్వహించాలి.

పీసీఓడీ స్క్రీనింగ్
ఏ వయసు మహిళల్లో అయినా.. ఈ టెస్ట్ చేస్తారు. రుతుక్రమం మొదలయినప్పటి నుంచి ఈ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ టెస్ట్ ద్వారా ఓవరీస్ లో సిస్ట్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తారు. వీటి వల్ల రుతుక్రమ సమస్యలు వస్తాయి.

ఫెర్టిలిటీ చెక్ అప్
గర్భం పొందాలని భావించే మహిళలందరికీ.. ఈ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ టెస్ట్ లో గర్భాశయం, అండశయం పనితీరు సక్రమంగా ఉందా లేదా అని పరీక్ష చేస్తారు.

డయాబెటిస్ టెస్ట్
45 ఏళ్లు వయసు దాటిన మహిళల్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ ని ఖచ్చితంగా టెస్ట్ చేయాలి. దీనివల్ల డయాబెటిస్ ముప్పు నుంచి బయటపడవచ్చు.



Click it and Unblock the Notifications
