Latest Updates
-
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.!
ఎడమవైపే ఎందుకు తిరిగి పడుకోవాలి...?
నిద్ర పోవడం ముఖ్యం కానీ, ఎలా పడుకుంటే ఏమిటి? అన్నది చాలా మంది అభి ప్రాయం. గాఢ నిద్ర పట్టడం ఒక్కటే ముఖ్యం కాదనీ, ఎటు తిరిగి పడు కుంటామన్నది కూడా ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుందనీ ఇటీవల నిర్వ హించిన పరిశోధనల్లో వెల్లడైంది. ఎడమ వైపు తిరిగి పడుకుంటేనే ఆరోగ్యానికి మంచిదని, గాఢ నిద్ర పట్టడం వల్ల సంతోషంగా కూడా ఉండగలుగుతారని బ్రిటన్‌లో నిర్వ హించిన పరిశోధనల్లో తేలింది.
సుమారు మూడువేల మంది మీద ఈ పరిశోధనలు నిర్వహించారు. సుమారు ఆరు నెలల పాటు వారు ఎటు వైపు తిరిగి పడుకుంటు న్నారు? నిద్ర లేచిన తరువాత వారి ప్రవర్తన, మూడ్ తదితర అంశాలను పరిశీలించారు. ఎడమ వైపు తిరిగి పడుకునే వారిలో 60 శాతం మంది తెల్లవారి సంతోషంగా, ఉల్లాసంగా ఉండగా, కుడివైపు తిరిగి పడుకునేవారిలో తెల్లవారి నిద్రలేమి, అశాంతి తదితర అంశాలను గమనించారు.
ఇక బోర్లాపడుకునే వారిలో ఆహారం జీర్ణం కాకపోవ డం పరిశోధకుల దృష్టికి వచ్చింది. ఎడమ వైపు తిరిగి పడుకుంటే ఆహారం చక్కగా జీర్ణం అవుతుందనీ, వీరిలో సానూకూల దృక్పథం కూడా ఎక్కువగానే ఉంటుందనీ, పని ఒత్తిడి అనుభవించరనీ కూడా పరిశోధకులు చెబుతున్నారు.
ఇంకా ఎడమచేతి వైపే ఎందుకు పడుకోవాలి. కుడి చేతి వైపు ఎందుకు పడుకోకూదంటే మనం ఆహారం తీసుకొన్న కొద్దిసేపటి తర్వాత పడుకుంటాం. మనం తిన్న ఆహారం అరగాలంటే జీర్ణశక్తి మంచిగా ఉండాలి. మన శరీరంలోని శోషరస గ్రంథులలతో పాటు జీర్ణాశయం, మూత్రాశయం, క్లోమం కడుపుకు ఎడమైపునే ఉంటాయి. మనం తిన్న వ్యర్థాన్ని బయటకొచ్చే సామర్థ్యాన్ని ఇవి కలిగి ఉండాలంటే వాటిపై ఎలాంటి ఒత్తిడి పడకుండా ఉండాలి. అందుకే ఎడమైపు పడుకోవటం మంచిదని డాక్టర్లు సలహాలిస్తుంటారు. వీటితో పాటు మరికొన్ని ప్రయోజనాలు....

ప్రెగ్నెన్సీలో మంచి నిద్ర పడుతుంది:
గర్భిణీలకు ఎప్పుడూ ఎడమవైపు తిరిగి పడుకోమని సలహాలిస్తుంటారు . ఇది వారికి ఒక ఐడియల్ స్లీపింగ్ పొజీషన్ . యూట్రస్ మీద ఎక్కువ ప్రెజర్ పెట్టడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది.

లింపాటిక్ డ్రైనేజ్ బెటర్ గా ఉంటుంది:
లింపాటిక్ సిస్టమ్ టిష్యు మరియు ఆర్గాన్స్ కు ఫ్లూయిడ్స్ ను మోసుకెళుతుంది. లింఫ్స్ శరీరంలో టాక్సిన్స్ ను నెట్టివేయడానికి సహాయపడుతుంది. లింఫాటిక్స్ ను బాడీలో ఎడమవైపు ఉండటు వల్ల ప్రొపర్ ఫంక్షన్స్ జరుగుతుంది.

వేస్ట్ ప్రొడక్ట్స్ ను తొలగిస్తుంది:
ఎడమవైపు నిద్రలో ఉన్నప్పుడు, చిన్న ప్రేగుల నుండి పెద్దప్రేవుల్లోకి గ్రావిటి ద్వారా నెట్టడానికి సహాయపడుతుంది. ఇది పొట్టలోని వ్యర్థాలను ఉదయం చాలా మృదువుగా తొలగింపుకు సహాయపడుతుంది.

హార్ట్ బర్న్ తగ్గిస్తుంది:
ఎడమ వైపు నిద్రించడం వల్ల గురుత్వాకర్షణ సహాయంతో శరీరభాగాలన్నింటికి రక్తసరఫరా జరిగి, గుండె మీద పనిభారం తగ్గిస్తుంది.
ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల గ్యాస్టిక్ మరియు ఎసిడిటి మరియు హార్ట్ బర్న్ సమస్యలను తగ్గించుకోవచ్చు.

బ్యాక్ పెయిన్ నివారిస్తుంది:
బ్యాక్ పెయిన్ తో బాధపడే వారు ఎడమవైపు పడుకోవడం వల్ల సౌకర్యంగా ఉంటుంది. బ్యాక్ పెయిన్ నుండి ఉపశమనం కలుగుతుంది . వెన్నెముక నుండి ఒత్తిడి తగ్గించి బ్యాక్ పెయిన్ నివారిస్తుంది.

. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల పొట్ట మరియు ప్రాక్రియాటిక్స్ నేచురల్ గా హ్యాంగ్ అవుతాయి. ఇది తిన్న ఆహారం మరింత ఎఫెక్టివ్ గా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications
