Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
న్యూస్ పేపర్లలో చుట్టిన ఆహారాలు తింటే.. డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్..!!
ఫుడ్ సేఫ్టీ అథారిటీ కూడా.. న్యూస్ పేపర్లలో చుట్టిన ఆహారాలు తినకూడదని, ఆరోగ్యంపై దుష్ర్పభావం చూపుతాయని హెచ్చరించింది.
వేడి వేడి బజ్జీలు, పకోడాలు, స్పైసీ ఫుడ్స్ ని న్యూస్ పేపర్లలో చుట్టి ఇస్తుంటారు. చిన్న చిన్న దుకాణాల్లో, బండ్లపై అమ్మేవాళ్లు.. ఇలా న్యూస్ పేపర్లలలో ఈ ఆహార పదార్థాలను చుట్టి ఇవ్వడం చూస్తూ ఉంటాం. చాలా హాట్ హాట్ గా ఉండే ఈ ఆహారాలు చాలా టేస్టీగా అనిపిస్తాయి. కానీ.. న్యూస్ పేపర్ లో చుట్టిన ఆహార పదార్థాలు తినడం వల్ల అనారోగ్యానికి కారణమవుతాయి. ఆరోగ్యానికి హాని చేస్తాయి.

ముఖ్యంగా ఎక్కువ ఆయిల్, డీప్ ఫ్రై చేసిన ఆహారాలు న్యూస్ పేపర్ లో ఇంకుని, కెమికల్స్ ని గ్రహిస్తాయి. కాబట్టి.. ఎట్టిపరిస్థితుల్లో న్యూస్ పేపర్లో చుట్టిన ఆహారాలను తినకూడదు. అలాగే కొంతమంది ఇంట్లో కూడా ఆయిలీ ఫుడ్స్ చేసేటప్పుడు కింద న్యూస్ పేపర్లను వాడుతూ ఉంటారు. అది కూడా ఏమాత్రం మంచిది. కాదు. అసలు న్యూస్ పేపర్లో చుట్టిన ఆహారాలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో చూద్దాం..
న్యూస్ పేపర్ ప్రింటింగ్ కి ఉపయోగించే ఇంకులో ఉండే కెమికల్స్ ఆరోగ్యంపై వ్యతిరేక ప్రభావం చూపుతాయి. అలాగే అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి. ముఖ్యంగా ఇమ్యునిటీ తక్కువగా ఉండే పిల్లలు, పెద్దవాళ్లపై చాలా దుష్ర్పభావం చూపుతుంది.
ఫుడ్ సేఫ్టీ అథారిటీ కూడా.. న్యూస్ పేపర్లలో చుట్టిన ఆహారాలు తినకూడదని, ఆరోగ్యంపై దుష్ర్పభావం చూపుతాయని హెచ్చరించింది. పరిశుభ్రమైన వాతావరణంలో చేసిన ఆహారాలే ఆరోగ్యానికి మంచిదని, ఇలా ఎక్కడపడితే అక్కడ పేపర్లలో చుట్టిన ఆహరాలు ఆరోగ్యంపై దుష్ర్పభావం చూపుతాయని సూచించింది.

ఇంకు
న్యూస్ పేపర్లు ప్రింట్ చేసేటప్పుడు ఉపయోగించే ఇంకులో ఎక్కువ మోతాదులో కార్సినోజెనిక్, హానికారక కెమికల్స్ ఉంటాయి.

బ్లాడర్, లంగ్ క్యాన్సర్
న్యూస్ పేపర్ ప్రింట్స్ కెమికల్స్ ని కలిగి ఉంటాయి. అవి ఇంకుని త్వరగా డ్రైగా మార్చడానికి సహాయపడతాయి. దీంతో ఆహార పదార్థాలకు అతుక్కుపోతాయి. దీంతో బ్లాడర్, లంగ్ క్యాన్సర్ కి తీవ్ర హాని చేస్తాయి.

హార్మోన్లపై ప్రభావం
న్యూస్ పేపర్లలో ప్రింటింగ్ కి ఉపయోగించే ఇంకులో కొన్ని హానికారక కెమికల్స్ ఉంటాయి. అవి హార్మోన్ల పనితీరుపై దుష్ర్పభావం చూపుతాయి. దీంతో తీవ్రవైన అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి.

జీర్ణ సమస్యలు
న్యూస్ పేపర్ల ప్రింటింగ్ కి ఉపయోగించే ఇంకులో హానికారక కెమికల్స్ ఉపయోగిస్తారు. డీసొబ్యూటిల్ ఫ్తేలేట్ అనే కెమికల్ వాడతారు. ఇవి జీర్ణ సంబంధ సమస్యలకు కారణమవుతాయి.

సంతానోత్పత్తిపై ప్రభావం
మహిళలు మరింత ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. న్యూస్ పేపర్ ఇంకులో ఉండే కెమికల్స్ రీప్రొడక్షన్ పై సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి.



Click it and Unblock the Notifications
